Telugu Special Stories

కుల వ్యవస్థ.. మంచిదా? చెడ్డదా?.. సమగ్ర సారాంశం మీకోసం..!!

కాలం మారుతున్న కొద్దీ సమాజంతో మనుషులలో అనేక విషయాల్లో మార్పు వస్తూనే ఉంటుంది. అయితే కాలం యొక్క మార్పు.. మానవ సమాజానికి శ్రేయస్కరంగా ఉండాలి కానీ, గొడవలు, కక్షలు, కార్పణ్యాలకు తెరతీసే విధంగా ఉండకూడదు. నేటి కంప్యూటర్ టెక్నాలజీలో సైతం.. అనేక దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషి యొక్క ఆలోచన విధానం ఉన్నతంగా మారుతుందనుకుంటే.. నానాటికి దిగజారి పోతున్నాడు. మన జీవన విధానంలో అవలంభిస్తున్న విషయాలను కూడా అస్సలు తెలుసుకోవట్లేదు. కేవలం ఎంజాయ్ అనే ముసుగులో ఎలా పడితే అలా జీవించేస్తున్నాడు. మనిషి నిజంగా భాద్యతతో మనం ఆచరిస్తున్న విధానాన్ని, జీవన సరళని ఎందుకు ఆచరిస్తున్నాం? అనేది కూడా తెలిసుకోవట్లేదు. ఇలా నిర్లక్ష్యం వలన కాలం గడిచే కొద్దీ ఆ విషయంపై వివక్ష పెరిగి ఘర్షణలకు తావిస్తున్నాం. 

భారత దేశమంతా నలిగిపోతున్న ఒక వ్యవస్థ.. కుల వ్యవస్థ. దీని గురించి సరైన అవగాహన లేక, అర్ధం చెప్పేవారు లేక, ఉన్నా తెలుసుకునేవారు లేక, స్వార్ధం కోసమైనా వ్యవస్థను నాశనం చేయాలని కొందరు అనుకుంటున్నారు. ఈ అంశం గురించి సంపూర్ణ అవగాహన తెచ్చుకుందాం. పూర్వకాలంలో అందరికి చదువు లేకపోయినా మన సంస్కృతి సంప్రదాయాలు, గొప్ప గొప్ప రాజుల చరిత్రలు, ఇంకా అనేక గొప్ప విషయాలు, బుర్ర కథలు, జానపదాలు, ఒగ్గుకథలు, హరిదాసు కీర్తనలు ఇలా అనేక మార్గాల ద్వారా ప్రజలకు చేరవేశేవారు. అయితే ఈ నాటికీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి అన్ని విషయాలు అరచేతిలోనే చూసేస్తున్నారు. నేటి యువతకు ఒక విషయం చెప్పాలంటే..

ఇవాళ్టి బిజీ బిజీ షెడ్యూల్ లో తమ కెరీర్ ని ఎలా నిర్ణయించుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి  అనేదే ఆలోచన తప్ప ఇంకా ఎలాంటి ఆలోచన ఉండట్లేదు. ఇవాళ్టి రోజుల్లో దంపతులకు ఒక్కడు పుట్టినా.. వీడి  లైఫ్ ఎలా సెట్ చేయాలి అనే ఆవేదనే ఉంటుంది. పూర్వ కాలంలో ఇలా కాదు. చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇంతటి సంపదన మీద ఆశలేదు. ఉపాధి సరిగాలేదు కాబట్టి  ఉన్నకాడికే చేసుకొని బ్రతికే వారు. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు కలిగినా ఎలాంటి బెంగ లేకుండా జీవనం సాధించేవారు. ఇలా వీరికి మానసిక ఒత్తడి లేదు. అలాగే చాలా సమయం ఫ్రీగా ఉండేది. ఈ కారణంగా అనేక కథలను తెలుసుకున్నారు. కానీ, ఇవాళ్టి బిజీ షెడ్యూల్ లో ఎంత మందికి మన చరిత్రలు తెలుసు. 

