Telugu News

చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.? అయితే నష్టాలు తప్పవు

పోయిన వారు తిరిగి రారు ఉన్నవారు పోయిన వారి తీపి గుర్తులు అంటారు పెద్దలు. మన ఆత్మీయులు సన్నిహితులు కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు మరణిస్తే వారిని తలచుకుంటూ వారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతాం. కొందరు  వారి ఫోటోలను జ్ఞాపకార్ధంగా ఇంట్లో పెట్టుకుంటారు. అయితే చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే దానిపై వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రంలో అనేక విషయాలు తెలియజేయబడ్డాయి.

చాలామంది తమ కుటుంబాలలో చనిపోయిన పెద్ద వాళ్ళ ఫోటోలను ఇంట్లో జ్ఞాపకాలుగా పెట్టుకుంటారు. కొంతమంది దేవుడి గదులలో, కొందరు పడకగదులలో, మరికొందరు హాలులో మరణించిన వారి ఫోటోలను దండ వేసి జ్ఞాపకంగా పెడతారు. వారి జ్ఞాపకాలను ఆ ఫోటో ద్వారా వెతుక్కుంటూ ఉంటారు. మరి కొంతమంది చనిపోయిన వారు దేవుడితో సమానం అని చనిపోయిన వారి  ఫోటోలను వారి దేవుడు గదిలో పెట్టుకోవడం వల్ల చనిపోయిన వారి ఆశీర్వాదం కుటుంబ సభ్యులకు లభిస్తుందని భావిస్తారు. కానీ ఇలా దేవుడు గదుల్లోనూ లివింగ్ రూమ్ లో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదే అంటారా? అలా చనిపోయిన పెద్దల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దురదృష్టం వెంటాడుతుందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఏదిశలో పెడితే మంచిది, వాటిని ఎక్కడ ఉంచితే మంచిది అని అనే ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

చనిపోయిన మన పెద్ద వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం గురించి ఎన్నో శాస్త్రాల్లో రాయబడి ఉంది. చనిపోయిన వారు దేవుళ్ళతో సమానం కాబట్టి వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వారి దీవెనలు మనకు లభిస్తాయి అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఇండ్లలో పెట్టుకోవడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది. చనిపోయిన వారితో ఈ బంధం ఏ విధంగా ఉందో కూడా వారి ఫోటోలు ఏ స్థానంలో పెట్టాలి అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చనిపోయిన మీ అమ్మ నాన్న ఫోటోలను పెట్టుకోవాలి అనుకుంటే వారితో మీ సంబంధ బాంధవ్యాలు కచ్చితంగా ఎంతో ప్రేమ పూర్వకంగా ఉంటాయి కాబట్టి మీరు వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకోవచ్చు. కష్టకాలంలో వారిని గుర్తు చేసుకుంటూ వారి దీవెనలు కోసం ప్రార్థించడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆశీర్వాదం కూడా మీరు పొందవచ్చు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.

ఇంకా చెప్పాలంటే ఇలా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకొని వారిని గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల భౌతికంగా వాళ్ళు దూరమైనప్పటికీ మీరు మానసికంగా వారితో కలిసి ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మన శాస్త్రాల ప్రకారం చనిపోయిన వారు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటారు. వారి ఆత్మలకు చావు ఉండదు కాబట్టి చనిపోయిన వారి ఆత్మలు వారి ఇష్టమైన వారితోనే ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటాయి. అందుకే పెద్దవాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ల ఆశీర్వాదం ఎప్పుడు మన మీద కురుస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మనకు జరగబోయే ప్రమాదాల నుండి కూడా వాళ్ళు ముందుగానే కాపాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీకు చనిపోయిన వాళ్ళు కలలోకి వచ్చారా? వచ్చే ఉంటారు. దాని అర్థం ఆత్మీయులు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టు వెళ్లరు అని. వాళ్లు మీకు ప్రమాదాలను కలలోనే ముందుగానే చూపిస్తూ ఆ ప్రమాదాలకు తగిన పరిష్కారాలను కూడా అందిస్తూ ఉంటారు. మనకు భౌతికంగా దూరమైన పెద్ద వాళ్ళ ఫోటోలను పెట్టుకోవడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

నష్టాలు కూడా ఉన్నాయి 

అంతేకాదు చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మనం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులను మన వాళ్ళు దూరమైన క్షణాలను మనం ఎప్పటికీ కూడా జీర్ణించుకోలేం. వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో చనిపోయిన వారి ఆత్మలు మన కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. చనిపోయిన వారి ఆత్మలు మనశ్శాంతిని కోల్పోయి మన చుట్టూ తిరుగుతూ మళ్లీ మన వద్దకు రావాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆత్మకు శరీరం ఉండదు కాబట్టి చేరుకోలేని అసంతృప్తితో ఆత్మలు మీ చుట్టే తిరుగుతూనే ఉంటాయి.

ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో కూడా ఆత్మకు మోక్షసిద్ధి కలిగించేందుకు కొన్ని పద్ధతులను చెప్పారు. ఆ ఆచారాలను మనస్పూర్వకంగా మనం పాటించాల్సి ఉంటుంది. అందుకే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. చనిపోయిన వారి గురించి ప్రతిరోజు పదే పదే తలుచుకుంటూ వారి జ్ఞాపకాలలో మునిగిపోతూ ఉన్నట్లయితే వారి ఆత్మకు ఎప్పటికీ కూడా విముక్తి లభించదు. మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు మన గుండెలు పిండేసినట్టు ఉంటుంది. మన ఆత్మీయులు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థంగా వాళ్ళ బట్టలు, వారి ఆభరణాలు, వారి ఫోటోలు వంటివి మనం ఎంతో ప్రేమగా దాచి పెట్టుకుంటాం.

