Telugu News

క్రెడిట్ స్కోర్: మీకున్నసందేహాలయివేనా?

క్రెడిట్ కార్డు సరైన విధంగా ఉపయోగిస్తే, అది మనకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకునే క్రమంలో చాలామందికి కొన్ని అపోహలు, భ్రాంతులు ఏర్పడతుంటాయి. వాటిని తొలగించుకోవడం ఎంతో అవసరం.

ఆదాయం ఎక్కువైతేనే స్కోర్ ఎక్కువ అవుతుందా?

చాలామంది ఆదాయం ఎక్కువగా ఉంటేనే క్రెడిట్ స్కోర్ బాగుంటుందనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. మీ ఆదాయాన్ని కాకుండా, మీరు అప్పు తీసుకున్న తర్వాత బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నారా లేదా, ఎంత క్రెడిట్‌ను వాడుతున్నారన్నదే స్కోర్‌కి అసలైన ప్రమాణాలు.

ఎక్కువగా కార్డ్ వాడితేనే స్కోర్ పెరుగుతుందా?

మరొక అపోహ ఏమంటే, కార్డును ఎక్కువగా వాడితేనే స్కోర్ పెరుగుతుందని అనుకోవడం. కానీ నిజానికి, మీ క్రెడిట్ లిమిట్‌లో 30% నుంచి 40% లోపే ఖర్చు చేయడం మంచిది. అది నిబద్ధతను చూపుతుంది. లిమిట్‌ను పూర్తిగా వినియోగించుకుంటే స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.

పాత ఖాతాలు మూసివేయడం మంచిదా?

పాత బ్యాంకు ఖాతాలు లేదా క్రెడిట్ కార్డులను రద్దు చేస్తే స్కోర్ పెరుగుతుందని అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ ఇది కూడా ఒక అపోహే. క్రెడిట్ హిస్టరీ ఎక్కువగా ఉండటం వల్లే స్కోర్ మెరుగవుతుంది. కాబట్టి పాత ఖాతాలను అవసరం లేకపోతే ఆపవద్దు.

స్కోర్ పడిపోయిన తర్వాత తిరిగి పెరగదు అనుకోవడం సరైనదా?

చాలామందికి ఒక అపోహ – స్కోర్ ఒక్కసారి పడిపోయిందంటే ఇక పెరగదు. కానీ ఇది అసత్యం. మీరు క్రమంగా బిల్లులను సమయానికి చెల్లిస్తుంటే, క్రెడిట్ స్కోర్ మళ్లీ మెరుగవుతుంది. ఇక్కడ ఓపిక, పట్టుదల ముఖ్యం.

ఇలాంటి అపోహలు మీలో కూడా ఉంటే, ఇవాళ్టితో వాటిని పక్కన పెట్టండి. విధిగా చెల్లింపులు, బుద్ధిగా వినియోగం అనే రెండు నిబంధనలు పాటిస్తే మంచి క్రెడిట్ స్కోర్ మీదే!

Show More
Back to top button