Telugu Politics

ఓటమి అంచనాల వరకు బీజేపీ.. కారణాలు ఇవేనా..?

ఇటీవలి విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజా ఉద్యమాల విజయంతో పాటు… నిరంకుశ, మతతత్వ, కార్పొరేట్, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఎ పట్ల తీవ్ర వ్యతిరేకతను వెల్లడించాయి. ఇందుకు నిదర్శనం NDAకి వచ్చిన ఫలితాలే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

దశాబ్దం క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఒక స్థిరమైన, అవిశ్రాంత పోరాటం చేసిన వారు రైతులు, కార్మికులు. నిరంకుశ, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం 2014లో భూసేకరణ ఆర్డినెన్సు విడుదల చేసిన వెంటనే, దానికి వ్యతిరేకంగా సమస్యల ఆధారంగా ఐక్యతను నెలకొల్పడం పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా పార్లమెంటును ముట్టడించడంతో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ఓటమి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం ఈ విజయంతోనే పోరాటాలు ఆగలేదు. 

ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గోరక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు, వాటి విక్రయాలకు, అటవీ హక్కులను హరించడానికి వ్యతిరేకంగాను, జాతీయ మానిటైజేషన్ పైజైన్ లాంటి అనేక సమస్యలపైనా పోరాటాలు ప్రారంభం అవ్వడమే ఓటమి అంచున నిలబెట్టాయని విశ్లేషుకులు అంటున్నారు.

అంతేకాకుండా 2017 జూన్‌లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని మాందసార్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో రైతులు మరణించాక, “అఖిల భారత సంఘర్ష్ కోఆర్డినేషన్” కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ విభిన్న మార్గాలలో పోరాటాలను నిర్వహించింది. అయితే ఈ కమిటీ కూడా ఉద్యమాలను నడిపించి బీజేపీని ఓటమి దగ్గర నిలబెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవంగా, ఈ సమిష్టి ఉద్యమాలు, ప్రయత్నాలే… నరేంద్ర మోడీ అజేయుడు కాదనే అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని ప్రజలలో కలిగించాయి. 

యువత, విద్యార్థి, మహిళా పోరాటాలు, అణచివేతకు గురయినవారు, C.A.Aకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాటం పాత్ర కూడా ఇందులో ఉంది. అసమ్మతితో కూడిన నిర్భయ స్వరాలు, ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అనేక మంది కూడా, నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య హక్కుల పరిరక్షణకు.

ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసిన వేలాది మందినీ మరువలేం. ధృవ్ రాథ్, రవీష్ కుమార్ వంటి వారితోపాటు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, పౌర సమాజం ఉమ్మడిగా నిర్వహించిన సమిష్టి ప్రయత్నాల ఫలితంగానే, నిరంకుశ బీజేపీ తిరస్కరణకు గురైంది. ఏది ఏమైనప్పటకీ ఈ లోక్‌సభ ఫలితాలను నుంచి బీజేపీ ఏ మాత్రం బేరేజి వేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Show More
Back to top button