Telugu News

ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంతో ఎన్నో ప్రయోజనాలు

ఎలా దరఖాస్తు చేయాలి?

వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా పెట్టుబడి పెట్టే స్థోమత లేక చాలామంది ఆగిపోతుంటారు. అలాంటి వారి కోసం వచ్చిన పథకమే ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన. MUDHRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇంతకీ.. దీనికి అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి ముద్ర యోజనాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టారు. ఈ పథకంలో భాగంగా నాన్-కార్పొరేట్, నాన్-ఫార్మ్, సూక్ష్మ, చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. ఈ రుణాన్ని కమర్షియల్, RRB, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, MFI, NBFCలు ఇస్తాయి. వెబ్‌సైట్‌(www.udyamimitra.in)లోనూ దరఖాస్తు చేయవచ్చు. ముద్ర లోన్ శిశు, కిషోర్, తరుణ్ అని  మూడు రకాలుగా ఉన్నాయి.
* శిశువులో రూ.50 వేలు
* కిషోర్‌లో రూ.50 వేలు-రూ.5 లక్షలు
* తరుణ్‌లో రూ.5 లక్షలు-రూ.10 లక్షలు
 
కావలసిన పత్రాలు

* ఫొటో ఐడీ ప్రూఫ్
* ప్రస్తుత చిరునామా ప్రూఫ్
* గత 2 సంవత్సరాల ITR
* 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
* నివాసం/కార్యాలయం యాజమాన్య రుజువు
* వ్యాపారం కొనసాగిస్తున్నట్టు రుజువు
* ట్రేడ్ రిఫరెన్స్
వీటితో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్‌ కూడా అందజేయాలి.

ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి?

మీరు చేసే వ్యాపారం ఏంటి, ఎంత ఆదాయం వస్తుంది, పెట్టుబడి ఎంత, ఎంత రుణం కావాలి, ఎందుకు కావాలి అని ఒక రిపోర్ట్ తయారు చేయాలి. దాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. ఇది చాలా స్పష్టంగా ఉండాలి. అన్ని పత్రాలు సరిగా ఇస్తే, మీకు రుణం త్వరగా మంజూరు చేస్తారు. మీరు రుణం తీసుకోవడానికి ఒక కార్డు అందజేస్తారు. దాన్ని ఒక కార్డు డెబిట్ కార్డులా ఉపయోగించుకోవాలి.

Show More
Back to top button