Telugu News

యుద్ధం అనివార్యమైతేమాక్ డ్రిల్.?!

తాజాగా జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ముష్కరులు భారత్ పై పగ తీర్చుకునే పనిలో పడ్డారు. వాళ్ళ నుంచి భారత్ కు థ్రెట్ ఉంటుందని భావించినా.. ఈ మధ్య కాలంలో కేంద్రం కొన్ని ముఖ్య ప్రదేశాల్లో జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదని చెబుతోంది. పైగా మే 7న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ఉంటుందని తెలిపింది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న మనం.. ఇండియా పాకిస్తాన్ దగ్గర ఎక్కడో గొడవ జరుగుతుంది కదా మనకేందుకులే అనుకుంటే ఎలా..? ఇన్ఫాక్ట్ ఇలాంటి ఒక డ్రిల్ 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 54 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతుంది.

దేశవ్యాప్తంగా 259 ప్రాంతాలను సెక్యూరిటీ డ్రిల్స్‌ నిర్వహించేందుకు ప్రణాళిక వేశారు. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు చర్చిద్దాం… 

సెక్యూరిటీ డ్రిల్‌ అంటే..?
సెక్యూరిటీ మాక్‌ డ్రిల్‌ అనేది ఒక డిఫెన్స్ వ్యవస్థకి చెందిన ట్రెయిన్డ్ ప్రాసెస్. భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా ప్రతిస్పందించేందుకు అనుసరించే మార్గం. ప్రమాదం జరగడానికి ముందే.. ఆ ప్రమాదానికి ఎలా ప్రతిస్పందించాలో శిక్షణ పొందే విధానమే ఇది.

ఎందుకు కండక్ట్ చేస్తారు..?
సిటిజెన్స్ లో అప్రమత్తత.. అవగాహన కలిగించేందుకు.. సిబ్బంది వెంటనే స్పందించి, పరిస్థితులను అవలీలగా చక్కదిద్ది.. సాంకేతికపరమైన సమస్యలను ముందుగా గుర్తించి సరిచేసుకోవడానికి, అత్యవసర సమయాల్లో  ప్రతిస్పందన బృందాలు, వారి సమన్వయంతో ఎలా పని చేస్తున్నాయో టెస్ట్ చేసేందుకు ఈ డ్రిల్‌ను కండక్ట్ చేస్తారు.

ఏయే ప్రాంతాల్లో..

యుద్ధం జరిగే అవకాశమున్న ప్రాంతాలు, టెర్రరిస్టుల దాడులు, బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రుల్లో ఫైర్ ఆక్సిడెంట్, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, కెమికల్‌ లీకేజీ వంటివి జరిగినప్పుడు ఈ డ్రిల్‌ను నిర్వహిస్తారు. ఆయా వ్యక్తులు, సంస్థలకు ముందుగా సమాచారం ఇచ్చి కానీ, ఇవ్వకుండా కానీ ఈ డ్రిల్స్‌ను నిర్వహిస్తారు.

సెక్యూరిటీ డ్రిల్స్‌లో ఉండే స్టేజేస్ ఇవి: 

ఎయిర్‌ రైడ్‌ వార్నింగ్‌ సైరన్లు: 

సెక్యూరిటీ డ్రిల్‌లో ఇది కీలకమైన దశ. వైమానిక దాడులు జరిగే సమయంలో ఎయిర్‌ రైడ్‌ వార్నింగ్‌ సైరన్లను మోగిస్తారు. శబ్ద తీవ్రత సుమారు 110 డెసిబిల్స్‌ నుంచి 140 డెసిబిల్స్‌ వరకూ ఉంటుంది. తక్కువలో తక్కువగా 30 సెకండ్లపాటు ఈ వార్నింగ్‌ సైరన్లు మోగుతాయి. సైరన్‌ వినిపించగానే ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లల్లో, సురక్షిత ప్రదేశాల్లో దాక్కోవాలి. బయట వీధుల్లో ఉండేవారు.. లోతట్టు ప్రాంతానికి చేరుకొని పై కప్పు ఉన్న ఏదైనా వసారాలో లేదంటే నేలపై పడుకోవాలి. చెవులను గట్టిగా మూసుకోవాలి.

