
భారత్ పాకిస్తాన్ పై ఎంత ఆగ్రహంతో.. ఆవేశంతో ఉందో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం.. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేలా కొన్ని అంశాల్లో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంది. అందులో మెయిన్ థింగ్.. సింధు జలాల ఒప్పందం.. అదే పాక్ కు సింధూ నదీ జలాల్ని నిలిపివేయడం.
ఏ దేశానికైనా.. ప్రధానమైన రంగం వ్యవసాయం. ఆ దేశ జీడీపీ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకే కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు అనేవి చాలా ముఖ్యం. రాష్ట్రాలే కాదు దేశాల మధ్య కూడా ఇలాంటి వివాదాలున్నాయి.
1960లో జరిగిన సింధూ నది జలాల ఒప్పందం… భారత్, పాకిస్తాన్ కు మధ్య జరిగింది. ఇదొక అంతర్జాతీయ ఒప్పందం.
రెండు దేశాలకు చెందిన ముఖ్యమైన విభాగాల్లోని వారు ఇచ్చిన సజెషన్స్ తో చివరికి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రీమెంట్ అనేది కుదిరింది. దీనిపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యూబ్ ఖాన్ లు సంతకం చేశారు. ప్రపంచ బ్యాంకు ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసింది. ఈ అగ్రీమెంట్ లో ఆరు నదుల్లో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లైస్ భారత్ కు… పశ్చిమ నదులైన ఇండస్, జీలం, చీనాబ్ నదుల్ని పాకిస్తాన్ కి కేటాయించడం జరిగింది.
ఈ ఇండస్ రివర్ సిస్టంలో ఏడాదికి 260 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అనేది ప్రవహిస్తుంది. మొత్తం నీటిలో 20% భారత్ కు, 80% పాకిస్తాన్ కు కేటాయించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా వ్యవసాయం, విద్యుత్తు ఉత్పత్తి, గృహ సంబంధం అవసరాలు ఇతర అవసరాల కోసం ఈ నీటిని వాడుకోవచ్చు. పాకిస్తాన్ కు కేటాయించిన నదుల నీటిని మాత్రం నాన్ కన్సంటివ్ పరిమిత ఉపయోగాలకు భారత్ వాడుకోవచ్చని అగ్రీమెంట్ కుదిరింది.
ఈ అగ్రీమెంట్ ప్రకారం రెండు దేశాలకు చెందిన నది ప్రవాహం, ఆనకట్టలు నిర్మించేందుకు సంబంధించిన సమాచారాన్ని నిత్యం పంచుకోవాల్సి ఉంటుంది. భారత్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టాలి అనుకుంటే పాక్ కు ముందుగానే సమాచారం అందివ్వాలి. అలాగే అగ్రీమెంట్ ప్రక్రియ, వివాదాలను పరిష్కరించేందుకు
ఒక బైలేటరల్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. మొదట ఇక్కడ కనుక్కొన్న తర్వాత సమస్య తీరకుంటే న్యూట్రల్ ఎక్స్పోర్ట్ ను నియమించవచ్చు. అక్కడ కూడా పరిష్కారం అవ్వకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్ళాలని కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నారు.
ఎందుకు చేసుకుంది..
భారత్, పాకిస్తాన్ మధ్య 1947 విభజన తర్వాత.. సింధు నది వ్యవస్థ మొత్తం పాకిస్తాన్ లోకే ప్రవహిస్తుంది. కానీ కొన్ని ప్రధాన వాటర్ స్ట్రీమ్స్ భారత్ నుంచి వస్తాయి. దీనివల్ల వీటిపై వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ ఒప్పందం అనేది కుదిరింది.
హిమాలయాస్ రీజియన్లో పుట్టిన సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ వంటి నదులు మొదట భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. రెండు దేశాలకు ఈ నీరు అనేది చాలా ముఖ్యం.. ఈ 6 ప్రధాన నదులు ఇండియా నుంచే వెళ్తుండడంతో ఈ నదీ జలాలపై భారత్ దే పై చేయిగా ఉంటుంది. పైగా స్వాతంత్రానికి ముందే రావి, సటిలైజ్ నదులపై కట్టిన ఇరిగేషన్ హెడ్ వర్క్స్ మాధోపూర్, ఫిరోజ్పూర్ లాంటివి ఇండియాలోనే ఉండిపోయాయి. వీటికి సంబంధించిన కాలువలు పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉంటే.. పార్టీషన్ టైంలో నీటి హక్కులపై వీటికి సంబంధించి స్పష్టమైన అగ్రీమెంట్ లేదు. దాంతో రోజురోజుకీ నీటి విషయంలో వివాదాలు పెరుగుతూ వచ్చాయి.