ఇవాన్నీ మేము ఎందుకు చెబుతున్నామంటే.. కులం అనే గొప్ప విధానాన్ని మనం చాలా తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం. ఈనాటి కాలంలో కులం గురించి ఎన్ని గొడవలు, అల్లరులు, వేరే కులం వాడిని యువతి పెళ్ళి చేసుకుంటే దారుణంగా చంపేస్తున్నారు. ఎందుకు ఇంత నీచానికి ఒడిగడుతున్నారు? కులం పేరు మీదుగా ఇన్ని ఘోరాలా? కొన్ని రాష్ట్రాల్లో అయితే కులరాజకీయం జరుగుతుంది. తమ కులం నాయకుడు అయితే ఓట్లు వేస్తున్నారు. ఇది సరియైనదా? అసలు కులం అనేది మంచికా? చెడుకా? దీనికి నిర్మూలిద్దామా? కొనసాగిద్దామా? అనే అంశమని ఒకసారి పరిశీలిద్దాం.   

కులం అన్న పదం గురించి తెలుసుకోవడానికి ముందు సనాతన హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలి. భారత దేశంలో తప్ప మరెక్కడా కనిపించని సనాతన ధర్మం.. సాక్షాత్తు పరమశివుడే వ్యాపింపజేశాడని దేశ ప్రజలు నమ్ముతారు. అయితే సృష్టిని నడిపించేందుకు, మానవ జీవనం ముందుకు సాగేందుకు సనాతన ధర్మం వర్ణాశ్రమ వ్యవస్థను ముందుకు తెచ్చింది. వేదం ప్రకారం మంత్ర పుష్పంలో సృష్టి ఆవిర్భావాన్ని చెబుతారు. అందులో యజ్ఞపురుషుడి ముఖం నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి ఈ వర్ణాశ్రమంలోని వారు పుడతారు అని అర్ధం. మనిషి జీవన విధానాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించారు. వారు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. అయితే ఈ విధానం మంచిదా కాదా  అనేది పరిశీలిద్దాం. సమాజ శ్రేయస్సుకోసం, అభివృద్ధి కోసం.. జీవన విధానం సరళంగా సాగేందుకు ఈ వర్ణాస్త్రమ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ నాలుగింటి గురించి తెలుసుకుందాం.

1). బ్రాహ్మణులు 

వేదంలోని అంతర్భాగమైన మంత్ర పుష్పంలో స్పష్టంగా చెప్పారు. యజ్ఞపురుషిని ముఖం నుంచి బ్రాహ్మణులు జన్మించారు అని. హిందుత్వాన్ని ఒక సింబాలిజంగా తీసుకుంటే తప్ప.. హైందవ విధానాలు అస్సలు అర్ధం కావు. దీని అర్ధం సాధారణంగా ఒక మనిషికి తల ఎంత ముఖ్యమో సమాజానికి బ్రాహ్మణాలు అంటే ముఖ్యం అని చెప్పడం. తలలో ఉందే మెదడులోనే కదా సర్వం జ్ఞానం ఉండేది. బ్రాహ్మణుల వద్దకూడా సమాజం సంతోషంగా, ప్రేమగా, ఆరోగ్యంగా ఉండటానికి సంబంధించిన అపూర్వ జ్ఞానం వారి వద్ద ఉంటుంది. సమాజంలో వచ్చిన ప్రతి ఒక్క సమస్యకు వీరు వేదం ఆధారంగా పరిష్కారం చెబుతారు. సమాజంలో పాప భారం పెరగకుండా చేస్తారు. అందుకే వీరు ఎంతమంది వచ్చి ఎన్ని ప్రశ్నలు వేసిన ఓపికగా చెప్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉండాలి కాబట్టి.. సత్వగుణం ఉన్న ఆహారం అంటే.. కూరగాయలు, పాలు, పండ్లు ఆహారంగా తీసుకోవాలని అని వేదం చెప్పింది.   

