భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం చారిత్రక కట్టడాలకు నిలయం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక మంది రాజులు పరిపాలించేవారు. వారి పరిపాలనలో భాగంగా నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కాకతీయ రాజులు పరిపాలించిన కాలంలో ఎన్నో కట్టడాలు అద్భుత శిల ఖండాలు మనసును కట్టిపడేస్తాయి. అటువంటి కట్టడాలలో అద్భుతమైన శిల్ప కళా వైభవంతో దర్శనమిచ్చే కట్టడం రామప్ప దేవాలయం. ఈ దేవాలయం యునెస్కో గుర్తింపు సైతం అందుకుంది. రామప్ప దేవాలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రామప్ప దేవాలయం ఒకప్పుడు ఓరుగల్లును (వరంగల్) పరిపాలించిన కాకతీయ రాజులచే క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని అయిన హైదరాబాదు నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామానికి దగ్గరలో ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా దేవాలయం ఉండటం దీని యొక్క గొప్పతనం.
ఇది చాలా ప్రాముఖ్యత చెందిన దేవాలయం ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కూడా ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఆ చెరువు నీరు ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. దేవాలయం యొక్క ప్రధానదైవం శివుడు.
ఆలయం యొక్క ప్రత్యేకతలు…
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలు, దాడులు, ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుపుతారు. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై ఉన్న నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3వైపుల ప్రవేశ ద్వారములు గల మహామండపం కలిగి ఉంటుంది.
గర్భగుడిలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహా మండపం మధ్యలో కుద్య స్తంభములు వాటిపై రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన,అందమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపము, కామేశ్వర కాటేశ్వర మొదలైన ఆలయాలు చూడదగినవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నంది ఒక కాలు పైకి ఎత్తి పెట్టి చెవులు రెక్కించి తన యజమాని ఎప్పుడూ ఆజ్ఞాపిస్తాడు అన్నట్లుగా ఉంటుంది. ఏ దిక్కు వైపు నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఈ నంది విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
యునెస్కో గర్తింపు…
తెలంగాణలో ప్రముఖ చారిత్రక కట్టడం గా పేరొందిన రామప్ప..
800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. ఈ దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది.
సమీపంలోని లక్నవరం సరస్సు…
వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు గొప్ప విహారయాత్ర చేయగల ప్రదేశం. సరస్సు యొక్క అందం వివరించడం అసాధారణమైన విషయం. ఈ సరస్సు 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం యొక్క పాలకులు నిర్మించారు. అదనపు ప్రయోజనం ఏమిటంటే సరస్సు వివిధ పరిసరాలలో ఆశ్రయం పొందుతుంది.
లక్నవరం సరస్సుని సందేహంగా వరంగల్ లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలలో ఒకటి. పదివేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ నిర్మలమైన నీటి ప్రదేశం కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
చుట్టుపచ్చని అడవులు, ఆకర్షణమైనా కొండలతోఆనందాన్ని కలిగిస్తుంది. మలుపులు తిరిగిన రహదారి ఇరువైపులా అడవులు.. సరస్సు ప్రయాణాన్ని కూడా గుర్తుండి పోయేలా చేస్తుంది. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న వేలాడే వంతెన, చిన్న ద్వీపాలు దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఈ సరస్సు కేవలం ప్రకృతి సౌందర్యమే కాదు చారిత్రాత్మకంగా కూడా ముఖ్యమైనది. కాకతీయుల పాలనలో ఇంజనీరింగ్ నైపుణ్యానికి చక్కటి ఉదాహరణ లక్నవరం సరస్సు. ప్రకృతిలో ఒక అందమైన సమ్మేళనం. సరస్సు నీటితో చుట్టుముట్టబడిన మొత్తం 13 చిన్న చిన్న భూభాగాలను చూడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో సూర్యోదయం సమయంలో సరస్సు నీరు చెట్ల గుండా కిరణాలు పడటం వల్ల ప్రకాశించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇంకేంటి మరి ఇంత అందమైన ప్రదేశాన్ని చూడాలంటే మీరు కూడా వెళ్ళండి.