Telugu Politics
Trending

దేశ రాజధానిలో ఎగిరిన కాషాయజెండా..! మలుపు తిప్పిన అంశాలు ఇవేనా..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. వరుసగా నాలుగో సారి అధికారంలోకి వస్తామని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఓటమి తప్పలేదు. ఇక దీంతో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోనుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు సాధించగా.. 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. దీంతో కమలం దెబ్బకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రివాల్, కీలక నేతలైన సిసోడియా, సత్యేంద్రజైన్ ఓటమి చెందారు. అయితే, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించకుండా గ్రాండ్ విక్టరీ కొట్టడం విశేషం. ఆ పార్టీ విజయానికి ముఖ్యంగా కొన్ని అంశాలు బాగా ఉపయోగపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అవి ఏంటో ఓ లుక్ వేద్దామా మరి..

ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి ఉచితాలపైనే ఆధారపడింది. ప్రజలు కూడా వీటికి బాగా అలవాటు పడ్డారు. దీన్ని గ్రహించిన బీజేపీ పెద్దలు బీజేపీ అధికారంలోకి వస్తే.. పథకాలు తప్పక కొనసాగిస్తామని తెలిపారు. అయితే ఈ మాటను స్వయంగా ప్రధాని మోదీ దీని గురించి ప్రకటనలు చేయడంతో, సామాన్యులు పార్టీకి అండగా నిలిచారు. BJP ఈసారి ‘AAP-ప్లస్’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాలు ప్లస్ హిందుత్వ ప్లస్ జాతీయ భావన ఇక్కడ బాగా వర్కవుట్ అయింది.

2012లో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ తర్వాతి సంవత్సరం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2015 నుంచి రాజధానిలో అదే పార్టీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో అధికార వ్యతిరేకత ఎదురైంది. దీన్ని గుర్తించిన పార్టీ, కొత్త అభ్యర్థులను పోటీకి దింపింది. అయితే, చివరి నిమిషంలో చేసిన మార్పులు, కొంతమంది ఎమ్మెల్యేల ప్రజావ్యతిరేకతను ఎదుర్కోలేకపోయాయి. దీంతో కొత్త అభ్యర్థులను ఓటర్లు నమ్మలేదు.

రోడ్లు, సివిక్ వర్క్ లోపాలపై ఆప్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసింది. ఈ పనులు చేయనివ్వకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారని ప్రచారం చేసింది. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్రం నియమించిన ఎల్‌జీతో కలిసి బీజేపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉందని ఓటర్లు నమ్మారు. దీంతో ఈసారి ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు.

Show More
Back to top button