
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్1 నుంచి కొత్త లెక్కలు, కొత్త పద్దులు, కొత్త ప్రణాళికలు స్టార్ట్ అవుతాయి. ఈక్రమంలో కొన్ని కీలకమైన ఆర్థిక విషయాలకు సంబంధించి గడువు మార్చి 31తో ముగియనుంది. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసుకుంటే ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు
RBI 8పోరేటును తగ్గించిన విషయం తెలిసిందే, వీంతో ఏప్రిల్ 1 నుంచి ఆయా బ్యాంకుల FD వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి మార్చి 31లోపు FDలు వేయడం మంచిది. మీరు ఒకసారి FD వేసిన తర్వాత, దాని మెచ్యూరిటీ వరకు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు మార్చి 31లోపు FD వేస్తే, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గినా మీ FDపై అధిక వడ్డీ రేటును పొందవచ్చు.
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్
పన్ను చేసుకోవాలనుకునేవారు పన్ను మినహాయింపు కల్పిస్తున్న పథకాల్లో మార్చి 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80C, 80D, 80Gల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా NPS, EPF, PPF వంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయవచ్చు. పన్ను ఆదా చేసుకోవాలనుకునేవారు పన్ను మినహాయింపు కల్పిస్తున్న పథకాల్లో మార్చి 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80C, 800, 80Gల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా NPS EPF, PPF వంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయవచ్చు.
ITR అప్డేట్
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైనా తమ ఆదాయ పన్ను రిటర్నులను అప్డేట్ చేయాలనుకుంటే.. దానికి మార్చి 31 తుది గడువు. ITRలో వివరాలు తప్పుగా ఇచ్చిన వారు ఈలోగా వాటిని సవరించుకోవచ్చు.
UAN యాక్టివేషన్
కొత్తగా EPFలో చేరినవారు UANను యాక్టివేట్ చేసుకోవడానికి ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించారు. తాజాగా 5 గడువును మార్చి 15 వరకు పెంచారు. ఈలోగా UAN యాక్టివేట్ చేయకపోతే.. పీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో యాక్సెస్ చేయడం సాధ్యమవ్వదు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నన్-టైమ్ సేవింగ్స్ స్మేం. ఇందులో 7.5% వడ్డీ అందుతుంది. ఈ పథకంలో రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకు ఎంతైనా పొదుపు చేయవచ్చు. ఈ సంవత్సరం మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం గడువును పెంచితే తప్ప మార్చి 31 తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండరు.
SBI అమృత్ వృష్టి
సీనియర్ సిటిజన్ల కోసం SBI ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అమృత్ వృష్టి ఫిక్స్ డిపాజిట్ పథకం గడువు నూర్తి 31తో ముగియనుంది. ఇందులో 444 రోజుల టెన్యూర్ 7.75% వడ్డీ లభిస్తుంది. సాధారణ పౌరులకు సైతం ఈ పథకంలో భాగంగా 7.25% వడ్డీ ఇస్తున్నారు.