2). క్షత్రియులు

వీరు తమ రాజ్యానికి రక్షణగా ఉంటారు. రాజ్యాన్ని అనుక్షణం రక్షిస్తుంటారు. ధైర్య సాహసాలతో పాటు వీర పరాక్రమం చూపాల్సి వస్తుంది. రాజ్య సంరక్షణ కోసం, యజ్ఞయాగాదులతో పాటు.. రాజ్యంపై దండెత్తి వస్తే యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది. అలాగే రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసి ప్రజలను అన్నం పెట్టాలి. వీరు యజ్ఞపురుషుని భుజముల నుండి పుట్టారు అని చెబుతారు. మనిషి యొక్క అమితమైన బలం బాహువుల్లో ఉంది. అలాగే సమాజాన్ని రక్షించేందు బలవంతులు రాజులుగా కావలి. అందుకోసమే సింబాలిజంగా సనాతన ధర్మంలో చూపడం జరిగింది. 

3).వైశ్యులు 

ఇకపోతే వైశ్యుల గురించి తెలుసుకుందాం. వీరు యజ్ఞపురుషుని తొడలలో నుండి వచ్చారు అని చెబుతారు.  సమాజంలో ప్రజలంతా సంపాదించిన  ధాన్యం, వర్తక వాణిజ్యం అనేకం వీరు తీసుకొని కొనుగోలు, అమ్మకం నిర్వహిస్తుంటారు. అప్పటి ప్రజలకు ధర్మం ప్రకారంగా ఉంటూ.. ఎలాంటి మోసం లేకుండా వర్తక వాణిజ్యాలు చేస్తుంటారు. ఎన్ని సమస్యలు వచ్చిన భయపడకుండా..సునాయాసంగా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది కాబట్టి. వీరు సత్వగుణ ఆహారాన్ని భుజిస్తారు. అంటే కూరగాయలు, పండ్లు, ఫలాలు. కానీ, వీరు తినే తిండిలో తీపితో పాటు, వివిధ రకాలైన రుచులను భోజనంలో ఆస్వాదిస్తారు. ఒకే సమయంలో వివిధ రకాలైన రుచులను ఆస్వాదించడం వలన.. వివిధ రకాలైన సమస్యలను ఒకే సమయంలో చేసే సామర్థ్యం ఉంటుంది. 

4). శూద్రులు      

ఇక నాలుగవది శూద్రులు. సమాజానికి అత్యంత ముఖ్యమైనవాడు. వీరు యజ్ఞపురుషుని పాదాల నుండి వచ్చిన వారు. అంటే .. తల,భుజం, తొడలు ఇవన్నీ భూమిమీద నిలబడాలి అంటే పదాలు భూమిమీద మొదటగా నిలబడాలి. బ్రహ్మాణులు, వైశ్యులు, క్షత్రియులు వీరు  సరియైన క్రమంలో జీవనం కొనసాగించాలంటే వీరే ప్రధానం. కానీ కాల క్రమేణా వీరిని చాలా చిన్నచూపు చూడటం మొదలు పెట్టారు. ఇదే చాలా దారుణమైన విషయం. మనశరీరంలో తల, భుజాలు తొడలు, పాదాలు ఏది గొప్పది అంటే ఏం చెబుతాం. అన్నీ సమానమే అని అంటాం. ఇక్కడ కూడా అన్ని వర్ణాల వారు సమానమే. అయితే  శూద్రులు చేసేటువంటి పని ఏంటంటే..పై మూడు వర్ణాల వారికి ఉండేటు వంటి గృహం నిర్మాణం చేయడం, వాళ్ళ అవసరాలకు సంబందించిన గృహోపకరణాలు సిద్ధం చేయడం, వ్యవసాయానికి సంబందించిన పనిముట్లు చేయడం, శిల్పాలు చెక్కడం, చెప్పులు తయారీ చేయడం.. ఇలాంటి అనేకం. 

