Telugu Special Stories

బెస్ట్ కమ్యూనికేటర్.. లక్షణాలు ఇవే..?

నాయకత్వం.. కమ్యూనికేషన్ విడదీయరానివి. నాయకత్వం అనేది కమ్యూనికేషన్-ఆధారిత కార్యకలాపం. ఇది ఎదుటివారి దృష్టి, ఆలోచనలు, అభిప్రాయం.. ఫలితాలను కమ్యూనికేట్ చేస్తుంది.

జీవితంలోని అన్ని అంశాలలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండడం చాలా అవసరం. వ్యక్తిగత జీవితం నుండి వృత్తిపరమైన జీవితం వరకు  ప్రతి విషయంలో కమ్యూనికేషన్ ఎంతగానో సహాయపడుతుంది. ఇతరులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని నిత్యం పెంపొందించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. కమ్యూనికేషన్ ప్రెజెంటేషన్‌ను అందించినప్పుడు, సహోద్యోగులతో ఆలోచించినప్పుడు, బాస్‌తో సమస్యను పరిష్కరించినప్పుడు లేదా క్లయింట్‌తో వారి ప్రాజెక్ట్ గురించి వివరాలను నిర్ధారించినప్పుడు తగిన  నైపుణ్యాలను ఉపయోగించాలి.

వినడం, తక్కువ పదాలలో విషయాన్ని తెలియజేయడం, బాడీ లాంగ్వేజ్, విశ్వాసం, గౌరవం, ఓపెన్ మైండ్ నెస్, సామాజిక మాధ్యమాలను గొప్ప కెరీర్ కోసం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ గా చెప్పుకోవచ్చు. ముఖం కవళిక నుండి స్వరం వరకు ప్రతిదీ కమ్యూనికేషన్‌లోకి వస్తుందంటున్నారు నిపుణులు.

నలుగురిలో తాము బెస్ట్‌గా ఉండాలని, సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మామూలు విషయమే అయినప్పటికీ వాటికి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ అలవరచుకోవాలి.  బెస్ట్ కమ్యూనికేటర్‌గా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే కొన్ని ట్రిక్స్..

 సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి

నలుగురిని ఆకట్టుకోవడం, నలుగురితో కలిసి నడవడం, పనిలో మంచి ఫలితాలు రాబట్టడం బెస్ట్ కమ్యూనికేషన్ అని గుర్తుంచుకోవాలి.

కుటుంబంలో, పని ప్రదేశంలో వ్యహరించే తీరు మీ కమ్యూనికేషన్ పద్ధతిని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది సక్రమంగా లేకపోతే అవతలి వ్యక్తులకు మీపట్ల నమ్మకం ఏర్పడదు. సందర్భాన్ని బట్టి నలుగురిని దృష్టిలో ఉంచుకొని ఎదుటివారికి నచ్చేలా వ్యవహరించడం ఉత్తమ కమ్యూనికేషన్‌లో భాగం. ఎక్కువగా మీ వైపు నుంచే ఆలోచించడం, ఇతరులకు నచ్చకపోయినా మీరు చెప్పిందే వినాలనుకోవడం వల్ల ఎన్నటికీ మంచి కమ్యూనికేటర్ కాలేరు.  మీరు మాట్లాడుతున్నప్పుడు  నేను చేశాను, నేనైతేనే ఆ పని బాగా చేయగలను, నేను మాత్రమే అలాంటి టాలెంట్ కలిగి ఉన్నాను వంటి మాటలు మాట్లాడవద్దు.  దీనికి బదులు మనం చేయగలం, మనం ప్రయత్నించాలి. మనతోనే సాధ్యం, మనకు ఆ సామర్థ్యం ఉంది వంటి పదాలను ప్రయోగించడంతో నలుగురిలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా చేసే పనిలో కూడా అవతలి వారు సహకరిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకట్టుకునే మాటతీరు.. ప్రవర్తన

మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నప్పుడే బెస్ట్ క్యమూనికేటర్‌గా నిలుస్తారని నిపుణులు చెబుతున్నారు.  సమాజంలో నిత్యం ఎంతోమంది వ్యక్తులు తారస పడుతూ ఉంటారు. వారి వేషాధారణ, మాట తీరు చూసి ఒక అభిప్రాయానికి రావడం సరైనది కాదని నిపుణులు అంటున్నారు.  ఇతరుల అభిప్రాయాలను, ఇష్టాలను, నమ్మకాలకు గౌరవం ఇవ్వాలి.  ఎవరైతే తామే కరెక్టు అనుకుంటారో..  ఇతరులు కూడా తమను అనుసరించాలని భావిస్తుంటారో వారు నిజానికి మానసిక పరిపక్వత లేనివారట. ఇతరుల ఇష్టాయిష్టాలను, నమ్మకాలను గౌరవించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.  ఇలాంటి వ్యక్తిత్వంగలవారు ఎన్నటికీ బెస్ట్ క్యమూనికేటర్ కాలేరని నిపుణులు చెప్తున్నారు. ఇతరుల ఆసక్తులు, అభిరుచులు, అభిప్రాయాలు, నమ్మకాలను కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ నచ్చేలా నడుచుకోవడమే బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్‌గా పేర్కొంటారు.

 ధైర్యంగా వ్యవహరిస్తేనే సక్సెస్

ఏదో ఒక రూపంలో ఇతరులను కమ్యూనికేట్ చేసే సత్తా సంపాదించుకోవాలంటున్నారు నిపుణులు. ఎన్నో విషయాలలో అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా లేదా మాట తీరు, చేతల్లో, హావ భావాల్లో ఏదో ఒక రూపంలో వాటిని ప్రజెంట్ చేయడాన్నే కమ్యూనికేట్ చేయడమని నిపుణులు పేర్కొంటున్నారు. మీరు ధైర్యాన్ని పునికి పుచ్చుకున్న వారు అవుతారు. అలా చేయకపోతే మీ గురించి ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. దీంతో మీరు అనేక అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. సరైన కమ్యూనికేషన్ ఉంటేనే మీరున్న రంగంలో బెస్ట్ పర్సన్ అనిపించుకోవచ్చు. నలుగురిలో ధైర్యంగా మాట్లాడే సత్తా ఉన్నప్పుడే  ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని.. అది సక్సెస్‌కు దారితీస్తుందని చెప్తున్నారు.

Show More
Back to top button