
భారతదేశంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక అద్భుతమైన శిల్పకళా వైభవం హంపి. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలియచెప్పే విధంగా అద్భుతమైన స్మారక చిహ్నాలు నగరం అంతా విస్తరించి ఉన్న శిల్పకళ నైపుణ్యం ఇవన్నీ కలిసి హంపిని సుందరమైన నగరంగా తీర్చిదిద్దాయి. ఈ శిల్పకళా వైభవాన్ని గుర్తించి యునెస్కో ప్రపంచ వారసత్వ శిల్పకళా వైభవాల్లో ఒకటిగా గుర్తించారు. అలాగే భారతదేశంలోని అత్యంత సుందర ప్రదేశాలలో హంపి ముందు వరుసలో ఉంటుంది. భారతదేశంలోని తుంగభద్రా నదికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నగరం ఇండియాలో ఉన్న మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ లలో ఒకటి. యాత్ర పరంగాను ఒక గొప్ప చారిత్రక ప్రదేశం. అలాంటి ఈ ప్రసిద్ధ పర్యటక కేంద్రానికి ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు వస్తూనే ఉంటారు. ఈ హంపి క్షేత్రం యొక్క అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హంపిని విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. కానీ ప్రైమరీ హిస్టారికల్ రికార్డును పరిశీలిస్తే ఇది ఒకటవ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని అలాగే ఇది అశోక చక్రవర్తి పాలనలో ఉండేదని రాతి శాసనాలు సూచిస్తున్నాయి. తరువాత ఆరు నుండి 8 శతాబ్దాల మధ్య చాళుక్యల పాలనలో ఉండేదని దీనిని పంపా అని పిలిచేవారని తెలుస్తోంది. తర్వాత పదో శతాబ్దం నాటికి హిందు రాజులు కళ్యాణ చాళుక్యుల పాలనలో విరూపాక్ష ఆలయానికి భూమి మంజూరు అయింది. ఇక 11 నుండి 13వ శతాబ్దాల వరకు లభించిన ఆధారాలన్నీ ప్రస్తుత హంపి ప్రదేశానికి సంబంధించినవి.
ప్రస్తుతం హంపి క్షేత్రానికి కిస్కింధక్షేత్రం, పంపాక్షేత్రం, భాస్కర క్షేత్రం గా పిలుస్తారు. హేమకూట కొండ వద్ద ప్రవహించే తుంగభద్రా నదికి పంపానది అనే పేరు ఉంది. అందుకే దీనిని పంపా క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ నదికే దక్షిణ ఒడ్డున హంపి నగరం ఉంది. పురాణాల ప్రకారం చూస్తే పంపా అనేది పరమశివుడు భార్య అయినా పార్వతి పేరు. పార్వతీదేవి హేమకుట పర్వతం మీద శివుడి కోసం ఘోర తపస్సు చేసింది. అందుకే ఈ పర్వతానికి ఆ పేరు వచ్చిందని పురాణ గాధ. అయితే హంపి అనేది కన్నడ పేరైనా హంబే నుండి పుట్టింది. శిల్పకళ ఉట్టిపడేలా కోటలు రాజభవనాలు నగరం అంతా ఎక్కడ చూసినా స్మారక చిహ్నాలు అందమైన ఉద్యానవనాలు కోనేరులు మండపాలు దేవాలయాలతో నిండి ఉన్న ఒక సుందరమైన నగరంగా హంపిని నిర్మించారు. అంతేకాకుండా చైనాలోని బీజింగ్ తర్వాత అతిపెద్ద మార్కెటింగ్ వ్యవస్థను కలిగి ఉంది హంపి. నిర్మాణ పరంగానే కాదు వాణిజ్యపరంగా కూడా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరంగా హంపి రికార్డుకు ఎక్కింది.
మ్యూజికల్ పిల్లర్స్
మనసుపెట్టి వినాలి కానీ రాళ్లు కూడా సంగీతాన్ని పలుకుతాయి అంటారు. హంపి నిర్మాణంలో అప్పటి రాజులు సంగీతాన్ని పలికించే స్తంభాలను చెక్కించారు. సంగీతం మనిషికి మనసుకి హాయినిస్తూ మనిషికి ఉండే ఎన్నో రాగాలను నయం చేస్తుందంటారు. అటువంటి సంగీతాన్ని ప్రశాంతత కలిగిన దేవాలయాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఆ కాలపు రాజుల నైపుణ్యానికి నిదర్శనం. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ఎంతోమంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం. వీరికి ఏమాత్రం సమయం దొరికిన సరే సంగీతాన్ని వినేవారు ఆస్వాదించేవారు. అలాంటి సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాల్లో ఈ మ్యూజికల్ పిల్లర్స్ ను ఏర్పాటు చేశారు.
