
చిన్న అకేషన్ నుంచి పెద్ద వేడుక వరకూ.. పండుగలు, పెళ్లిళ్లు ఇలా రకరకాల ఈవెంట్స్, సెలబ్రేషన్స్ కోసం మనం రెగ్యులర్ గా షాపింగ్ మాల్ కి వెళ్లి షాపింగ్ చేస్తుంటాం. కానీ టైం లేనప్పుడు.. కుదరనప్పుడు ఆన్లైన్ షాపింగ్ ను ఆశ్రయిస్తుంటాం.
అలా చేసినప్పుడు.. ఆన్లైన్ లో ఏదైనా మంచి డ్రెస్ చూసినప్పుడు మనకు ఎలా ఉంటుందనే సందేహం ఉంటుంది. ఒకటి దాన్ని బై చేయడం లేదా మళ్ళీ మాల్ కి వెళ్లి ట్రయిల్ వేయడం చేయాలి. ఇకపై ఆ అవసరం లేకుండా గూగుల్ ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో జస్ట్ ఒక ఫొటోతో ఆ డ్రెస్ మీకెలా ఉందో సరిచూసుకోవచ్చు. దాని పేరే డోప్ (Doppl). వర్చువల్ గా మీరెలా ఉంటారో చూసుకునేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేసేవారికి ఈ యాప్ బాగా యూస్ అవుతుందన్నమాట.
ఈ యాప్ లో ముందు మీ పూర్తి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై మీరు కోరుకుంటున్న డ్రెస్ తాలుకా ఫొటో లేదా స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేస్తే చాలు.. ఏఐ సాయంతో మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో రిఫరెన్స్ ప్రివ్యూ చూపిస్తుంది. అంతేకాదు దాన్నో షార్ట్ వీడియోగానూ చేసి, ఇస్తుంది. అంటే మీరు ట్రయల్ రూమ్ లో చూసుకున్నట్లుగానే అచ్చంగా చూసుకోవచ్చు.
కావాలంటే ఈ ఫొటోలను, వీడియోలను మీరు సేవ్ అండ్ షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ల్యాబ్స్ తీసుకొచ్చిన ఈ యాప్ ప్రస్తుతానికి ఎక్సపెరిమెంటల్ స్టేజ్ లోనే ఉంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంకా భారత్ లో యూజర్లు దీన్ని వినియోగించాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అంతేకాక మీరు కేవలం షర్ట్/ టీషర్ట్ అప్లోడ్ చేసినా దానికి సూట్ అయ్యే మిగిలిన దుస్తులు, షూలను కూడా దానంతట అదే ఎంచుకొని యూజర్లకు చూపించడం దీని ప్రత్యేకత.
ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని రోజుకో భలే క్రేజీ యాప్ లు పుట్టుకొస్తున్నాయి.