5వ తరగతి కూడా పాస్ కాని వ్యక్తి కోట్లు సంపాదించారు. కేవలం రూ.1,500లతో ప్రారంభించిన మసాలా వ్యాపారం.. ప్రస్తుతం రూ.500 కోట్ల విలువ చేస్తుంది. ఈ విజయానికి కారణం మహషియన్ డి హట్టి. తన నిరంతర కృషితో ఈ స్థాయికి చేరుకున్నాడు. తన తండ్రి మరణం తర్వాత హట్టి ఢిల్లీకి వచ్చి టాంగా నడిపించాడు. అది తనకు ఇష్టమైన పనికాదని మసాలా వ్యాపారం ప్రారంభించారు. మహాషియాన్ డి.హట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1965 సెప్టెంబర్ 30న స్థాపించి, విదేశాలకు వ్యాపారం విస్తరించారు. ఆ తర్వాత 15 యూనిట్లు స్థాపించి అభివృద్ధి చేశారు. నాణ్యమైన సరుకు అందుబాటు ధరలో అమ్మితే వ్యాపారం వృద్ధి గ్యారెంటీ అని మహషియన్ నమ్మకం.
వ్యాపారం ప్రకటనలు అవసరమని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. టెలివిజన్ వచ్చాక వీడియో ప్రకటనల్లో స్వయంగా తానే నటించి, కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేశాడు. తన వ్యాపారానికి తానే బ్రాండ్ అంబాసిడర్. తన ఫొటోను ప్రతీ మసాలా ప్యాకెట్ మీద ముద్రించాడు. అందుకే కంపెనీ పేరు కంటే మహషియన్ డి.హట్టి మొహం వినియోగదారులకు ఎక్కువ గుర్తు. వ్యాపార లాభాల్లో చాలా వరకు చారిటీలకు ఇచ్చారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన 98వ యేట(2017)లో కన్నుమూశారు. ప్రస్తుతం ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలు కొడుకు, కూతురు చూసుకుంటున్నారు.