Telugu Featured NewsTelugu Politics

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు – వారి శాఖలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రుల జాబితాను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు ఐటీతోపాటు.. హెచ్‌ఆర్‌డీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. కాగా మిగిలిన శాఖలు కేటాయింపులు క్రింది విధంగా ఉన్నాయి…

1) హోంశాఖ-వంగలపూడి అనిత

2) చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు

3) పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా

4) అచ్చెన్నాయుడు- వ్యవసాయం

5) కొల్లు రవీంద్ర- గనులశాఖ

6) నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ

7) పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి

8) సత్యకుమార్- ఆరోగ్యశాఖ

9) నిమ్మల రామానాయుడు- జలవనరులు

10) నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్

11) ఫరూక్- మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ

12) ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ

13) పయ్యావుల కేశవ్- ఆర్థిక, చేనేత, శాసనసభ వ్యవహారాలు

14) అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్

15) కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, పౌరసంబంధాలు

16) డోలా బాలవీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ

17) గొట్టిపాటి రవి- విద్యుత్ శాఖ

18) బీసీ జనార్దన్ రెడ్డి- ఆర్ అండ్ బీ

19) టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు

20) కందుల దుర్గేష్- పర్యావరణం, సాంస్కృతిక శాఖ

21) రాంప్రసాద్ రెడ్డి- రవాణాశాఖ, క్రీడలు

22) గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ

23) సవిత- బీసీ సంక్షేమం, చేనేత

24) వాసంశెట్టి సుభాష్- కార్మిక శాఖ

25) కొండపల్లి శ్రీనివాస్- చిన్న మధ్య తరహా పరిశ్రమలు.

Show More
Back to top button