
ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఎక్కువ మంది రిస్క్ లేకుండా సేఫ్‌గా ఉండే ఆప్షన్లను ఎంచుకోవాలనుకుంటారు. అలాంటి టైంలో ఎక్కువగా మనకు ఎదురయ్యే రెండు ఎంపికలు FD (Fixed Deposit) మరియు PPF (Public Provident Fund). మరి ఇందులో ఏది బెస్ట్? ఈ రెండు స్కీమ్స్ కూడా సేఫ్, స్టేబుల్ అయినప్పటికీ… ఎవరి అవసరాల్ని బట్టి ఏది బెటర్ అనేది తేలుతుంది. ఇప్పుడు రెండు ప్లాన్స్‌కి సంబంధించిన కీ డిఫరెన్సులపై ఓ లుక్కేయండి.
FD (Fixed Deposit)
బ్యాంకుల్లో FD అంటే ఒక నిర్దిష్ట కాలానికి డబ్బును డిపాజిట్ చేయడం. మినిమమ్ ₹500 నుంచి FD పెట్టొచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు 6% నుంచి 8% వడ్డీ ఇస్తున్నాయి. కాలపరిమితి 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకూ ఉండొచ్చు.
అత్యవసరంగా డబ్బు అవసరమైతే, FDని బ్రేక్ చేసి తీసుకోవచ్చు – కానీ, దీనికి పెనాల్టీ ఛార్జీలు ఉండొచ్చు.
ప్రధాన లాభం: పద్దతిగా, స్థిరమైన వడ్డీతో తిరిగి వచ్చే డబ్బు.
డ్రాబ్యాక్: షార్ట్ టర్మ్‌లో ఉండే గరిష్ట లాభాలు లేవు; ట్యాక్స్‌బుల్ ఇన్‌కమ్.
PPF (Public Provident Fund)
PPF అనేది ప్రభుత్వ బ్యాకింగ్ ఉన్న దీర్ఘకాల పెట్టుబడి పథకం. ఇది పోస్ట్ ఆఫీస్ లేదా ఏ బ్యాంకులోనైనా ఓపెన్ చేయవచ్చు. ఖాతా ఓపెన్ చేయడానికి ₹100 చాలు. ప్రతి సంవత్సరం కనీసం ₹500, గరిష్టంగా ₹1.5 లక్షల వరకూ డిపాజిట్ చేయొచ్చు.ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%. ఇది క్వార్టర్లీగా గవర్నమెంట్ సెట్ చేస్తుంది. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. కావాలంటే 5 ఏళ్ల చొప్పున పొడిగించొచ్చు.
ప్రధాన లాభం: కాంపౌండ్ ఇన్‌టరెస్ట్, ట్యాక్స్-ఫ్రీ రిటర్న్స్, సెవింగ్స్ హ్యాబిట్.
డ్రాబ్యాక్: డబ్బు మిడ్‌టర్మ్‌లో విత్‌డ్రా చేయడం కష్టం; ఓపిక అవసరం.
చివరిగా..
మీకు షార్ట్ టర్మ్ లో లిక్విడిటీ అవసరమైతే, FD బెటర్.
మీ లక్ష్యం లాంగ్ టర్మ్ వెల్త్ accumulation అయితే, పీపీఎఫ్ ఓ బెస్ట్ ఆప్షన్.
రిస్క్ రెండింట్లోనూ లేదు. కానీ టైం, నీడ్, ఫైనాన్షియల్ గోల్స్ బట్టి సరైనది సెలెక్ట్ చేయండి.