Telugu Opinion SpecialsTelugu Politics

ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?

ఏపీలో ఎన్నడూ లేనంతగా 81% పోలింగ్ జరిగింది. దీంతో ఈ ఎన్నికల సమరంలో తామే విజయదుందుభి మోగిస్తామని వైసీపీ, NDA కూటమి గట్టి ధీమాతో ఉన్నాయి. కురుక్షేత్ర సమరాన్ని తలపించిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఓడ్డాయి. ఓటర్లు తమకు బాసటగా నిలిచారని ఆయా పార్టీ భావిస్తూ తమ విజయం ఇక నల్లేరు మీద నడకే అన్న యోచనలో ఉన్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా సాగిన సార్వత్రిక పోరులో జయకేతనం ఎగర వేస్తామని ధీమాతో ఉన్నాయి. ఏ పార్టీ ఎన్నీ సీట్లు సాధిస్తుంది… ఏ పార్టీ పరాజయం చవి చూడాల్సివస్తుందో అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాగా, ఇందులో ఓటర్ల నాడి పరిశీలిస్తే.. కూటమికే అధికారం కట్టబెడతారని తెలుస్తోంది. అయితే, ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో.. ఒక లుక్ వేద్దాం.

అసెంబ్లీ సీట్లు

  • టీడీపీకి 144 సీట్లకు గాను –  90 నుంచి 93 సీట్లు
  • NDA కూటమి 175 సీట్లకు గాను – 105 నుంచి 108 సీట్లు
  • వైసీపీకి 175 సీట్లకు గాను – 69 నుంచి 72 సీట్లు

లోక్‌సభ సీట్లు

  • NDA కూటమి – 15 నుంచి 20 సీట్లు
  • వైసీపీ – 8 నుంచి 10 సీట్లు

నోట్: ఇవి కేవలం అవగాహన కోసమే. అంతేగాని వీటిని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలుగా పరిగణించవద్దు.

Show More
Back to top button