Telugu News

డిజి పిన్ తో మీ చిరునామా సేఫ్!

ఇళ్లు, ఏదేని అడ్రస్ ను మరింత అక్యురేట్ గా, ఈజీగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ కలిగిన డిజి పిన్ అనేది ఎంతో బెటర్ గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలను మరింత సజావుగా, సమర్ధవంతంగా అందించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర సేవలు కావాల్సివచ్చినప్పుడు GPS ఆధారంగా కచ్చితమైన చోటుకి కావాల్సిన సేవలు అందించేందుకు వీలు కల్పిస్తుంది.

మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరునామా సరిగా లేని ప్రాంతాల్లో GPS ఆధారంగా ఫలానా  ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఇది అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతోందన్నమాట. 

స్పష్టమైన రూల్స్ అండ్ రెగులేషన్స్ లేకపోవడంతో, కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి అడ్రస్ డేటాను సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు చిరునామాల్ని జోడించేందుకు సిద్ధమవుతుంది.  

మీకు చెందిన డిజిపిస్ కోడ్ ను ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

https://dac.indiapost.gov.in/mydigipin/home

ఇందులో మీరు మీ ఇంటి ఏరియాని గుర్తించి, మీ డిజిపిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్ ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా డిజిపిన్ ను క్రియేట్ చేయడానికి వీలవుతుంది. 

అలాగే ఇది పాత చిరునామాను తొలగింస్తుందనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈ డిజిపిన్ మీ పాత చిరునామాను రీప్లేస్ చేయదు. ఇది అడిషనల్ డిజిటల్ చిరునామాగా మీకు యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంటి కొత్త చిరునామాను అందివ్వడంలో ఈ డిజిపిన్ ముందు ఉండబోతుందన్నమాట.  

Show More
Back to top button