Telugu News

క్రెడిట్ స్కోర్‌ను పదేపదే చెక్ చేస్తే తగ్గుతుందా? నిజం ఏమిటి?

రుణం తీసుకునే ముందు చాలా మంది తమ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్ ఎలా ఉందో అని చూస్తుంటారు. కానీ ఇలా పదేపదే చెక్ చేయడం వల్ల స్కోర్ తగ్గిపోతుందనే అపోహ చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు బ్యాంకు వద్ద రుణానికి అప్లై చేయనప్పుడు స్వయంగా స్కోర్‌ను చెక్ చేస్తే, లేదా మీ కంపెనీ చూసినప్పటికీ, అది సాఫ్ట్ ఎంక్వైరీ (Soft Inquiry)గా పరిగణించబడుతుంది. దీని వల్ల మీ స్కోర్‌ మీద ఎలాంటి ప్రభావం ఉండదు.

కానీ మీరు రుణం కోసం అప్లై చేసిన తర్వాత, బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలు మీ క్రెడిట్ నివేదికను అధికారికంగా పరిశీలిస్తే, దాన్ని హార్డ్ ఎంక్వైరీ (Hard Inquiry) అంటారు. ఇది స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

హార్డ్ ఎంక్వైరీల వల్ల:

స్కోర్ 3 నుండి 10 పాయింట్ల వరకూ తగ్గే అవకాశం ఉంటుంది

ఇది పూర్తిగా మీ క్రెడిట్ చరిత్ర, ప్రస్తుత స్కోర్, ఎంక్వైరీ తత్వం మీద ఆధారపడి ఉంటుంది

ఎక్కువ హార్డ్ ఎంక్వైరీలు రుణ దాతలకి నష్టభయాన్ని చూపిస్తాయి

అందుకే స్కోర్‌ను స్వయంగా ఎన్ని సార్లు చూసినా హానీ లేదు. కానీ రుణాలకు సంబంధించి వరుసగా బ్యాంకులు చెక్ చేస్తే మాత్రం జాగ్రత్త అవసరం.

Show More
Back to top button