Telugu Featured NewsTelugu News

దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ కు శ్రీకారం..520కి పైగా పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి..!

దేశంలోనే తొలిసారిగా.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకుగానూ, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకుగానూ, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన (వాట్సప్‌ గవర్నెన్స్‌)కు నేడు సరికొత్తగా శ్రీకారం చుట్టింది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందించనుండగా.. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ గురువారం దీన్ని అధికారికంగా ప్రారంభించడం విశేషం.

వాట్సాప్ తో అందించే సేవలివే..

మొదటి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 

తొలి విడతలో భాగంగా.. 

దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. 

వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి ఇందులో భాగంగా అందిస్తారు. 

ఎలా పనిచేస్తుందంటే..

ప్రజలు ఏవైనా వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే.. ఈ వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేస్తే వెంటనే ఒక లింక్‌ బై డిఫాల్ట్ వస్తుంది. అందులో పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా వంటి వివరాలు పొందుపరిచి, సంబంధిత వినతి లేదా ఫిర్యాదును టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబర్ వస్తుంది. దాని ఆధారంగానే తదుపరి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉందనే స్టేటస్ 

తెలుసుకోవచ్చు. 

*ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేయడం ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. 

*రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని సైతం వాట్సప్‌లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్‌ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్‌ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు.

*ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువీకరణ, నో ఎర్నింగ్‌.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్‌ ద్వారా పొందవచ్చు. 

*ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చేసిన దరఖాస్తుల స్టేటస్‌ ను తెలుసుకోవచ్చు. 

*విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా పే చేయచవచ్చు. 

*ట్రేడ్‌ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లను సైతం పొందవచ్చు. 

*ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్‌ సర్వీస్, రిఫండ్, ఫీడ్‌బ్యాక్‌ తదితర సేవలు పొందవచ్చు.

*పరీక్షల హాల్‌ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సప్‌ ద్వారా పొందవచ్చు. ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వనుండగా.. సర్టిఫికెట్‌లో తప్పులు ఉన్నా.. తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. 

*భవిష్యత్తులో మరింత మెరుగ్గా ‘మన మిత్ర’ అమలు.. ప్రజలే బటన్‌ నొక్కే విధానం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తరహాలో ప్రజా సేవలూ వేగం పుంజుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో పౌరుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఫోరెన్సిక్, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలి. 

వాట్సాప్ ద్వారా సేవలందించేందుకు గతేడాది అక్టోబరు 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. 

రాష్ట్రాన్ని డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

‘ఒప్పందం చేసుకున్నట్లే 3 నెలల్లోనే తొలిదశ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ  ఉంటాయి. ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారి అవుతుంది. ఎక్కువమంది ఒకేసారి వాడకం వల్ల సర్వర్‌ సమస్యలు తలెత్తవచ్చు. లోడ్‌కి తగ్గట్టుగా సర్వర్ల పెంపు వంటి వాటిని 2 రోజుల్లో పరిష్కరిస్తాం.. 

దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంది. పౌరసేవలు అందివ్వడంతోపాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. దీనికోసం అధికారిక వాట్సప్‌ నంబర్‌ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంది. పౌరసేవలు అందివ్వడంతోపాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు.

Show More
Back to top button