Telugu News

KFC: కూలీ నుంచి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు?

నలో చాలామంది చిన్న కష్టం ముసలోడే వచ్చినా తట్టుకోలేరు. నిరాశతో జీవితం అంతటితో ఆగిపోయింది అనుకుంటారు. కానీ ఎన్ని కష్టాలొచ్చినా, వృద్ధాప్యంలో నిరాశ చెందలేదు. 65 ఏళ్ల వయస్సులో.. కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (KFC)ని ప్రారంభించి.. బిలియనీర్ అయ్యారు. ఆయనే కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్. ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం గురించి తెలుసుకోవాలంటే 1890 సంవత్సరానికి వెళ్లాలి. 9 సెప్టెంబర్ 1890లో ఇండియానాలో జన్మించాడు మన కథ నాయకుడు సాండర్స్. ఆయనకు ఒక సోదరి, సోదరుడు ఉండేవారు. తన 5వ ఏటనే తండ్రి మరణించడంతో.. కుటుంబాన్ని చూసుకోవడానికి తల్లి పనికి వెళ్ళేది. దాంతో ఇంట్లో వంటతో పాటు చిన్నచిన్న పనులను సాండర్స్‌ చేసేవారు. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఇల్లు గడవడానికి, చదువు మానేసి పొలం పనులు, గుర్రాల బండ్లకు రంగులు వేసే పనులు చేసేవారు.

సాండర్స్‌ 12వ ఏట తల్లి మరో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రికి పిల్లలు ఇష్టం లేకపోవడంతో సాండర్స్‌, ఆయన సోదరి, సోదరుడిని సరిగ్గా చూసేవాడు కాదు. దాంతో తన 13వ ఏళ్ల వయసులో తల్లిని ఒప్పించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పనిలో చేరారు మన హీరో. సాండర్స్‌ దొరికిన పని చేస్తూ ఉండేవారు. ఇలా 17ఏళ్లు వచ్చేసరికి 6కు పైగా వివిధ ఉద్యోగాలు మారారు. 18వ ఏట పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అందులో ఒకరు అనారోగ్య సమస్యతో మరణించారు. దీంతో అతని భార్య సరైన ఉద్యోగం చేయలేని వాని దగ్గర ఉండలేనంటూ సాండర్స్‌‌ని వదిలి, తన పుట్టింటికి వెళ్ళింది. ఇలా తన జీవితంలో తండ్రి, తల్లి, భార్య, పిల్లల ప్రేమకు దూరమయ్యారు, స్థిరమైన ఉద్యోగం లేదు, జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లే అయినా.. నిరాశ చెందలేదు.
 
సాండర్స్‌‌కు 22 ఏళ్లు వచ్చాక, మిలటరీలో చేరి ఒక సంవత్సరం దేశానికి సేవ చేశారు. ఆ తర్వాత ఒక కేఫ్‌లో వంటవాడిగా, గిన్నెలు తోమేవాడిగా పని చేశారు. అలా కేఫ్ ఎలా నడుస్తుందో తెలుసుకొని, దాచుకున్న డబ్బుతో సొంతంగా ఒక కేఫ్‌ను తెరిచారు. అందులో మంచి లాభాలు అందుకోవడంతో, మరికొంత డబ్బును అప్పుగా తెచ్చి, 143 సీట్ల కెపాసిటీ ఉన్న ఓ రెస్టారెంట్‌ను తెరిచారు.

కొన్నాళ్లు లాభాలు వచ్చినా, ఆ తర్వాత మూసివేసే పరిస్థితి వచ్చింది. అలా వివిధ ఉద్యోగాలు, వ్యాపారం చేశాడు. కానీ అన్నిటిలో విఫలమయ్యాడు.

అలా తన 65 సంవత్సరంలో రిటైర్ అయినా సాండర్స్‌‌కు 105 డాలర్ల చెక్ పింఛనులా వచ్చింది.

దాన్ని చూసి తాను పడ్డ కష్టానికి ఇదా మిగిలింది అని మనస్థాపం చెందాడు.

ముసలోడే ఈ డబ్బుతో తాను ఎలా బతకాలనే బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయానికి వచ్చాడు.

అలాంటి సాండర్స్‌ ఎలా బిలియనీర్ అయ్యాడో తెలుసుకోడానికి పేజీ తిప్పండి.

ఒక జీరోగా తన జీవితం ముగియకూడదని, మరణించే లోపు ఏదైనా విజయం సాధించాలనుకున్నారు సాండర్స్‌. తనకు తెలిసిన విద్య చికెన్ వండటం.

ఇక తనకు వచ్చిన పింఛను డబ్బులో కొంత డబ్బుతో చికెన్ ఫ్రై చేసి 1009 రెస్టారెంట్స్‌కు వెళ్లి, దాని రుచి చూపించారు.

కానీ ఎవరు ఆ రెసిపీని తమ రెస్టారెంట్ మెనూలో చేర్చడానికి ఒప్పుకోలేదు. 1010వ వ్యక్తి ఒప్పుకున్నారు. ఇంకేముంది విజయం మన హీరో తలుపు తట్టింది. 8 సంవత్సరాల్లో సాండర్స్‌.. బిలియనీర్ అయ్యాడు. వయసు మీద పడడంతో వ్యాపారాన్ని 1964లో వేరే వాళ్లకు అమ్మేసి..

బ్రాండ్ తనది కాబట్టి, ప్రతీ సంవత్సరం తనకు కొన్ని డాలర్లను ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నారు.

అంతేకాదు, ఎన్నో ట్రస్ట్‌లను తెరిచి ప్రజలకు ఎడలేని సేవ చేశారు.

చివరగా 1980లో తన 90వ ఏట అనారోగ్య సమస్యతో మరణించారు. కానీ ఇప్పటికీ ఆ ట్రస్ట్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మీరు మీ వయసు చూసి నిరాశ చెందకుండా కష్టపడితే విజయం అనేది ఎప్పుడైనా, తప్పకుండా  వరించవచ్చు. ఆల్ ది బెస్ట్..

Show More
Back to top button