
మాజీ సీఎం జగన్ ఇటీవల తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని లేఖ ద్వారా కోరారు. ఆ లేఖలో.. “ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వొద్దని ముందే నిర్ణయించినట్లు ఉన్నారని” జగన్ ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలన్న రూల్ చట్టంలో లేదని.. పార్లమెంటులో గానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆరోపించారు.
కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత 60సీట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి అవకాశం కాంగ్రెస్ కు దక్కలేదు. కానీ, రాజ్యసభలో 10 వంతు స్ట్రెంత్ ఉంది కాబట్టి మల్లిఖార్జున ఖర్గేకు అంతకు ముందు గులాంనబీ ఆజాద్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు. కానీ, ఇవన్నీ పక్కనపెట్టి జగన్ వాదిస్తున్న తీరు… స్పీకర్ పైనే విమర్శలు చేస్తూ, స్పీకర్నే అడగటం చూస్తుంటే జగన్ ఓటమి బాధ నుండి బయటపడ్డట్లు లేదు అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
అంతేకాదు మాజీ సీఎం జగన్ రాజ్యాంగంపై కనీసం అవగాహాన లేకుండా ప్రవర్తిస్తున్నారని వాదనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. జగన్ లెటర్ రాసే ముందు న్యామ వాదులను సంప్రదించి ఉంటే.. ఇలా అవమానుపాలు అయ్యే అవకాశం ఉండేది కాదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో కనీస మర్యాదలు పాటించకుండా.. అధికారం కోల్పోయాక నియమాలు పాటించాలంటూ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుగా లేదా జగనన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నివ్వెరపోతున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి స్పీకర్‌కు రాసిన లేఖ వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.