
ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ చాలా ఆదరణ పొందిన విషయం మనకు తెలిసిందే.. సాధారణ ఏఐ అసిస్టెంట్ స్థాయి నుంచి డిజటల్ స్థాయిలో అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటోంది. మొదట్లో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటానికి మాత్రమే దీనిని డిజైన్ చేసినప్పటికీ, ఇదిప్పుడు కోడింగ్, బిజినెస్ స్ట్రాటజీస్, ఎన్నో కష్టమైన పనులను తేలిక చేసేలా.. ఒక ఫ్రెండ్లీ రోబోగా మారింది.
మనుషుల్లానే.. మాటలు వినేందుకు, తిరిగి బదులు చెప్పేందుకు అనువుగా ఉంది.
స్టూడెంట్స్ నుంచి ఉద్యోగులు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ వరకు ఎంతోమంది దీన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు.
ఎంత ఉపయోగకరమైనదైనా చాట్‌జీపీటీతో కొన్ని విషయాలు పంచుకోకపోవటమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. దీన్ని కేర్ ఫుల్ గా వాడుకోవాలే తప్ప, పర్సనల్ సమాచారం అందిస్తే భవిష్యత్తులో తమ ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మన ఫుల్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ డీటైల్స్, బ్యాంక్ డీటైల్స్, పాస్‌వర్డ్.. ఇలాంటివేవి చాట్‌జీపీటీతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు.
నిజానికి ఏఐ మోడళ్లు మన డేటాను స్టోర్ చేసుకోకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండటం సో బెటర్ కదా..
వ్యక్తిగత, రహస్య విషయాలను ఆన్‌లైన్‌లో డిస్కస్ చేసేముందు అలర్ట్ గా ఉండాలి. చాట్‌బాట్‌ను ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉపయోగించుకునేటప్పుడు కూడా చెప్పే విషయాల పట్ల జాగ్రత్త వహించాలి.
సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంచాల్సిన కొన్ని ముఖ్యమైన ఆఫీసు డాక్యుమెంట్లు, బిజినెస్ స్ట్రాటజీస్, ప్లాన్స్.. ఇతరత్రా ముఖ్యమైన విషయాలను చాట్‌జీపీటీతో పంచుకోవద్దు. దీని వెనుక సైబర్ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉండొచ్చు.
కొత్త విషయాల గురించి తెలుసుకునేందుకు, నాలెడ్జ్ పెంచుకునేందుకు చాట్‌జీపీటీ ఉపయోగపడే మాట నిజమే అయినా అదిచ్చే సలహాలు వైద్య, న్యాయ, ఆరోగ్య నిపుణులకు పూర్తిగా ఆల్టర్నేట్ అయితే అవ్వవు. ఏఐ సృష్టించిన సమాచారం మీద అంత గుడ్డిగా, అతిగా ఆధారపడొద్దు. అవసరమైనప్పుడు డాక్టర్ లేదా లాయర్ ను డైరెక్ట్ గా సంప్రదించి, కచ్చితమైన సలహాలను తీసుకోవాలి.
ఏఐ మోడళ్లు నైతిక ప్రమాణాలననుసరిస్తాయి. అందువల్ల హానికర, అక్రమ, అనుచిత చర్చలను అది యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి అంశాలను ఎక్కువగా చర్చిస్తే యాక్సెస్ పరిధి అనేది తగ్గుతుంది. దీంతో క్లారిటీ లేని జవాబులు అందించవచ్చు. అప్పుడు మనం కన్ఫ్యూజన్ లో పడాల్సి వస్తుంది. అందువల్ల చాట్ జీపీటితో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయవద్దు.
భవిష్యత్తులో చేసే పెట్టుబడి, రిటర్న్స్ వ్యూహాల కోసం ఏఐ మీద ఆధారపడితే పొరపాట్లకు, తప్పుడు నిర్ణయాలకు దారి తీయొచ్చు.
తమ ఆలోచనలను, జరిగిన సంఘటనలను పంచుకునేందుకు సాయపడినా.. అది కేవలం ఏఐ మోడలే గానీ మన ఫ్రెండ్లీ అడ్వైజర్ కాదనే విషయం గ్రహించాలి.