వీరందరూ దుమ్ములో చేయాల్సిన పనులు అందువల్ల వీరిని దగ్గరికి రానిచ్చే వారు. అదే రోజురోజుకూ పెరిగిపోయి అంటరానితనం అయింది. నిజానికి అన్ని వర్ణాల వారు ఒక్కరే.. దీనిని నిరూపించే అనేక చరిత్రలు ఉన్నాయి. ఒక ఉదాహరణను ఇక్కడ తీసుకుందాం. ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించామని ఒక క్షత్రియ రాజు.. శిల్పి అయినా శూద్రునికి చెప్తాడు. అనేక సంవత్సరాలు కష్టపడి వైభవంగా శివాలయాన్ని నిర్మిస్తారు. అద్భుత శిల్పకళా వైభవం చూసిన ఆ రాజు..  శిల్పిని చాలా మెచ్చుకుంటాడు. ఆ శిల్పి పేరు చిరస్థాయిగా ఉండేందుకు ఆ శిల్పి పేరుమీదుగానే ఆలయానికి పేరు పెడతాడు. అదే రామప్ప అనే దేవాలయం. రామప్ప అనే శిల్పి పేరుమీదుగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటే.. వర్ణాశ్రమాలు వెల్లివిరిసేవి. కానీ మనుషుల ఆలోచన విధానాల వల్ల  ఇలా విభిన్నంగా ఆలోచిస్తున్నాం.

ఇలా వైభవోపేతంగా  వెలుగుతున్న వర్ణాశ్రమాలు.. సమాజ శేయస్సు కోసం, మనిషి అభివృద్ధికి, పనిని సులువుగా చేసినందుకు, మనిషికి కావలసిన నిత్యావసర వస్తువుల కోసం ఈ వర్ణ వ్యవస్థను విస్తరించారు. పూర్వం విద్యార్థులకు విద్యను అభ్యసంచడానికి గురువు దగ్గరకు పంపించేవారు. గురువు తన కుటుంబాన్ని, ఇంటిని ఒక పాఠశాలగా తీర్చిదిద్దేవాడు. విద్యార్థులంతా ఆ ఇంట్లో ఉండి విద్యనభ్యసించేవారు. ఉదయం అంతా విద్యను అభ్యసించి సాయంతం భోజనానికి కావలసిన పండ్లు, వంటచెరుకు వంటివి అడవికి వెళ్లి తీసుకు వచ్చి గురువు పత్నికి ఇచ్చేవారు. ఆమె చక్కగా భోజనం సిద్ధం చేసి శిష్యులందరికి వడ్డించేది. ఇలా ఒక పాఠశాల కుటుంబంలా ఉండేది. సంస్కృతంలో కుటుంబం అంటే కులం. గురువు ఉండే కుటుంబం కావున. ఆ పాఠశాలను గురుకులాలు అని పిలుస్తారు. 

ఇప్పడు కూడా నేటి సమాజంలో అనేక కులాలను ఏర్పాటు చేసుకున్నాం. వీరంతా ఒక సమూహంలా ఉండి.. కుటుంబంలా కలిసి ఉంటారని కులం అని పేరు పెట్టుకున్నాం. మనిషికి అవసరమైన జ్ఞానం, కూడు, నీరు, గుడ్డ, మనిషి నివాసానికి కావాలసిన ఇంటి నిర్మాణం, ఇంట్లోకి కావలసిన వస్తువులు, ఇంట్లో కావలసిన వంట పాత్రలు, బంగారు నగలు, క్షవరం, పాదాలకు ఏమి కాకుండా ఉండేదుకు పాద రక్షలు ఇలా అన్ని తయారు చేసేందుకు కొంతమందిని ఒక్కోకులంగా చేసుకున్నాం. బ్రాహ్మణులు, సమస్త జ్ఞానానికి ప్రతీకలు.. ప్రతి గ్రామంలో  జ్ఞాణం గురించి, వేదం గురించి తెలియజేయడం, ప్రజలందరినీ సన్మార్గంలో ప్రయాణింపజేయడం వీరి కర్తవ్యం. అలాగే కోమటి కులం వారు వర్తక వాణిజ్యం చేయడం.

