
మనం లీడ్ చేస్తున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. టైం ఎంత ప్రియారిటీగా మారిందో..
చదువు.. జాబ్.. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండింగ్.. ఫ్రెండ్స్.. వీకెండ్స్.. మధ్యలో సోషల్ మీడియా..
ట్రెండింగ్ థింగ్స్.. తెలుసుకుంటూ ఎంతో బిజీగా మారిపోయాం.
ఇలా ప్రియారిటీస్ మారుతూనే మన పనులన్నింటినీ ఈజీ చేసేందుకు ఈ.కామర్స్ ఎప్పటికప్పుడు ఎన్నో దారులను ఎంచుకుంటుంది.
కూర్చున్న చోటే ఆన్లైన్ లో షాపింగ్ లు.. కావాల్సిన వస్తువులు.. ఫుడ్ ఆర్డర్లు.. ఇంటికి కావాల్సిన సరకులు.. మొదలు.. వాట్ నాట్ ఎవర్తింగ్ ఇన్ అవర్ హాండ్స్ విథిన్ మినిట్స్.. అనే ఫార్ములాతో..
ట్రెండ్ కి తగ్గట్టు.. టెక్నాలజీకి అప్డేట్ అవుతూ.. మన అవసరాలను, పనులను చకచకా చేసేందుకు
ఈ.కామర్స్ కాస్త క్విక్ కామర్స్ గా రూపుదిద్దుకుంది.
అసలు ఈ క్విక్ కామర్స్ Q-commerce అంటే ఏంటి? ప్రయోజనాలు, నష్టాలు కీన్ గా తెలుసుకుందాం రండి:
Quick Commerce (క్విక్ కామర్స్) అంటే..
తక్కువ సమయంలో, instant గా 10 నుంచి 30 నిమిషాల్లో వినియోగదారులకు అవసరమైన సరుకులు/ వస్తువులన్నిటినీ చకచకా హోమ్ డెలివరీ చేయడం.
ఎలా పని చేస్తుంది?
డార్క్ స్టోర్లు (Dark Stores).. ఇవి ప్రతి చోటా చిన్న వేర్‌హౌస్‌ల్లా ఉంటాయి. కస్టమర్స్ కి, షాప్స్ కి మధ్యన మీడియంగా పని చేస్తాయి.
ఇప్పుడు ఏదేని యాప్ (Swiggy Instamart, Zepto, Blinkit లాంటివి) ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తే చాలు.. ఆర్డర్ చేసిన కొద్దీ నిమిషాల్లో.. లోకేషన్ కి దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్‌ను గుర్తించి, అక్కడి నుంచి ఆర్డర్ చేసిన వస్తువులను సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఆ డార్క్ స్టోర్ లో ఉన్న డెలివరీ ఏజెంట్.. వస్తువులను ప్యాక్ చేసి, డెలివరీ బాయ్ ద్వారా త్వరగా ఇంటికి ఎర్లీగా రీచ్ అయ్యేలా పంపిస్తారు.
లాభాలు..
ఇన్ టైంకి సరకుల డెలివరీ..
అత్యవసర సమయంలో ఈ క్విక్ కామర్స్ ఉపయోగపడుతుంది.
షాపింగ్‌కు ప్రత్యేకించి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఎక్కువమంది కస్టమర్లను అట్రాక్ట్ చేయడమే కాక మంచి రెవెన్యూ తెచ్చిపెట్టగలదు.
నష్టాలు..
డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మనకు ఏదైనా వస్తువు/ ఆర్డర్ ఎర్లీగా రావాలంటే.. అది వేగంగా డెలివరీ చేయాలంటే ఎక్కువ manpower అవసరం. అందుకు ఛార్జెస్ ఎక్కువవుతాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ సేవలు విస్తరించలేదు. స్టాక్ మేనేజ్మెంట్ సవాళ్లు అనేవి ఎదురవొచ్చు.
ఇన్ టైం, తక్కువ టైంలో సరకులను భద్రపరచడమనేది కాస్త కష్టమే!
దీనివల్ల చిన్న వ్యాపారులకు, కిరాణా షాపులు రన్ చేసేవారికి పెద్ద దెబ్బ!
అత్యంత వేగవంతమైన, త్వరితగతిన డెలివరీ కోసం డిమాండ్ కి తగ్గట్టు స్పీడ్ ను మెయిన్ టైన్ చేయడం.. అంతే క్వాలిటీ అండ్ క్వాంటిటీతో పని చేయడం సవాలు లాంటిదే అని చెప్పవచ్చు.
భవిష్యత్తులో దీని ప్రభావం ఎటువంటి రంగాలపై పడుతుందో.. ఏయే స్ట్రీమ్స్ ను ఎఫెక్ట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.