Telugu Opinion Specials

DISCOUNT vs BUY ONE GET ONE OFFER.. ఏది బెటర్?

షాపింగ్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. అందులో ఆఫర్స్ ఉన్నాయి అని తెలిస్తే ఇక అంతే. షాప్ ముందు క్యూ కడతారు. పండుగలకు రకరకాల ఆఫర్ల పేరుతో ప్రజలను వ్యాపారులు ఆకర్షిస్తారు. అయితే వాళ్ళు అందించే ఆఫర్స్ వెనక నిజాలు మీకు తెలుసా? అలా ఆఫర్స్‌లో కొనడం లాభమా? నష్టామా? వీటి గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

మనం చాలా రకాల ఆఫర్స్ చూస్తాం. 50% ఆఫ్ లేదా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని. మనం ఈ రెండు ఒకటే అనుకుంటాం కానీ ఇవి వేరు. 50% ఆఫ్ ఉన్నప్పుడు మనకు ఏది అవసరమో దానికి సగం డబ్బులు మాత్రమే కడతాం. అదే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్నప్పుడు మనకు అవసరం ఉన్నా లేకున్నా రెండు తీసుకుంటాం. సాదారణంగా ఏవైతే తక్కువ సేల్ అవుతాయో వాటికి ఈ ఆఫర్ ఇస్తారు. దాంతో అవి బాగా అమ్ముడు పోతాయి. కాబట్టి మీరు ఏ వస్తువు తీసుకుంటున్నా.. అది అవసరం ఉంటేనే తీసుకోండి. చాలామంది ఆఫర్స్ చూసి అవసరం లేకున్నా వస్తువులు కొంటూ డబ్బులు వృధా చేసుకుంటున్నారు.

మరో వైపు 40% డిస్కౌంట్, రెండు కొంటే ఒకటి ఫ్రీ అనే ఆఫర్ ఉన్నప్పుడు మీరు ఏది ఎంచుకుంటారు. చాలామంది రెండు కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్ ఎంచుకుంటారు. కానీ ఇలా కొనడం వల్ల వల్ల మనకు 33.3 శాంతమే డిస్కౌంట్ వస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ.500 ఉంది అనుకోండి. ఇందులో 40% డిస్కౌంట్ అంటే రూ.300లు కడతారు. ఇవి మూడు తీసుకుంటే రూ.900 అవుతుంది. అదే మీరు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌లో కొంటే రెండింటికి రూ.1000  చెల్లించాలి. దీంతో ఒక్కో వస్తువుకు రూ.333.3 చెల్లిస్తున్నట్లు. కాబట్టి ఏదైన వస్తువు తీసుకునే ముందు మీరు కొనాలనుకుంటున్న వస్తువులు ఏ అఫర్‌లో ఉన్నాయి, ఎంత ధర తక్కువ అవుతుందో చూసుకుని నిర్ణయం తీసుకోండి.

Show More
Back to top button