Telugu Opinion Specials

స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా.? వద్దా.?

ఈరోజుల్లో స్టాక్ మార్కెట్ గురుంచి ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. దానిపై ప్రజల్లో అవగాహన తక్కువ. పైగా ఎన్నో సందేహాలు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలి.? ఎంత ప్రాఫిట్ వస్తుంది..? వంటి డౌట్స్ ఎక్కువ. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి.. అందులో ఏయే అంశాలు ఉంటాయి. మార్కెట్ ఎలా పని చేస్తుంది వంటి పలు విషయాల గురుంచి క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం..

స్టాక్ మార్కెట్ అంటే..?

స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ షేర్లను (భాగస్వామ్యాలను) కొనుగోలు చేయడం లేదా అమ్మడం జరిగే చోటు. దీన్నే షేర్ మార్కెట్ అని కూడా అంటారు. 

ఇక్కడ వ్యక్తులు లేదా సంస్థలు స్టాక్‌ల రూపంలో కంపెనీల్లో భాగస్వామ్యం పొందవచ్చు. ఇలా స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీలు నిధులను సమీకరిస్తాయి. అలానే పెట్టుబడిదారులు లాభాలు  పొందుతారు.

స్టాక్ మార్కెట్ ప్రధానంగా రెండు రకాలు:

  1. ప్రాథమిక మార్కెట్ (Primary Market): ఇక్కడ కంపెనీలు ఫస్ట్ టైం జనాలకు షేర్లను ఆఫర్ చేస్తాయి. దీనిని IPO (Initial Public Offering) అని పిలుస్తారు.
  2. ద్వితీయ మార్కెట్ (Secondary Market): ఇక్కడ ఇప్పటికే ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు ఒకరినొకరు కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

భారతదేశంలో ఉన్న ప్రముఖ స్టాక్ మార్కెట్లు:

  • బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)

స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుందంటే..?
స్టాక్ మార్కెట్ అనేది కంపెనీ షేర్లను కొనడానికి లేదంటే అమ్మడానికి ఉన్న ఒక ప్లాట్ ఫామ్. ఇక్కడ పెట్టుబడిదారులు అయిన ఇన్వెస్టర్లు, ట్రేడర్లు  కంపెనీ షేర్లను మార్కెట్‌లో కొని, అమ్ముతూ ప్రాఫిట్ పొందడానికి ట్రై చేస్తారు. ఇది మెయిన్ గా డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయి ఉంటుంది.

స్టాక్ మార్కెట్ ధరను ఎవరు డిసైడ్ చేస్తారంటే..?
స్టాక్స్ ధరను ఫలానా వ్యక్తి ఫలానా ధర అంటూ ఎవరూ నిర్ణయించరు. ఇది మార్కెట్‌లో కొనుగోలు చేయాలనుకునేవారిని (buyers), అమ్మాలనుకునేవారిని (sellers) బట్టి డిసైడ్ అవుతుంది. ఎక్కువమంది కొనాలనుకుంటే ధర రైజ్ అవుతుంది.. అదే ఎక్కువమంది అమ్మాలనుకుంటే ఆ ధర పడిపోతుంది. ఇది మార్కెట్ మెకానిజం ద్వారా ఏర్పడే డిమాండ్ & సప్లై పై ఆధారపడి వర్క్ చేస్తుంది.

స్టాక్స్ విలువను నిర్ణయించే అంశాలేంటి..?
ఒక స్టాక్ విలువను నిర్ణయించడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటంటే..

1.కంపెనీ ఫండమెంటల్స్: కంపెనీ ఆదాయం (revenue), లాభం (profit), ఆస్తులు (assets), అప్పులు (debts), నిర్వహణ (management efficiency) మొదలైనవి.

2. ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే అవకాశాలు: కంపెనీ భవిష్యత్తులో ఎలా వృద్ధి చెందుతుందో అంచనా వేయడం.

3. మార్కెట్ ధోరణులు: ఆయా రంగం లేదా ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న తాజా మార్పులు.

4. ఆర్థిక పరిస్థితులు: దేశ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ప్రభుత్వం తీసుకునే విధానాలు, నిర్ణయాలు మొదలైనవి.

