Telugu News

రావి చెట్టును ఏ సమయంలో పూజిస్తే మేలు?!

సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

ప్రకృతిలో అనేక వేల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల చెట్లను భగవంతుని రూపాలుగా భావించి, పూజిస్తాం. అలాంటి పవిత్ర వృక్షాలలో రావిచెట్టు చెప్పుకోదగ్గది. 

రావిచెట్టులో ఎల్లప్పుడూ సకల దేవతలు కొలువై ఉంటారని మనకు సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుందని సైన్స్ కూడా చెబుతోంది. రావిచెట్టు సహజంగా ఎక్కువ ఆక్సిజన్ ను అందించే వృక్షమని, కాలుష్యాన్ని సైతం ఫిల్టర్ చేయగల శక్తి ఆ చెట్టుకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. భక్తితో రావిచెట్టును పూజించి, దీపం వెలిగిస్తే, తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి గట్టెక్కుతామనే ప్రగాఢ విశ్వాసం ఉంది. అందువల్ల రావి చెట్టును పూజిస్తే వచ్చే ఫలితం, మంచి గురుంచి ఈరోజు తెలుసుకుందాం:

ముందుగా రావిచెట్టును పూజించేందుకు కొన్ని నియమాలున్నాయి. వాటిని సరిగా పాటించకపోతే కొన్ని అనర్థాలు జరిగే అవకాశము లేకపోలేదు. వైదికశాస్త్రం ప్రకారం ఉదయం లేదా సాయంత్రం రెండిటిల్లో ఏదో ఒక సమయాన రావిచెట్టు కింద దీపం వెలిగించడం అనేది శ్రేయస్కరం! 

ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు 7సార్లు ప్రదక్షిణలు చేసి, దీపం వెలిగిస్తారో అప్పుడు వారి ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయనీ నమ్మకం. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభం. అందుచేత రాత్రిపూట రావిచెట్టు ముందు దీపం వెలిగించవద్దు. ఈకాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి.

రావిచెట్టు ముందు దీపం వెలిగించడం కోసం ఆవనూనెను మాత్రమే ఎంచుకోవాలి. పూజాపరమైన కార్యక్రమాల్లో ఆవనూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అలాగే గురు, శనివారాల్లో రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులుగా భావించి, దీపం పెట్టవచ్చు.

Show More
Back to top button