
నేటి డిజిటల్ యుగంలో, ప్రతీది సోషల్ మీడియాలో పంచుకోవడం, తెలుసుకోవడం వల్ల స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. అయితే ఈ వేసవి ఎండలకు ఫోన్లు అనేవి అతిగా వేడెక్కడం లేదంటే హ్యాంగ్ అవుతుంటాయి. ఈ సమస్య కామన్ గా అందరూ ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ బెటర్ గా పనిచేస్తుందని అంటున్నారు టెక్ నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం:
స్మార్ట్ ఫోన్లు రన్ అయ్యే టైంలో బ్యాక్గ్రౌండ్ లో హీట్ జెనరేట్ అవుతుంది. అది పరిమితికి మించి ఎక్కువ అయితే గనుక మీరు అలెర్ట్ అవ్వాలి. సూర్యుడి కిరణాల నుంచి ఎండ నేరుగా ఫోన్ పై పడడం, వేడి వాతావరణం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. మొబైల్ లో ఎక్కువ యాప్ లు లేదంటే లాంగ్ లెంథ్ వీడియోలు, సినిమాలు చూడటం, ఎక్కువసేపు గేమ్స్ ఆటడం వల్ల కూడా ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. హానికరమైన సాఫ్ట్ వేర్ లను అప్డేట్ చేయకపోవడం, స్టోరేజి ఇష్యూస్ ను క్లియర్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
*సూర్యుడి కాంతి డైరెక్టుగా ఫోన్ మీద పడకుండా చూసుకోవాలి.
*వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది. సైడ్ కి పార్క్ చేసిన కార్లలో సెల్ ఫోన్ ఉంచకూడదు. కారు లోపల పెరిగిన ఉష్ణోగ్రతతో ఫోన్ కు మరింత ఇబ్బంది కలుగుతుంది.
*ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ ను ఎప్పటికప్పుడు మీడియం రేంజ్ లో చూసుకొని తగ్గించుకోవాలి. దీనివల్ల చార్జింగ్ తో పాటు వేడి ఉత్పత్తి తగ్గుతుంది. ఇందుకోసం ఆటోమేటిక్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లు చేసుకుంటే చాలు.
*ఫోన్ లో ఎక్కువ యాప్ లు ఉంటే దాని ఎఫెక్ట్ ప్రాసెసర్ పై పడుతుంది. అందువల్ల కూడా వేడి ఎక్కువ రిలీజ్ అవుతుంది. కాబట్టి అనవసర యాప్ లను తీసేయాలి.
*చాలామంది ఫోన్ లుక్ కోసం రకరకాల పౌచ్ లు, కవర్లు వాడుతుంటారు. వీటివల్ల ఫోన్ లో విడుదలయ్యే వేడి బయటకు వెళ్లే అవకాశం లేక ఒక్కోసారి పేలేందుకు దారి తీస్తుంది. అప్పుడు ఫోన్ కవర్ కాసేపు తీసి పక్కన ఉంచాలి.
*చాలాసార్లు ఛార్జింగ్ కోసం వేరే ఏదో ఛార్జింగ్ వైర్ తో ఛార్జ్ చేస్తుంటాం. అలా కాకుండా ఫోన్ మోడల్, కంపెనీ అందించిన ఛార్జర్లు, కేబుళ్లతోనే ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాలి. వేరే ఛార్జర్ల వల్ల కూడా ఫోన్ వేడేక్కే అవకాశం ఉంది.
*ఫోన్ ను వాడని సమయంలో బ్లూటూత్, జీపీఎస్ వంటి వాటిని ఆఫ్ చేయడం బెటర్. దీనివల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
*ఫోన్ లోని సాఫ్ట్ వేర్ ను, ఫోన్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల మునుపటికన్నా ఫోన్ స్పీడ్ గా వర్క్ చేస్తుంది.
*ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నా.. ఓటీటీల్లో గంటలకొద్దీ సిరీస్ లు చూస్తున్నా సరే, మొబైల్ ప్రాసెసర్ వేడెక్కిపోతుంది. అది చల్లారేందుకు కొంత విరామం ఇవ్వాలి.
*ఫోన్ వేడిక్కేతే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. అది చల్లబడిన తర్వాత మాత్రమే తిరిగి ఆన్ చేసి, వాడుకోవాలి.
ఈ జాగ్రత్తలను పాటిస్తున్నా.. మీ ఫోన్ తరచుగా అదే పనిగా వేడెక్కుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బ్యాటరీ మార్చడం, ఇతర ఇంటర్నల్ సమస్యలు ఉన్నట్లు గుర్తించి.. టెక్నీషియన్ దగ్గరకు తీసుకువెళ్లి మార్పించుకోవడం లేదా బాగు చేయించుకోవాల్సి ఉంటుంది.