గత సంవత్సరం హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు చేసింది. అవి ఏంటంటే.. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీలలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ సంస్థ కొన్ని పత్రాలను విడుదల చేసింది.
దీనికి సెబీ చీఫ్ మాధబి బచ్, ఆమెభర్త ధవల్ బచ్ స్పందిస్తూ.. హిండెన్‌బర్గ్ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని, సెబీ విశ్వసనీయతపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతేకాదు తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలను కూడా అధికారులు ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పారు. ఈ మేరకు మా జీవితం తెరిచిన పుస్తకం.. ఇప్పటికే కొన్నేళ్లుగా అన్ని రకాల వివరాలను సెబీకి సమర్పిస్తూ వచ్చాం అని అన్నారు.
అసలు ఈ వివాదం ఏంటి?
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌సోర్ డొల్ల కంపెనీల వివరాలు తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ నివేదికలో తెలిపింది. అంతేకాదు నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం.
సెబీ చైర్‌పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను చూస్తే ఇది బాగా అర్ధమవుతుంది. విజిల్‌బ్లోయల్ పత్రాల ప్రకారం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లు ఉన్నాయి. ఇక ఇందులో మాధబి పురి, వారి భర్త ధవల్ బచ్‌లు వాటాలు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. వీరి వాటాల విలువ 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ83 కోట్లు) ఉండొచ్చని తెలిపింది.
హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఓ చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని ఇనాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవ ర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా డానికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్ టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది.
ఇది సాధారణంగా అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లి క్లయింట్లు, హిండెన్బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకుంటారు. దీంతో రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అంతకముందు అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది.