
ఏపీలో లక్షలాది మంది అభ్యర్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ వచ్చే నెల (మే) 15 వరకు కొనసాగనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ https://apdsc.upectfia.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో ఫీజు పే చేసినవారు తిరిగి మళ్ళీ ఇప్పుడు పే చేయాల్సినవసరం ఉంటుందా? లేదా?..
ఇటువంటి పలు సందేహాలకు చెక్ పెడదాం:
డీఎస్సీలో మొత్తం పోస్టులు ఎన్ని..?
✓మొత్తం 16,347 పోస్టులు.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో (2,678),
అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో (143) ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ:
2025 ఏప్రిల్ 20 (ఆదివారం) నుంచి మొదలు
✓తుది గడువు: 2025 మే 15.
✓మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి.
✓మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ✓గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు పూర్తిగా మినహాయింపు.
ఫీజు వివరాలు: మూడు విభాగాల్లో వివరాలను పూర్తిగా నింపిన తర్వాత అర్హత కలిగిన, ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు రూ.750 లెక్కన ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
ఏయే స్కూల్స్ లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ కానున్నాయి..
ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్, జువైనల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఖాళీలతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో భర్తీ చేస్తున్నారు.
మెగా డీఎస్సీ అప్లికేషన్ లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయి..?
మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
మొదటి విభాగం: ఇది వ్యక్తిగత సమాచారానికి సంబంధించింది.
రెండో విభాగం: విద్యార్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు వంటివి ఉంటాయి.
మూడో విభాగం: ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి.
ఒకటి, రెండు విభాగాల్లోని అంశాలను అస్పిరెంట్ ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే వీలుంది. కానీ అప్లికేషన్ ఫాంలోని డీటైల్స్ ను డీటెయిల్డ్ గా చూసుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే
మూడో విభాగంలో ఎలాంటి సవరణలు చేసుకునే అవకాశం ఉండదు.
డీఎస్సీ రాయాలంటే కావలసిన అర్హతలు:
ఐటీలో కనీస అర్హత మార్కులు..
ఓసీ: 60% (90 మార్కులు),
బీసీ: 50% (75 మార్కులు),
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు: 10% (60 మార్కులు)
అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యతా ఇచ్చిన ఆప్షన్ కు గనుక సెలెక్ట్ అవ్వకపోతే అతడి పేరు సెకండ్ ఆప్షన్ కు బదిలీ అవుతుంది. అదీ కాకపోతే ఊర్లో ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కంటిన్యూ అవుతుంది.
ఒకవేళ అదే అభ్యర్థి మొదటి ఆప్షన్ కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి. ఒక్కసారి ఒక పోస్టుకు సెలెక్ట్ అయితే తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టును మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
వయో పరిమితి ఎంతంటే..?
2024 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువ.. 11 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయసు 49 ఏళ్లు.
విద్యాంగులకు గరిష్ఠ వయసు 54 ఏళ్లుగా ఉంటుంది.
ఎక్స్ సర్వీస్ మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది.
ఇకపోతే గతేడాది డీఎస్సీ కోసం ఫీజు చెల్లించిన వారు మళ్లీ ఫీజు కట్టాలా?
అంటే, అవసరం లేదు.
గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా సర్కార్ హడావుడిగా 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ టైంలో దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సినవసరం లేదు. కాకపోతే కొత్తగా అప్లికేషన్ ఫామ్ ను పూర్తి వివరాలతో నింపి, సబ్మిట్ చేయాలి.
ఒకవేళ అభ్యర్థి గతంలో అప్లై చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలని అనుకుంటే మాత్రం ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున అడిషనల్ గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలవుతుంది..?
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో 17, (18/04/2005) ఆధారంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-8 విభాగాలుగా నిర్వాసిత శాతం మేరకు రిజర్వేషన్ అమలవుతుంది.
స్పోర్ట్స్ కోటా అమలు ఎలా..?
రాష్ట్ర ప్రభుత్వ నియమావళిననుసరించి అభ్యర్ధుల అర్హత మేరకు 9% స్పోర్ట్స్ కోటా మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
పరీక్ష కేంద్రాలు.. జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ, మండల కేంద్రాలు.
ఆన్లైన్ పరీక్ష తేదీలు: జూన్ 8 నుంచి జులై 6 వరకు
దరఖాస్తు ప్రక్రియ: ఇది రెండు విధానాల్లో జరుగుతుంది.
✓యాజమాన్యాలవారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవడం.
✓దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయడం.
✓గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాతనే వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు.
ఒక అభ్యర్థి మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్ ఇస్తారు.
మొదట అప్లికేషన్ సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి అలా చేయలేకపోతే హాల్ టికెట్ల జారీ చేయదని గుర్తుంచుకోవాలి.
అలానే దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్నీ సరిచూసుకుని, దరఖాస్తులు సమర్పించాలి.
✓అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవడంతో పాటు అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తారు.
✓ఎంపికైన అభ్యర్థులకు అకడమిక్స్, ఆంగ్ల భాష నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు.
✓కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఆన్లైన్) ఉంటుంది.
✓డీఎస్సీకి వచ్చే దరఖాస్తుల ఆధారంగా ఈ ఖాళీలను పొడిగించడం లేదా తగ్గించడం జరుగుతుంది. ఆ అభ్యర్ధుల సంఖ్య పెరిగి, పరీక్ష కేంద్రాల సమస్య ఏర్పడితే గనుక ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు.
✓ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడతలో 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయి.