తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాతో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి S. అఘోరమ్, కల్పాతి S. గణేష్, కల్పాతి S. సురేష్ నిర్మాతలుగా ఈ సినిమా వచ్చింది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి. మరి సినిమా మీద పెరిగిన అంచనాలను సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో పదండి ఓ లుక్ వేద్దాం.
ఈ మూవీలో విజయ్ చాలా నిజాయితీ పరుడు. భారతదేశం నుంచి స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌లో అతనో రహస్య ఉద్యోగిగా ఉంటాడు. ఓ మిషన్‌పై కెన్యాలో తన స్నేహితుడితో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్(మైక్ మోహన్)ని చంపేస్తాడు. ఆ తర్వాత మరో మిషన్ మీద తన భార్య స్నేహ, తన కుమారుడు జీవన్‌తో కలిసి మరో దేశానికి వెళ్తాడు.
అక్కడ ఊహించని పరిణామాలు విజయ్‌కి ఎదురువుతాయ్. కొన్ని పరిస్థితుల కారణంగా విజయ్‌కి కొడుకు జీవన్ దూరమవుతాడు. దూరమైన జీవన్ ఏమయ్యాడు? ఎలా పెరిగాడు? తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఇక ఈ మూవీ విశ్లేషణకు వచ్చే సరికి పెర్ఫార్మెన్స్ పరంగా ఇది పూర్తిగా విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ కానీ, రెండు సాంగ్స్‌లో విజయ్ స్టెప్స్ చాలా బాగుంటాయి. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగా మెప్పించాయి. కథ, కథనం రెగ్యులర్‌గా ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనిపించేలానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్టాఫ్ చాలా వేగంగా సాగిపోతుంది. ఊహించని హీరో ఇంట్రడక్షన్ ఉంది. విజిల్స్ వేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
గమనిక: ఈ రివ్యూ ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది కేవలం ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
రేటింగ్ 2.75/5