రెండు దేశాలు విడిపోయి నెలలు కూడా గడవకముందే కాశ్మీర్ ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ ట్రై చేయడం.. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చింది. అప్పుడు తూర్పు పంజాబ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్ళే నీటి సరఫరాను ఇండియా తాత్కాలికంగా ఆపేసింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ లో నీటి కొరత ఏర్పడింది. దీన్ని పాకిస్తాన్ తమ ఫైనాన్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ పై అటాక్ గా చెప్పుకొచ్చింది. యునైటెడ్ నేషన్స్ సలహాతో రెండు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా ఉంది. పాకిస్తాన్ కు మెజారిటీ షేర్ ఇవ్వడమే కాకుండా ఆ దేశంలో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏకంగా 62 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్ ను చెల్లించింది. అంటే అప్పట్లోనే దాదాపు రూ. 83 కోట్లు. ఈ ఫండ్ తోనే పాకిస్తాన్ లో మంగ్లా డ్యామ్, టార్బెలా డ్యామ్ లాంటి ప్రాజెక్ట్స్, చాలా లింక్ కెనల్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ ను డెవలప్ చేశారు. ఫండ్ ను భారత్ వరల్డ్ బ్యాంక్ ద్వారానే చెల్లించింది.
పాక్ కు జరిగే నష్టం..
1965, 1971, 1999 యుద్ధ సమయంలో కూడా ఈ అగ్రీమెంట్ కొనసాగింది. తరువాత భారత్ టెంపరరీగా సస్పెండ్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పట్లేదు. అనుకున్నట్టుగా సింధూ నదీ జలాల్ని ఆపేస్తే.. పాకిస్తాన్ క్రిటికల్ సిచువేషన్స్ లో కూరుకుపోతుందనీ ఎక్స్పర్ట్స్ అంచనా.
అసలు ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ ఫ్లోలో 5 – 10% తగ్గినా కూడా భారీగా పంట దిగుబడి తగ్గిపోతుంది. అక్కడ ఫుడ్ షార్టేజ్ అనేది తలెత్తుతుంది. ఇప్పటికే అక్కడ ఆర్మీ, పొలిటీషియన్స్ మధ్య నలిగిపోతున్న ప్రజలు ఫుడ్ కోసం నానా బాధలు పడుతున్నారు. పాకిస్తాన్ లో నిత్యావసర సరకుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశం ఆర్థికంగా గందరగోళంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా ఇప్పుడు అసలే సమ్మర్.. అండర్ వాటర్ అందుబాటులో లేక చాలామంది ట్యాంకర్స్ తో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న పాక్ కు, భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడే కాకున్నా స్లో పాయిజన్ లా ఎఫెక్ట్ అవ్వబోతుంది. సింధు జలాలను నిల్వ చేసేందుకు, మళ్లించేందుకు తగిన ఫెసిలిటీస్ లేకపోవడంతో.. ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్ కు సాధ్యం కాకపోవచ్చు.. కానీ తక్షణమే 5 నుంచి 10 శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉందనీ తెలుస్తోంది.
23.7 కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఈ వాటర్ ను వాడతారు. పాక్ ఆహారభద్రతకు సింధూ జలాలు చాలా కీలకం. పాక్ ఇప్పటికే తీవ్రమైన నీటి కొరతలో ఉంది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 24% పాక్ జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడనుంది. పాక్ జీడిపీలో 25% ఈ నదుల నుంచే వస్తుండగా కేంద్ర నిర్ణయం పాక్ ను తీవ్రంగా ఎఫెక్ట్ చేయనుంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాల వద్ద అప్పులు చేస్తూ బతుకుతున్న పాక్ కు భారత్ తీసుకున్న నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.