
బంగ్లాదేశ్ ఇప్పుడ భారత్‌కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం అక్కడి సైనికాధికారులకూ, తాత్కాలిక ప్రభుత్వా నికి ఏమాత్రం ఇష్టం లేదు. హసీనాపై కోపం కొద్ది ఆమె తండ్రి ఒకప్పటి నివాసాన్ని ఆందోళనకారులు తగుల బెట్టారు. 1972లో ఈ భవనంలోనే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబ్ వూర్ రెహమాన్ని తిరుగుబాటుదారులు హత్య చేశారు. ఆ సమయంలో ఆయన కుమార్తె షేక్ హసీనా, ఆమె సోదరి విదేశాల్లో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.
ఆనాటి ద్వేషాగ్నిని తిరిగి రగిలించడంలో షేక్ హసీనా ప్రత్యర్ధులు కృతకృత్యులయ్యారు. షేక్ హసీనాని భారత్ నుంచి రప్పించేందుకు వారు దౌత్యమార్గాల ద్వారా ప్రయత్నించారు. ఆమెపై అవినీతి కేసుల విచారణకు స్వదేశం పంపాలని మన ప్రభుత్వానికి అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేత, తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ లేఖ రాశారు.
షేక్ హసీన ప్రధానిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికార నివాసాన్ని మ్యూజియంగా మార్చారు. ఆయన స్మృతులను ఈ భవనంలో భద్రపర్చారు. ఈ భవనంపై జరిగిన దాడిపై ఆమె వ్యాఖ్యానిస్తూ, ఈ భవనాన్ని తగులబెట్టారు కానీ, ప్రజల హృదయాల్లో బంగబంధు స్మృతిని చెరిపి వేయలేరంటూ ఆమె వ్యాఖ్యానించారు. తనను హత్య చేసేంతదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ తీవ్రంగా స్పందించారు. భారత్లోని బంగ్లాకమిషనర్ని వెనక్కి రమ్మనమని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ హసీనా హయాంలో భారత్‌కి అనుకూలంగా ఉండేది. అందువల్లే ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చిందనేది అక్కడి ఆందోళనకారుల వాదన.
అయితే, బంగ్లా దేశ్ ఒకప్పుడు భారత్లో అంతర్భాగం కావడం వల్లనే, భాషా సంస్కృతుల బంధం కారణంగా బంగ్లాదేశీయులకు మన దేశం సాయం అందజేస్తోంది. ఇటీవల ఆ దేశ ప్రధాని మహ్మద్ యూనస్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ట్లోనూ, పాక్ మంత్రులతోనూ మంతనాలు జరిపారు. ఆయనకు చైనా అండదండలున్నాయి. ఉపఖండంలో చిన్న దేశాలను భారతికి వ్యతిరేకంగా పురికొల్పేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. శ్రీలంక, నేపాల్, భూటాన్ తదితర దేశాలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనా భారత్‌కు వ్యతిరేక కూటమిని నిర్మించేందుకు చైనా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇవి ఎంత వరకూ ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం.