Telugu News

రేవంత్ రెడ్డి మనసులో మాట

తెలంగాణ ముద్దు బిడ్డగా ప్రజల్లో స్థానం సంపాదించుకున్న రేవంత్ రెడ్డి తన మనసులోని భావాలను పంచుకున్నారు.తాను గెలవడానికి రాహుల్ గాంధీ యాత్ర,అలాగే తానూ ప్రజల్లోకి వెళ్ళిన తీరును గురించి వెల్లడించారు.

పదేళ్ళ క్రితం బందీ అయిన ప్రజలను విడిపించానని,తనను నమ్ముకున్న వాళ్ళు తనని గెలిపించారని,అలాగే నిరాశలో ఉన్న వారు కొత్తదనం కోరుకోవడం వలన తాను గెలిచానని, అందువల్లే ప్రజల్లో సేవకుడిగా తప్ప పాలకుడిగా ఉండను అంటూ, పాత ప్రభుత్వం చేసినవన్నీ మంచి పనులే,కానీ అవి అందేవారికి అందకుండా ధనికులకే అందాయని,అందుకే తాను ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా నిజమైన పేదలకు సాయం అందించడానికి ప్రజాపాలన అనేది పెట్టానని నిర్మొహమాటంగా తెలిపారు.

అలాగే తానొక సామాన్య మనిషి గానే ఎలాంటి సెక్యురిటి లేకుండా అందరిలా తిరగాలనే ఉద్దేశ్యంతో సెక్యురిటి వద్దాన్నానని తెలిపారు.నాయకుడు అంటే ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యి,వారి సమస్యలు తెలుసుకోవాలి కాని పాకిస్తాన్ లాగా కంచెలు కట్టి, లోనికి ఎవర్ని రానివ్వకుండా,సమస్యలు తెలుసుకోకుండా పాలన చేయడం అనేది వ్యర్ధం అంటూ,ధనవంతుడైన పొంగులేటికి రైతుభందు ఇచ్చారు ఆయన తిప్పి కొట్టారు, అయినా మళ్ళి వేశారు. ఇలా ఆయనకు ఒక్కడికే జరిగితే ఇంకెంతమందికి ఇలా జరిగి ఉంటుందని, అందుకే నిజమైన సాయం ఎవరికీ కావాలో,ఎంతమంది నిరుపేదలు ఉన్నారో తెలుసుకోవడానికి సాయం అందించడానికే తాను ప్రజాపాలన,ప్రజావాణి కార్యక్రమాలు పెట్టనని అయన పేర్కొన్నారు.

పేదల గొంతు వింటూ,యువత,మహిళల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నది తన ధ్యేయమని అందువల్లే మొదట అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశామని,అలాగే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ఇంద రు.పది లక్షలు ఇచ్చామని, తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు రేవంతన్న అని ఆడబిడ్డలు అన్నగా గుండెల్లో పెట్టుకున్నప్పుడు తాను వారికి ఆ మాత్రం చేయడంలో తప్పు లేదని చాలా హృద్యంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు.

ఇప్పటి వరకు ఉన్న హామీలు,గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని మొదట ఉన్నవే కొత్తవేవి కావని, వాటిని అలాగే ఉంచుతూ,తాను అమలు చేయాలనుకున్న వాటిని అమలు చేస్తానని,అయితే రాష్ర సంపదను పెంచాలని,ఉన్న అప్పులన్నీ తీరాలి అంటే తనకు కొంత సమయం పడుతుందని దాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని అన్నారు.

అలాగే తన మంత్రి వర్గంలోని ప్రతి వ్యక్తికి తానూ న్యాయం చేస్తానని, వారు తనవెంట ఉంటు తన బాధలను ,వారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు , వారికి ఎప్పటికీ నా గుండెల్లో చోటు ఉంటుంది అని, వారి సేవలు సూచనలు తనకు అవసరం కాబట్టి చిన్న, పెద్దా అనే తేడా లేకుండా తన అనుచరులతో కలిసి ప్రతి ఒక్క నిర్యయం పై చర్చించి అందరికి ఆమోదం అయిన తుది నిర్ణయాన్ని తానూ అమలు చేస్తానని ఆయన తన మనసులో మాటలు పంచుకున్నారు.

అలాగే రాజకీయం లో విమర్శలు,వ్యక్తిగత దూషణలు ఉంటాయి అయితే అవి మరి రేచ్చ గొట్టే విధంగా ఉండకూడదు.అలాగే కుటుంబాన్ని రాజకీయాలలోకి తీసుకు రావద్దు అంటూ అభిప్రాయాన్ని తెలిపారు.ఇలా రేవంత్ రెడ్డి తన అనుభవాలను వివరిస్తూ.. చిన్న కార్యకర్తగా మొదలైన నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను, విమర్శలకు కుంగిపోను ,పొగడ్తలకు పొంగిపోను కాని రాష్ర్తనికి సంపద ఎలా పెంచాలి, బడ్జెట్ ఎంత అనే విషయాన్నీ అందరితో అసెంబ్లీలో నే చర్చిస్తానని, ప్రజలకు నిజమేంటి,అబద్దాలు ఏంటనేది పూర్తిగా తెలిసే అవసరం

ఎంతైనా ఉందని ,అందువల్లే అది రహస్యం అయినా కాకపోయినా ప్రజల ముందు పెడితే నిజాలు గ్రహించి, వారు తీర్పు చెప్తారని, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇంకా రావాలి కాబట్టే తాను బహిరంగంగా మాట్లాడతానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తాను చేయబోయే కార్యక్రమాల గురించి మున్ముందు సమీక్షించి అందరికి ఆమోదమైన విధంగా కృషి చేస్తానని, రెండేళ్ళు అధికారం లో ఉన్నా, ఐదేళ్ళు అధికారంలో ఉన్న ఇదే విధంగా తాను ముందు కూడా ఉంటానంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

రేవంత్ రెడ్డి మాటల్లో చాలా నిజముంది అబద్దం తో అన్నేళ్ళు ఉండలేం, నిజం అనేది ఎప్పటికైనా బట్టబయలు అవ్వాల్సిందే,అందులో పడి చావాల్సిందే, పేదల గొంతు వింటూ,యువత,మహిళల కళ్ళలో ఆనందాన్ని చూడాలన్నది తన ధ్యేయమని అందువల్లే మొదట అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశామని,తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు రేవంతన్న అని ఆడబిడ్డలు అన్నగా గుండెల్లో పెట్టుకున్నప్పుడు తాను వారికి ఆ మాత్రం చేయడంలో తప్పు లేదని చాలా హృద్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.

ఇప్పటి వరకు ఉన్న హామీలు,గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని మొదట ఉన్నవే కొత్తవేవి కావని, వాటిని అలాగే ఉంచుతూ,తాను అమలు చేయాలనుకున్న వాటిని అమలు చేస్తానని,అయితే రాష్ర సంపదను పెంచాలని,ఉన్న అప్పులన్నీ తీరాలి అంటే తనకు కొంత సమయం పడుతుందని దాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని అన్నారు.

అలాగే తన మంత్రి వర్గంలోని ప్రతి వ్యక్తికి తానూ న్యాయం చేస్తానని, వారు తనవెంట ఉంటు తన బాధలను,వారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు, వారికి ఎప్పటికీ నా గుండెల్లో చోటు ఉంటుంది అని, వారి సేవలు సూచనలు తనకు అవసరం కాబట్టి చిన్న, పెద్దా అనే తేడా లేకుండా తన అనుచరులతో కలిసి ప్రతి ఒక్క నిర్ణయం పై చర్చించి అందరికి ఆమోదం అయిన తుది నిర్ణయాన్ని తానూ అమలు చేస్తానని ఆయన తన మనసులో మాటలు పంచుకున్నారు.

అలాగే రాజకీయం లో విమర్శలు,వ్యక్తిగత దూషణలు ఉంటాయి అయితే అవి మరి రేచ్చ గొట్టే విధంగా ఉండకూడదు.అలాగే కుటుంబాన్ని రాజకీయాలలోకి తీసుకు రావద్దు అంటూ అభిప్రాయాన్ని తెలిపారు.

 ఇలా రేవంత్ రెడ్డి తన అనుభవాలను వివరిస్తూ.. చిన్న కార్యకర్తగా మొదలైన   నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను, విమర్శలకు కుంగిపోను,పొగడ్తలకు పొంగిపోను కాని రాష్ర్తనికి సంపద ఎలా పెంచాలి, బడ్జెట్ ఎంత అనే విషయాన్నీ అందరితో అసెంబ్లీలో నే చర్చిస్తానని, ప్రజలకు నిజమేంటి,అబద్దాలు ఏంటనేది పూర్తిగా తెలిసే అవసరం ఎంతైనా ఉందని అందువల్లే అది రహస్యం అయినా కాకపోయినా ప్రజల ముందు పెడితే నిజాలు గ్రహించి, వారు తీర్పు చెప్తారని, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇంకా రావాలి కాబట్టే తాను బహిరంగంగా మాట్లాడతానని వెల్లడించారు.

అలాగే తనకు తన కుటుంబ సభ్యుల సహకారం,తన సోదరుడు,భార్యా, పిల్లల సహకారం ఉండడం వల్లే తానూ విజయం సాధించగలిగాను,వారి సహకారం మరవలేనని,అలాగే తనను నమ్మిన కొదరికి మంచి పదవులు ఇచ్చి వారి సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తానని ఆయన తెలిపారు.

అలాగే ప్రతిపక్ష నాయకులకు కూడా అన్ని విషయాలు చెప్పి,వారి సూచనలు తీసుకుంటామని,కానీ వారు కూడా సుముఖత చూపడంలో సందేహం ఉందని అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నవారు తమపై ఏవో విమర్శలు చేస్తున్నారు,తాము వచ్చి ఇంకా నెలరోజులు కాకుండానే అన్ని హామీలు వెంటనే అమలు చేయాలి అనడం చాలా తొందరపాటు చర్య అని, అయితే ఓడిపోయామనే బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదంటూ వారికి సూచనలు ఇచ్చారు.

మీరు ప్రశ్నించండి కానీ హామీలు అమలు చేయనప్పుడు,ఇస్తున్న పథకాలలో తప్పులు జరిగితే,హామీలు అమలు కాకుండా ఉంటే ప్రశ్నించండి కానీ ప్రతి డానికి విమర్శలు చేయడం సరికాదు అంటూ హితబోధ చేశారు.

నిరుపేదలు ఎంతమంది ఉన్నారు,వారికి రావాల్సిన కనీస పథకాలు అమలు అవుతతున్నాయా, లేదా ధనికులకే అన్ని విధాలా లబ్ది చేకురుతుందా అని తెలుసుకోవడానికే ప్రజావాణి ,ప్రజాపాలన లాంటివి పెడితే సరిగ్గా వివరాలు తెలుస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి తాను చేయబోయే కార్యక్రమాల గురించి మున్ముందు సమీక్షించి అందరికి ఆమోదమైన విధంగా కృషి చేస్తానని, రెండేళ్ళు అధికారం లో ఉన్నా, ఐదేళ్ళు అధికారంలో ఉన్న ఇదే విధంగా తాను ముందు కూడా ఉంటానంటూ భావోద్వేగంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటల్లో చాలా నిజముంది అబద్దం తో అన్నేళ్ళు ఉండలేం, నిజం అనేది ఎప్పటికైనా బట్టబయలు అవ్వాల్సిందే,అందులో పడి చావాల్సిందే.

రేవంత్ రెడ్డి గారు మరో విషయం మాట్లాడుతూ,ఇన్ని జిల్లాలు అవసరం లేదని కొన్ని జిల్లాల పునరేకీకరణ ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనతో ఉన్నట్టుగా. 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి, జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

ఈ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసేందుకు కూడా  రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముందని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడినా వేల కోట్ల అప్పును తీరుస్తానని,ప్రజలకు ఉచిత విద్యుత్ ను ఇస్తామని,ఆడబిడ్డలకు చేయూత అందిస్తానని, అలాగే వికలాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని వారు మనసులో ఉన్న మాటలను ప్రజలతో పంచుకున్నారు.

నిజంగా ఇన్నేళ్ళ తర్వాత ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడం మొదటిసారి అయితే, ఎంతో క్లారిటీతో అన్ని శాఖల పై అవగాహన ఉండడం, ప్రతి విషయాన్నీ పెద్దల నుండి చిన్న కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకోవడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.

కాబట్టి ఇలాంటి విషయాలు వినడం కొత్తగానూ, ఒక భరోసా ప్రజల్లో కల్పించడం అనేది ప్రజల్లో తమ నాయకుడు తమకు కొండంత భరోసా ఇచ్చినట్టుగా అనుకుంటున్నారు.

అలాగే తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు రుణపడి ఉంటానని వారిని తన గుండెల్లో పెట్టుకుంటానని రేవంత్ రెడ్డి తెలియచేయడం సంతోషకరమైన విషయం.

అయితే ఇక్కడ ఇంకొక సందేహం ప్రజల్లో ఉంది, ఇంత అప్పుల్లో ఉన్న రాష్ర్టన్ని ఎలా గట్టేక్కిస్తారో చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అవినీతి అనేది ఉండకూడని మంచి పరిపాలన అందించాలని రేవంత్ రెడ్డి గారిని మనస్పూర్తిగా కోరుకుంటూ..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెలరోజులు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ..భవ్యచారు

Show More
Back to top button