Telugu News

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అయ్యాడు

ప్రస్తుతం యువత వారి సమయాన్ని మొత్తం వృద్ధా చేస్తున్నారు. కానీ రవి అనే 21 ఏళ్ల వ్యక్తి సరైన సమయంలో తన సమయాన్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడిగా పేరును నమోదు చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలని అనుకున్న పరిస్థితిని అధిగమించి ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మన్ అయ్యాడు. కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడితే, ఇతడికి మాత్రం బాగా కలిసివచ్చింది. స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో వ్యాపారం మొదలుపెట్టి ఒక సంవత్సరంలో రూ.2 కోట్ల సంపాదించాడు. అవును సంవత్సరంలో అక్షరాల రూ.2 కోట్లు టర్నోవర్ చేశాడు రవికుమార్ సాగర్. అస్సలు ఏం చేసాడు? ఎలా చేసాడు అనేది తెలుసుకుందాం రండి.

రవికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తండ్రే తల్లై చూసుకున్నారు. 10వ తరగతి వరకు యావరేజ్ విధ్యార్థిగా ఉన్న ఇతడు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్‌పై ఎంతో ఆసక్తితో చేరి క్లాస్ టాపర్ అయ్యాడు. ఆ సమయంలో తన ఖర్చుల కోసం వాళ్ల నాన్న గారిని డబ్బు అడగలేక తనంతట తాను సంపాదించాలి అనుకున్నాడు. అందుకని ఒక స్నేహితుని సలహా మేరకు బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజులకు నష్టం రావడం మొదలైయింది. అలా రూ.10 వేలు అప్పు చేసి బెట్టింగ్ పెట్టి నష్టపోయాడు. అప్పు తీర్చలేక, వెళ్లి నాన్నకు చెప్పలేక చనిపోదామనుకున్నాడు. కానీ ఒకరి మాట తన జీవితాన్ని మార్చేసింది.

తను చనిపోయేది ఒకరికి అయినా తెలియాలి అనే ఉద్దేశంతో తన స్నేహితురాలికి కాల్ చేసి జరిగింది అంతా చెప్పాడు. అది విన్న ఆమె మరుసటి రోజు వరకు ఆగు అని చెప్పి, తర్వాత రోజు రవిని కలిసింది. అతడిని మందలించి తన తండ్రి గురించి చెప్పి రవిని మంచి మార్గంలో నడిపించింది. ఆ సంఘటన తర్వాత రవి తన అలోచనలను మార్చుకున్నాడు. ఉద్యోగం చేస్తూ.. డబ్బు సంపాదించి, తన ఖర్చులతో పాటు, అప్పును తీర్చేవాడు. కానీ తను అనుకున్నది అది కాదు, ఇంకా ఏదో సాధించాలి అనిపించేది. ఇలా కొన్ని నెలలు ఉద్యోగం చేశాక అనుకోకుండా కరోనా వల్ల లాక్‌డౌన్ వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఒక వ్యాపారం ప్రారంభించాడు.

లాక్‌డౌన్‌లో టిక్‌‌టాక్ చాలా ఫేమస్ అయిన విషయం అందరికి తెలిసిందే. అందులో ఒక వీడియో రవి జీవితం మార్చేసింది. అదేంటంటే ఓ వ్యక్తి శానిటైజర్ వ్యాపారం ఎలా చెయ్యాలో చెప్పాడు. దాంతో వాళ్లకు కాల్ చేసి విషయం అంతా తెలుసుకున్నాడు. తర్వాత ఒక రోడ్డుపై శానిటైజర్ అమ్మే వ్యక్తితో మాట్లాడి తక్కువ ధరకు తనకు శానిటైజర్ అమ్ముతానని ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అలా శానిటైజర్ మ్యానుఫ్యాక్చర్‌కు కస్టమర్లకు వారధిగా ఉంటూ ఒక సంవత్సరంలో రూ.2 కోట్ల టర్నోవర్ సాధించాడు. ఆ తర్వాత ప్రాడక్ట్ కోసం అడ్వాన్స్ అంటూ డబ్బిచ్చి మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని అడ్డంకులు దాటుకొని సమస్యను ఎదుర్కొని అర్.కే ఎంటర్‌ప్రైజస్ కంపెనీ స్థాపించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు రవి.

Show More
Back to top button