సంగీత వాయిద్యాలతో చేసే సంగీత సాధన కష్టం అనుకుంటే రాతిని తాకితేనే సరిగమపదనిస స్వరాలు వచ్చే సంగీతం గురించి ఉందంటే అది నిజంగా గొప్ప విషయమని చెప్పుకోవాలి. సంగీతం అంటే భారతదేశానికి తెలిసినంతగా మరి ఏ ఇతర దేశానికి తెలిసి ఉండదు. అలాంటి మన దేశంలో ఈ మ్యూజికల్ పిల్లర్స్ సుమారు 1000 సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. హంపిలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో విట్టల దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలో ఉన్న రంగ మండపం 56 స్తంభాల స్తంభాలకు ప్రసిద్ధి. వీటిని సరిగమ స్తంభాలు అని అంటారు. ఈ స్తంభాలు సంగీత శబ్దాలను వినిపించడం విశేషం. వీటిని తాకితే సరిగమలు పలుకుతూ ఉంటాయి. ఈ పిల్లర్స్ అన్ని రాతి తోనే నిర్మించారు. అయితే వీటిని ఎలా నిర్మించారు అనేది సైంటిఫిక్ రీజన్ మాత్రం ఇప్పటికీ తెలియదు.
హంపిలోని భీమా ద్వారం
పాండవుల వనవాసం సమయంలో ద్రౌపదికి సౌగంధిక అనే పుష్పం కనిపించిందని, అది సువాసనగా ఉందని చెబుతారు. వారు మంత్రముగ్ధులయ్యారు, ఆమె ఈ పువ్వులను ఎక్కువగా కోరుకుంది, కాబట్టి భీమ్ దాని మూలాన్ని కనుగొనడానికి ఎన్నో ఆటంకాలను అధిగమించి సౌగంధికా పుష్పంతో నిండిన చెరువును కనుగొన్నాడు. ఈ సమయంలో, హనుమంతుడు ఒక వృద్ధుడి రూపాన్ని ధరించి, దారికి అడ్డంగా పడుకున్నాడు. కదలమని భీమ్ అడిగినప్పుడు, అతను చాలా పెద్దవాడని, భీమ్ తన తోకను తానే కదిలించమని చెప్పాడు. భీమ్ పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అతను హనుమంతుడిని ఎదుర్కొంటున్నట్లు గ్రహించాడు. భీముడు చెరువుకు కాపలాగా ఉన్న ఇద్దరు రాక్షసులతో పోరాడి ద్రౌపది కోసం పువ్వుతో తిరిగి వచ్చాడు.
హంపిలోని ఆలయాల యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, రథోత్సవాలు ఆచారాలలో ప్రవేశపెట్టబడిన స్తంభాల మండపాల వరుసలతో చుట్టుముట్టబడిన విశాలమైన రథ వీధులు. ఆలయం ముందు ఉన్న రాతి రథం కూడా దాని మతపరమైన ఆచారాలకు నిదర్శనం. హంపి వద్ద చాలా నిర్మాణాలు స్థానిక గ్రానైట్, కాలిన ఇటుకలు, సున్నపు మోర్టార్‌తో నిర్మించబడ్డాయి. రాతి కట్టడం మరియు లాంతరు పైకప్పు గల పోస్ట్ మరియు లింటెల్ వ్యవస్థ అత్యంత ఇష్టపడే నిర్మాణ సాంకేతికత. భారీ కోట గోడలు ఎటువంటి బైండింగ్ మెటీరియల్ లేకుండా రాళ్ల రాతితో కోర్ని నింపడం ద్వారా పేపర్ జాయింట్‌లతో సక్రమంగా కత్తిరించిన సైజు రాళ్లను కలిగి ఉంటాయి. ద్వారం మీదుగా గోపురాలు మరియు గర్భాలయం రాయి మరియు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఇటుక జెల్లీ మరియు లైమ్ మోర్టార్‌తో వాటర్ ప్రూఫ్ కోర్స్‌తో కప్పబడిన భారీ మందపాటి గ్రానైట్ స్లాబ్‌లతో పైకప్పులు వేయబడ్డాయి.
1980, 1990లలో, జాన్ ఎమ్ ఫ్రిట్జ్, జార్జ్ మిచెల్ సైటిస్టులు ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం విజయనగర అవశేషాలను డాక్యుమెంట్ చేసి వివరించింది. విజయనగర సామ్రాజ్య విశేషాలు రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ పరిశోధనలు, వివరణలను వివరిస్తుంది, అదే సమయంలో నగరం యొక్క చరిత్ర మరియు అది రాజధానిగా ఉన్న సామ్రాజ్యం, సైట్ యొక్క అర్బన్ లేఅవుట్ మరియు దాని సైనిక, ఉత్సవ వైవిధ్యంపై అవసరమైన నేపథ్య సమాచారాన్ని కూడా అందిస్తుంది. పౌర, మతపరమైన నిర్మాణం ఇది. అద్భుత కళా వైభవానికి ప్రతీక ఈ నగరం.