బంకర్లు: దాడులు మొదలైన సమయంలో పౌరులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ముఖ్యంగా భూమి లోపల తవ్విన బంకర్ల వంటి నిర్మాణాల్లో దాక్కోవడం ఉత్తమం. 

ఇలా క్రిటికల్ అనిపించిన కశ్మీర్‌లోని ఉరి రీజియన్, అర్నియా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే పౌరుల కోసం కొన్ని కమ్యూనిటీ బంకర్లను రెడీ చేసింది.

క్రాష్‌ బ్లాకౌట్స్‌: రాత్రిళ్లు జరిగే దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ విధానంలో ఇంట్లో ఉండే దీపాలను ఆపేయాలి, అలాగే స్ట్రీట్‌ లైట్లను కూడా నిలిపేస్తారు. 

ఇలా అక్కడ ప్రజలు లేరనే భ్రమను శత్రువులకు కల్పిస్తారు.

కేమోఫ్లాజ్‌ విధానం: మిలటరీ బేసిస్, విద్యుత్తు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థలు, కమ్యూనికేషన్‌ హబ్స్‌ వంటి ముఖ్య ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా  ఉండేందుకు ఈ కేమోఫ్లాజ్‌ విధానాన్ని అనుసరిస్తారు. శాటిలైట్లు, ఎయిర్ సర్వ్లైన్స్, ఎటాక్ ల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తారు. 

ట్రైనింగ్‌ సివిలియన్స్‌: దాడి సమయంలో తొక్కిసలాట, గందరగోళం జరగకుండా నియమిత విధానంలో బయటకు ఎలా వెళ్లాలో పౌరులకి శిక్షణనిస్తారు. ప్రమాదంలో చిక్కుకొని గాయపడ్డవారిని ఎలా రక్షించాలో.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన తర్వాత హాజరు నమోదు ఎలా చేయాలో కూడా వీరే చెప్తారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌: ఎమర్జెన్సీ ఏర్పడిన వెంటనే అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, బృందాలు ఘటనా స్థలికి చేరుకుంటాయి. లోపల ప్రమాదంలో  చిక్కుకున్న వారు లేదా బందీలైనవారిని బయటకు తీసుకురాగలుగుతామా? అని డ్రిల్‌లో భాగంగా పరీక్షిస్తారు. 

ఉగ్రదాడి అయితే ఉగ్రవాదులను కట్టడి చేసే అవకాశాలను, ప్రక్రియను చేపడతారు. అలాగే ఆపరేషన్‌ అయిన తర్వాత ప్రతిస్పందన సమయం నమోదు చేస్తారు. అన్ని విభాగాలు, సంస్థలపై సమీక్ష జరిపి.. ఏ విభాగంలో లోపాలున్నాయో నోట్ చేసుకుంటారు.

1971 యుద్ధ సమయంలోనూ..
1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసమని భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసం నాటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ డ్రిల్స్‌ను కండక్ట్ చేసింది.

యుద్ధ సమయంలో సాయంత్రం 6.30కల్లా ప్రతీ ఒక్కరూ ఇళ్లకు చేరుకొనేవారు. 

సైరన్‌ వినిపించగానే ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో లైట్లు ఆర్పేసి, సురక్షిత ప్రాంతాల్లో దాక్కొనేవారు. నేలపై పడుకొనేవారు. చెవులను గట్టిగా మూసుకొనేవారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా ఉండేది కాదు. 

నిజానికి పాక్‌ సేనలు తాజ్‌మహల్‌పై దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిసినప్పుడు నిఘా వర్గాల హెచ్చరికలతో ఆ కట్టడం శత్రువుల కంటపడకుండా అక్కడి పరిసరాల్లో కలిసిపోయేట్టు దానిపై ఆకుపచ్చటి జూట్‌ వస్ర్తాన్ని (కేమోఫ్లాజ్‌ వస్త్రం)ను కప్పారు.

భారత పౌరులుగా మనకు ఉండవలసిన కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసేందుకు ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయి.

Show More
Back to top button