అయితే ఎక్కువ కాలం పాటు వారిని తలుచుకుంటూ పదేపదే దుఃఖించకూడదు. చనిపోయిన తర్వాత వ్యక్తి యొక్క ఆత్మ తమ కుటుంబ సభ్యుల మధ్య తిరగాడుతూ ఉంటుంది. తమ కుటుంబం బాధపడడం చూసి ఆత్మ కూడా బాధపడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మకు యమలోకానికి వెళ్లేందుకు శక్తి ఉండదు. అయితే చనిపోయిన 11 రోజులకు కుటుంబ సభ్యులు చేసే పిండ ప్రదానం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. ఆత్మకు యమలోకానికి వెళ్లే శక్తిని కూడా అందిస్తుంది. ఈ సమయంలో మీరు చనిపోయిన వారిని ఎక్కువగా తలుచుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే చనిపోయిన వారి ఆత్మ కూడా మిమ్మల్ని చూసి దుఃఖసాగరంలో మునిగిపోతుంది.

ఇక్కడే మీ ప్రేమ పాశంలో ఉండిపోతూ యమలోకానికి వెళ్లే శక్తిని కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే జీవుడు మాయను త్యజిస్తాడో అప్పుడే అతనికి ఆత్మ శాంతి కలుగుతుంది. చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళని పదే పదే తలుచుకోవడం గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. అందుకే ఆత్మ వృత్తి లోకంలో చిక్కుకుపోయి ఉంటుంది.  యమలోకానికి వెళ్లే ద్వారాలు తెరుచుకోవు. అదే సమయంలో ఆత్మ కూడా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాంత్రిక శక్తులు ఆ ఆత్మను తమ సొంత లాభం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఆత్మకు ఎంతో కష్టం కలుగుతుంది. ఇంతవరకు మనల్ని ఎంతో ప్రేమించి ప్రేమ అనురాగాలు పంచిన ఆత్మీయుల ఫోటోలు పెట్టుకోకూడదు అని తెలుసుకున్నాం. అయితే మనం బతికున్నంత కాలం మనల్ని ఎంతగానో బాధ పెట్టి మనకు దూరమైన వారి ఫోటోలను పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకోకూడదు అనే సమాధానమే మనకు పండితులు చెబుతారు. దీనికి కారణం ఏమిటంటే చనిపోయిన తర్వాత కూడా ఆత్మ తన పూర్వ సంస్కారాన్ని పోగొట్టుకోలేదు. చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకనే చనిపోయిన వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టి దుఃఖానికి కారణమైతే వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. మీ ఆత్మీయులు చనిపోయిన తర్వాత వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు తెలిసి ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా మనం మన పూర్వీకుల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చు.

చనిపోయిన వారి ఫోటోలను అందరి దృష్టి పడే చోట అసలు పెట్టవద్దు అని శాస్త్రాల్లో రాయబడింది. బయట వ్యక్తులు ఎవరైనా చనిపోయిన మన పూర్వీకులు ఫోటోలను చూస్తే దానివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా చేరిపోతుంది. అందుకనే లివింగ్ రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారి ఫోటోలను పెట్టవద్దు. చాలామంది బెడ్ రూమ్ లో తమ చనిపోయిన ఆత్మీయులు ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా సరైనది కాదు. పడుకునే చోట చనిపోయిన వారి ఫోటోలు ఉండకూడదు. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు జరుగుతూ ఉంటాయి.

మీరు కూడా ఉదయం లేచిన వెంటనే చనిపోయిన వారి ఫోటోలు చూడకపోతే మంచిది. చనిపోయిన ఆత్మీయులతో మీరు ఎంతగా కనెక్ట్ అయి ఉన్నా కానీ వారిని ప్రతిరోజు గుర్తు చేసుకుని వారు భౌతికంగా మన దగ్గర లేరు అనే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. దానివల్ల సైకలాజికల్ గా కూడా మన మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా డిప్రెషన్లోకి జారిపోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన మన పూర్వీకులు ఫోటోలను ఎప్పుడూ కూడా ఉత్తరం దిక్కున పెట్టాలి. దక్షిణం వైపు పిత్రు లోకం ఉంటుంది అని అంటారు. అందుకనే ఉత్తరం దిక్కున చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

ఉత్తరం దిక్కున ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే ఉత్తరం గోడకి మాత్రమే చనిపోయిన వారి ఫోటోలను పెట్టాలి. దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో సుఖశాంతులు తగ్గిపోతాయి. ఇక దేవుడితో సరి సమానంగా దేవుడు గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పూర్వికులకు, దేవుళ్లకు వేరువేరు స్థానాలు ఉన్నాయి. పూజ గదిలో దేవుని ఫోటోలతో పాటు చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం వల్ల ఎన్నో కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారి ఫోటోలతో పాటు బతికున్న వారి ఫోటోలను పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బతికున్న వారి ఆయుషు కూడా క్షీణిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.

Show More
Back to top button