పద్మశాలి కులం వారు స్త్రీ, పురుషులకు ఇద్దరికి అవసరమైన వస్తాలను తయారు చేయడం, కుమ్మరి వారు కుండలు చేయడం, మేదరి వారు తడుకలు,చీపుర్లు, బూజుకఱ్ఱలు ఇలా అనేకం చేయడం, గొల్ల కుర్మవారు సమాజానికి మాంసాహారం అందించేందుకు మేకలు, గొర్రెల్ని పెంచడం. చాకలి వారు బట్టలు ఉతకడం, ఒడ్డువారు ఇంటినిర్మానికి కావలిసిన బండలు ఇవ్వడం. మంగలి వారు మనిషికి క్షవరం చేయడం. కంసాలి వారు బంగారు ఆభరణాలు చేయడం, వడ్రంగి వారు ఇంటినిర్మాణానికి అవసరమైన తలుపులు, కిటికీలు, సోఫాలు తదితర కర్రతో చేయాల్సిన సామాగ్రి చేయడం. మాదిగ వారు ఇంటి నిర్మాణం చేయడం, శిల్పాలు చెక్కడం, జంతు కళేబరాలతో చెప్ప్పులు చేయడం ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పి మనిషికి కావలసిన అన్ని సౌకర్యాలను ఈ వ్యవస్థ ద్వారా  రూపొందించుకున్నాం. 

ఈ కులాలను అన్నింటిని మీరు గమనిస్తే.. కొన్ని సున్నితమైన పనితో కూడుకున్న వృత్తులు ఉన్నాయి. అవి: బంగారు ఆభరణాలు చేయడం, వస్తాలు నేయడం, కుండలు చేయడం, వడ్రంగి పనివారు, కోమటి పని వారు, మంగలి వారు, మేదరి వారు, మేర.. ఇలా కొన్ని సున్నితమైన కులాలు ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా చేయాలంటే చాలా ఓపికగా, సున్నితమైన మనసుతో, చాలా ఇష్టంగా చేస్తేనే.. అద్భుతమైన నగలు, వస్త్రాలు, కుండలు, మంచి డిజైన్ తో కూడిన తలుపులు, కిటికీలు చేయడం జరుగుతుంది. అందుకే వీరి శరీరంపై మత్తు ఆవహించకుండా కేవలం సాత్విక పదార్థాలతోనే భోజనం చేయమన్నారు. కూరగాయలు, పండ్లు పాలు ఇవే వీరి భోజనం. ఆలాగైతేనే మంచి వస్తువు తయారవుతుంది. 

ఇకపోతే మరికొన్ని కులాల గురించి చూద్దాం. గొల్ల కురుమలు, చాకలి, మంగలి, ఒడ్డువారు, ముదిరాజ్ లు, గౌడ్లు, ఒడ్డువారు ఇలా కొన్ని ఉన్నాయి. వీరి పనిని చూస్తే.. వీరందరూ ధైర్య సాహసాలను ప్రదర్శించి పని చేయాల్సి ఉంటుంది. మేకలను గోర్లను మేపడానికి అడవికి వెళ్లాల్సి ఉంటుంది. చాకలి వారు బట్టలు ఉతకాలంటే ఎక్కువ బలం కావాల్సి ఉంటుంది. ముదిరాజ్ లు తమ మత్స సంపదను రక్షించుకోవడానికి, బ్రతకడానికి చెరువుకు అర్ధరాత్రి కాపలా ఉండాల్సి ఉంటుంది.. చేపలు పట్టె సమయంలో చెరువులోకి వెళ్లి పట్టాల్సి ఉంటుంది. గౌడన్నలు తాటిచెట్లు ఎక్కి కల్లు తీయాల్సి ఉంటుంది.

