పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్ లో విన్నింగ్.. భారత్ కు ఎన్నో ఏళ్ల కల.. ఎప్పుడో 2007లో టీ20 ప్రారంభంలో..
గెలుపును చవిచూసిన భారత్.. మధ్యలో ఏడు పర్యాయాల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచి.. కోట్లాది ప్రజల హృదయాలు ఉప్పొంగేలా చేసింది..
ఎన్నో నాటకీయ మలుపులు.. మరెంతో ఉత్కంఠ రేపుతూ.. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగి..
టోర్నీ ఆరంభ దశలో తడబడి.. ఆపై అంచనాలను మించే ప్రదర్శనతో.. దక్షిణాఫ్రికాపై నెగ్గి, కప్పు కొట్టింది టీమ్ఇండియా…
గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే.. స్టార్టింగ్ లో హైప్ చూపించి.. ఫైనల్లోకి వచ్చేసరికి అంచనాలకు తగని ఆటతో కప్పును పోగొట్టుకుంది. అంతకుముందు ఐసీసీ టోర్నీల్లోనూ చాలాసార్లు ఇలాగే బోల్తా పడింది. దీంతో ఈసారి టోర్నీ మొదలయ్యేటప్పటికీ రోహిత్‌సేన మీద పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు జట్టులో సమస్యలు.. హార్దిక్ ఐపీఎల్లో ఘోరంగా విఫలమవ్వడం.. జడేజా ఫామ్‌లో లేకపోవడం. బుమ్రా మినహా ఏ బౌలర్ మీద కూడా నమ్మకం లేకపోవడంతో మొత్తంగా ఇది ప్రపంచకప్ గెలిచే జట్టులా.. టఫ్ ఇచ్చే టీమ్ లా కనిపించలేదు. దీంతో అభిమానుల్లోనూ అంచనాలు తగ్గాయి.
అలాంటి సమయంలో, అదరగొడతారనుకున్న ప్లేయర్స్.. ఫైనల్ బరిలో అంతంతమాత్రమే ఆడితే.. అసలు ఊహించని ఆటను ప్రదర్శించి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు మరికొంతమంది ప్లేయర్స్..
కోహ్లి మొదట్లో కీలక ఇన్నింగ్స్ చేయగా.. ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా టోర్నీపై తనదైన ముద్ర వేయలేకపోయాడు. అలాంటిది
స్ట్రోక్ ప్లేను మాత్రమే ఇష్టపడే రోహిత్ శర్మ నిలవలేడని అనుకుంటే గొప్పగా రాణించాడు. ఇక ఐపీఎల్లో తీవ్రంగా తడబడ్డ హార్దిక్ పాండ్య.. బ్యాటు, బంతి రెండిటితో అదరగొట్టాడు. గ్రూప్ దశలో తుది జట్టులో చోటు దక్కని కుల్దీప్ యాదవ్.. సూపర్-8 నుంచి అవకాశం దక్కించుకుని గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. అక్షర్ పటేల్ సైతం అంచనాలను మించి రాణించాడు. అనుకోకుండా ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్న పేసర్ అర్ష్‌దీప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవడం విశేషం.
వీరందరీ ఆట గెలుపులో భాగమైతే.. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి గెలుపు వైపు మళ్లించిన బుమ్రా ఆటలో కీలకం అయ్యాడు.
ఐసీసీ టైటిళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ ముగింపు పలకడంలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కేవలం వికెట్లు తీయడమే కాదు పరుగులు కట్టడి చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో అతనికి బంతితో పెట్టిన విద్య. ప్రపంచ మేటి పేసర్లలో తాను ఒకడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్ స్కోరు 176. (ఫైనల్లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే.) గత 2021లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 173 చేయగా, ఆ స్కోర్ రికార్డు దీంతో బద్దలైంది.
2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒకరైన రోహిత్.. ప్రస్తుతం విజేతగా నిలిచిన జట్టులోనూ ఉన్నాడు. దీంతో రెండు టీ20 ప్రపంచకప్ విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ప్లేయర్(2007)గా, కెప్టెన్(2024)గా ప్రపంచకప్‌లు గెలిచిన తొలి క్రికెటర్ ఇతడే.
టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు సొంతం చేసుకున్న జట్ల జాబితాలో ఇంగ్లాండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) తర్వాత టీమ్‌ఇండియాది మూడో స్థానం.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసింది అర్ష్‌దీప్.. కాగా ఈ ప్రపంచకప్‌లో బుమ్రా వికెట్లు(15). ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ కూడా అతనే.
రోహిత్, కోహ్లి ఆడిన ఐసీసీ ఫైనల్స్ మొత్తం 8. అయితే అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన యువరాజ్ సింగ్ (7) రికార్డును వీళ్లిద్దరూ బద్దలుకొట్టారు.
భారత టీ20 చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్ లో ఇది ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పైనా రోహిత్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కప్ గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.