Telugu News

బ్యాంకులు లోన్ ఇవ్వడం లేదా? అయితే ఇలా చేయండి..

అప్పులిచ్చే వ్యాపారులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. అందుకే చాలామంది రుణం కోసం బ్యాంకును సంప్రదిస్తుంటారు. కానీ, కొన్నిసార్లు బ్యాంకులు వివిధ కారణాలు చెప్పి లోన్ అప్లికేషను రిజెక్ట్ చేస్తుంటాయి. మీకు కూడా అలాంటి సంఘటనే ఎదురైతే మీరు ఏం చేయాలి? ప్యూచర్లో బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నవారు రుణ అర్హతను ఎలా మెరుగుపరుచుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

క్రెడిట్ హిస్టరీ

సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750+ క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. అందుకే మీ క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. దాన్ని క్రమంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత సమయంలో చెల్లించాలి. అలాగే, కొర్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా చూసుకోవాలి.

ఆదాయం, అప్పుల నిష్పత్తి

డీటీఐ నిష్పత్తి మీ నెలవారీ ఆదాయంలో లోన్ చెల్లింపులు ఎంత శాతం ఉన్నాయనేది చెబుతుంది. దాన్ని కూడా మెరుగుపరచుకోవాలి. ఉదాహరణకు మీ ఆదాయం రూ.50 వేలు అనుకుందాం. అందులో హోమ్ లోన్ EMI రూ.10 వేలు, కారు EMI రూ.3 వేలు, క్రెడిట్ కార్డు బిల్లు రూ.6 వేలు ఉంది అనుకుంటే.. మీ డీటీని నిష్పత్తి 38% ఉన్నట్టు అర్థం.

DTI నిష్పత్తి: (మొత్తం అప్పులు / మొత్తం ఆదాయం) × 100 (19,000/50,000) x 100 = 38% మీ డీటీఐ నిష్పత్తి ఎప్పుడూ 35% నుంచి 45% మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అంతకన్నా పెరిగితే మాత్రం బ్యాంకులు మీ రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

సాయం తీసుకోండి

మీకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తే బలమైన ఆర్థిక ప్రొఫైల్ ఉన్న వ్యక్తితో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. మీరు కట్టలేని పరిస్థితిలో బాధ్యత వహించేందుకు వారు అంగీకరించాలి. అప్పుడు మీకు లోన్ త్వరగా వస్తుంది.

Show More
Back to top button