
గుంటూరు కారంలో మహేష్ బాబు, అదుర్స్ లో ఎన్టీఆర్ – బ్రహ్మి కాంబోలో ఫేవరేట్ డైలాగులను ఇప్పుడు క్రియేటివ్ అండ్ క్రేజీగా మలచి చేస్తున్నారు గమనించారా?! అవును ఈ మధ్యకాలంలో మనకు నచ్చిన హీరో లేదంటే హీరోయిన్ చిన్న పిల్లలా మారి డైలాగ్స్ చెబుతుంటే భలే క్రేజీగా అనిపిస్తోంది కదూ. టెక్నాలజీ పుణ్యమా అని రోజుకో కొత్త ట్రెండ్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మొన్నటిదాకా ఉన్న జిబ్లి పోయి ఇప్పుడు ఏఐ జనరేటెడ్ క్యూట్ బేబీ వీడియోలు వచ్చాయి.
చిన్నారుల్లా మారిన కొందరు రాజకీయ నాయకులు, సినీ తారలు, ఇతర ప్రముఖుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముసలివాళ్లను కూడా పసిపిల్లలాగా మారుస్తూ.. నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్యాన్స్ తమ ఫేవరేట్ పర్సన్స్ ను తమకు నచ్చినట్లుగా మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు.
ఈ ముద్దులొలికే చిన్నారి వీడియోలను మీరు ఎంచక్కా క్రియేట్ చేయవచ్చు. ఇది ఎంతో ఈజీ కూడా.
చాట్ జీపీటీ లేదా ఇతర ఏఐ టూల్స్ నుపయోగించి పిల్లాడిలా కనిపించే ఫొటో ఒకటి ముందుగా క్రియేట్ చేయాలి.
తర్వాత వీడియో రూపంలో కావాలంటే ఫొటోను అప్లోడ్ చేసి సరైన ప్రాంప్ట్ దానికి ఇవ్వాలి.
ఏఐ టూల్ ఆ ఫొటోను చిన్నారి ముఖంలోకి మార్చి వీడియోగా మార్చుతుంది అంతే సింపుల్.. క్షణాల్లో మీకు నచ్చిన మీరు మెచ్చిన వీడియో రెడీ!