Telugu News

ఇంటర్నెట్ లేకున్నా ఉపయోగించే ఏఐ ఎడ్జ్ యాప్.!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోజుకో కొత్త పుంతలు తొక్కుతోన్న వేళ.. టెక్నాలజీ దిగ్గజం ఆయిన గూగుల్ సంస్థ… స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని డిఫరెంట్ అండ్ ఇంట్రెస్ట్ గా మార్చేందుకు ఓ క్రేజీ యాప్ ను తీసుకొచ్చింది. అదే ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. దీనిద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్ ను ఆఫ్ లైన్ లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్లను క్రియేట్ చేయడం, కోడ్ రాయడం, కావాల్సిన సమాధానాలు రాబట్టడం లాంటివి. ఇందులో చెప్పుకోదగ్గ బెనిఫిట్ మరోటి ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది కలుగదు. రిస్క్ తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా అనేది క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే బ్యాక్ఎండ్ లో రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ రిస్క్ ను తగ్గిస్తుంది. చాలా వేగంగా వర్క్ చేస్తుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి సపోర్టింగ్ గా ఉంటుంది. 

కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ ఒక సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదంటే నమ్ముతారా..? 

పెద్ద మొత్తంలో టెక్ట్స్ ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్ ను క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లను అనలైజ్ చేయడం, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలదు.  

ప్రస్తుతానికి ఈ యాప్ ను ప్రయోగాత్మక ఆల్ఫా విడుదలగా గూగుల్ పేర్కొంటుంది. ఓపెన్ సోర్స్ లో ఇప్పటికే ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. కావలసిన మార్పులు చేయవచ్చు. వాణిజ్య మార్కెటింగ్ ఉత్పత్తుల్లో యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ అనేది మొబైల్ లోనే కాక ఐఓఎస్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త యాప్ యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటూ.. మంచి సర్వీసెస్ ను పొందేలా హెల్ప్ చేస్తుంది.

Show More
Back to top button