5. Sentiments: ఇన్వెస్టర్ల అభిప్రాయాలు, లేటెస్ట్ వార్తలు, అంచనాలు.. ఇలా అన్ని కూడా స్టాక్ ధరపై ఎఫెక్ట్ చూపిస్తాయి.

మొత్తానికి, స్టాక్ మార్కెట్ అనేది ఒక డైనమిక్ సిస్టమ్. అది డిమాండ్ అండ్ సప్లై, కంపెనీ పనితీరు, భవిష్యత్ అంచనాలు, మార్కెట్ స్థితిగతులు వంటి అనేక అంశాలపై ఆధారపడి పని చేస్తుంది.

*ప్రతి సెల్లర్(seller)కి ఒక బయర్ అవసరం.. అలాగే ప్రతి బయర్ కి ఒక సెల్లర్ అవసరం.

ఉదా: ఒక సంస్థ ఫలానా షేర్ ని 1కోటి యూనిట్లను కాంస్టాంట్ ధర శ్రేణిలో కొనాలనుకుంటే, అదే ధర శ్రేణిలో 1 కోటి యూనిట్లను అమ్మడానికి సిద్ధంగా ఉన్న సెల్లర్స్ (అమ్మకందారులు) కావాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ షేర్ వాల్యూ పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అవసరమైన అమ్మకపు ఆర్డర్లు లేకపోతే ధర అనేది పెరిగి, మిగిలినది పెండింగ్‌లో ఉంటుంది. ఈ సూత్రాన్నే డిమాండ్ అండ్ సప్లై అంటారు.

డిమాండ్ అండ్ సప్లై మధ్య imbalance (అసమతుల్యత) ఉంటే ధర పెరుగుతుంటుంది లేదా తగ్గుతుంటుంది.
అదే డిమాండ్ అండ్ సప్లై సమతుల్యంగా ఉంటే.. ధర పెరగడం లేదా తగ్గడానికి వీలు ఉండదు.

స్టాక్ మార్కెట్‌లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్..

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ప్లాన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. వీటిని మీ లక్ష్యాలు, టైమ్ ఫ్రేమ్, రిస్క్ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవి..
 

1. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్..

గడువు: 5–10 సంవత్సరాల కంటే ఎక్కువ. ఈ ప్లాన్ లో బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ(Large Cap, Blue Chip stocks) ల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఉదా: Reliance, TCS, HDFC Bank, Infosys వంటి మొదలైన స్టాక్‌లు.

SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడి పెంచుకుంటూ పోవడం మంచిది.


2. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్.. 

గడువు: 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు. Mid-cap, Small-cap stocksలో పెట్టుబడి పెట్టవచ్చు.
మార్కెట్ ట్రెండ్, టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా షార్ట్ టర్మ్ ప్లాన్స్ టార్గెట్ చేసుకోవచ్చు.

3. థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్..

గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇండియా, EVs, ఫైనాన్షియల్ టెక్నాలజీ (FinTech) వంటి పలు రంగాల్లో వచ్చే అవకాశాల మీద ఫోకస్ పెట్టే ప్లాన్ ఇది.
కొన్ని థీమ్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లను సెల్ఫ్ గా ఎంపిక చేసుకోవచ్చు.

4. డివిడెండ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్..

రెగ్యులర్ గా వచ్చే ఆదాయం లేదా రాబడి కోసం డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఉదా: ITC, Coal India, Hindustan Zinc వంటి కంపెనీలు.

5. ఇండెక్స్ ఫండ్ & ETFs..

నిఫ్టీ 50, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్‌లను ట్రాక్ చేసే ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

తక్కువ ఖర్చుతో, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉండే ఈ ప్లాన్ ను తక్కువ టైం, రిటర్న్స్ పెట్టాలనుకునేవారు ఎంపిక చేసుకోవచ్చు.

6. SIP ద్వారా స్టాక్ ఇన్వెస్ట్మెంట్..

స్టాక్స్‌లోనూ SIPలాగా నెల నెల పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది మార్కెట్ టైమింగ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.

గమనించాల్సినవి:

  • రిస్క్ అనాలిసిస్ చేయాలి. 
  • పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ తప్పనిసరి.
  • ఆర్థిక లక్ష్యాలు, ప్లానింగ్స్ అనేవి స్పష్టంగా ఉండాలి.
  • కనీసం 3- 5 సంవత్సరాల టర్మ్ లో పెట్టుబడులు చేయడం మంచిది.

Show More
Back to top button