అక్టోబర్ 29న హైదరాబాద్ గచ్చిబౌలి గ్రౌండ్లో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన CBN గ్రాటిట్యూట్ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో దానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలివచ్చిన అభిమానులు, ఐటీ ఉద్యోగులు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ జర్నలిస్టులు రమేష్, మూర్తి ‘జై చంద్రబాబు, సీబీఎన్ జిందాబాద్, మేము సైతం బాబు కోసం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు CBN గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు 25 ఏళ్లక్రితం ముందుచూపుతో ఏర్పాటు చేసిన సైబర్ టవర్స్ నేడు ఐటీరంగ అభివృద్ధికి ఐకాన్‌గా మారిందని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ నిపుణులు అన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వనరులు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎంగా CBN చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, ఆయన సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఇక బిల్‌గేట్స్‌ను, పలు అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో, CBN విజన్ వల్లనే ఈ రోజు భాగ్యనగరం విశ్వనగరం స్థాయిలో డెవలప్ అయిందని అని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి అన్నారు.
* ‘బాబు తో కలిసి మనం దీపావళిని చేసుకుందాం’
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘చంద్రబాబు పేరే ఒక బ్రాండ్. ఆయన జైలుకు వెళ్లిన తర్వాత నేను వినాయక చవితి, దసరా పండుగ జరుపుకోలేదు. ఆయన తప్పకుండా బయటకు వస్తారు. ఈయనతో కలిసి మనం దీపావళిని బాగా చేసుకుందాం. అవసరం అయితే చంద్రబాబు కోసం నేను చచ్చిపోతా. నా ఆయష్షు కూడా ఆయనకు ఇవ్వాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని బండ్ల గణేశ్ అన్నారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్ సంఘం అధ్యక్షురాలు తేజస్విని మాట్లాడుతూ.. ‘మంచి చేసిన చంద్రబాబును తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అమెరికాను సైతం ఇటువైపు చూసేలా చేసిన వ్యక్తి బాబు.
రాష్ట్రాన్ని తన కుటుంబంగా మార్చుకుని విద్యార్థులు, యువత కోసం తపన పడిన ఆయన..
ఐఎస్బీ, ట్రిపుల్ఐటీ, గచ్చిబౌలి స్టేడియం, మైక్రోసాఫ్ట్, జీనోమ్‌వ్యాలీ ఇలా ఎన్నో తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు’ అని అన్నారు.