
స్మార్ట్ ఫోన్ లు రోజుకో కొత్త ఇన్నోవేషన్ తో.. డిఫరెంట్ లుక్ అండ్ డిజైన్ లో.. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ముస్తాబై అలరించేందుకు వస్తున్నాయి.
ఇప్పుడు మరి వింతగా స్క్రీన్, యాప్స్ లాంటివేవీ ఇన్స్టలేషన్ చేయకుండానే, కీబోర్డు లాంటివేవి లేకుండానే.. ఒక కొత్త రకం మొబైల్ తరహా డివైజ్ త్వరలో మన ముందుకు రాబోతుందని మీకు తెలుసా..
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మైన్, ఐఫోన్ డిజైనర్ జానీ ఐవ్ లు కలిసి అచ్చం ఇలాంటి ఏఐ డివైజ్ ను రూపొందించడంపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు
తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఈ మధ్యకాలంలో దీని గురించి చర్చించుకున్న వీడియో కాస్త చాలా ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది.
ఇది రాబోయే రోజుల్లో టెక్నాలజీతో మన ఇంటరాక్షన్ ను మరింత గొప్పగా మారుస్తుంది.
నిజానికిది ఫోన్ కాదు. అలాగనీ దాన్ని రీప్లేస్ చేసే ఆల్టర్నేట్ కాదు. పూర్తిగా ఒక సరికొత్త డివైజ్ అని చెప్పవచ్చు. ఐఓ అనే సంకేత నామంతో దీన్ని పిలవచ్చు.
ఇది వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి ఎలాంటి యాప్ లను చూపించదు. సపోర్ట్ చేయదు. అయినా మన మాటలను చక్కగా వింటుంది. నేర్చుకుంటుంది. మనకు బదులుగా సాయం చేస్తుంది. ఒక రకంగా జేబులో ఏఐ మెదడు చిప్ ను పెట్టుకున్నట్టే!
ఈ పరికరంతో మాట్లాడితే, అది తిరిగి మనతో మాట్లాడుతుంది. అందుకు తగ్గట్టే బదులిస్తుంది. మీటింగ్స్, ఎంగేజ్మెంట్స్ ముఖ్యమైన వాటిని రిమైండ్ చేస్తుంది. ఐడియాలను అందిస్తుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రూట్ మ్యాప్ చూపిస్తుంది. అదీ కూడా మనం ఫోన్ స్క్రీన్ ను ఓపెన్ చేయకుండానే..
ఒక్క వర్డ్ అయిన టైప్ చేయాల్సినవసరమూ లేకుండానే అంటే, వింతగా ఉంది కదూ..
నిజానికి ఈ డివైజ్ మన నుంచే నేర్చుకుంటుంది. మాట్లాడే మాటలు, చేసే ప్రయాణాలు, ఉద్యోగం తీరు తెన్నులను బాగా దగ్గర్నుండి గమనిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యూజర్ పరిసరాలు, వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి పూర్తి అవగాహనను కలిగి ఉంటుంది.
ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్ వంటి స్క్రీన్ బేస్డ్ ప్రపంచాన్ని సృష్టించిన జానీ ఐవీనే ఇప్పుడు స్క్రీన్ నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తుండటం విచిత్రం! అయితే ఇదేమీ అప్పటికప్పుడు సాధ్యమయ్యే పని కాదు. వచ్చే ఏడాదిలో ఈ డివైజ్ అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.
ఇది టెక్నాలజీతో మనిషికి కొత్తరకం అనుబంధాన్ని సృష్టించగలదని వారు నమ్ముతున్నారు. సో, ఈ కొత్త పరికరం చేసే మ్యాజిక్ ను ఎక్స్ పీరియన్స్ చేసి తీరాల్సిందే!