సాధారణ మానవుడు తాడిచెట్టు ఎక్కితే అంత ఎత్తును చూసి భయానికే క్రిందపడి చచ్చిపోతాడు. కానీ గౌడన్నలు సునాయాసంగా ఎక్కుతారు. అలాగే ఒడ్డువారిని చూస్తే.. ఇంటి నిర్మాణానికి అవసరమైన బండలను పగులగొట్టి ఎండలో సైతం పని చేయాల్సి ఉంటుంది. ఈ వృత్తులన్నింటికీ బలం, ధైర్య సాహసాలు చాలా అవసరం. ఇలాంటి లక్షణాలు రావాలంటే.. రజోగుణ ఆహరం స్వీకరించారు. అంటే మద్యం, మాంసం లాంటివి తినాలి. అప్పడు వీరిని తెగించే గుణం వస్తుంది. సమాజం దేదీప్యమానంగా వెలిగేందుకు ఈ కుల వృత్తులను తీసుకువచ్చారు.

మనం కుల వృత్తులను గమనిస్తే.. ప్రతికూలానికి ఒక కులదేవత ఉంటుంది. వీరంత ఆ దేవతను నమ్ముకొని తమతమ పనులను చేసుకుంటారు. పండుగ సమయాల్లో తమ కులదైవానికి పూజలు చేస్తుంటారు. ఇలా అద్భుతంగా, సామరస్యంగా అన్నాతమ్ముల్లా కులాలు విలసిల్లుతూ ఉండేవి. కాలక్రమంలో కులాలని కులానికి మధ్య అంతరం వచ్చింది. తమ కులం పెద్ద అంటే తమ కులం పెద్ద అని వాదించుకునేవారు. మంగలి వారు, మాదిగవారు అశుచిలో పని చేయాల్సి వస్తుంది. మంగళివారు కటింగ్ చేసినపుడు వెంట్రుకలు మీద పడుతాయి. అవి ఎక్కడపడితే అక్కడ ఉంటే తినే భోజనంలో పడి శరీరంలోనికి ప్రవేశిస్తాయని కటింగ్ చేసుకున్నవారు స్నానం చేశాకే ఇంటికి రమ్మనేవారు. ఇలా కటింగ్ చేసుకున్నవారు ఇంటికి దూరంగా ఉంటె.. మంగలి వారిని ముట్టుకున్నందుకే ఇంటికి దూరంగా ఉన్నారని వ్యవస్థలో మార్పు తెచ్చారు.  మంగలి వారిని ముట్టుకోవద్దని సమాజానికి దూరం చేశారు. 

ఇకపోతే నేటి సమాజంలో ఇప్పటికి పీడితులైన మాదిగ వారు.. క్షణ క్షణం వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆనాటి సమాజంలో వీరు చనిపోయిన బఱ్ఱెలు, ఇతర జంతువుల కళేబరాలతో చెప్పులు కుట్టేవారు. వీరికి దగ్గరికి రాణిస్తే అశుచి సోకుతుందని.. స్నానం చేశాక ముట్టుకునేవారు. కాల క్రమేణా వీరిని కూడా ముట్టుకోవద్దని.. వీరు అధమజాతి వారని.. వీరి గాలి సోకినా పాపమని సమాజం భావించారు. ఎలాంటి తప్పు చేయని వీరిని చాలా హీనంగా చూశారు. ఊరి అవతల వీరు ఇంటిని నిర్మించుకోవాలని ఆదేశించారు.

సమాజాన్ని ధర్మం వైపుకి నడిపించాల్సిన బ్రాహ్మణుని వీరిని నీచంగా చూశారు. వీరు మిగితా కులల వారి ముందు నడుస్తుంటే చెప్పులు చేతబట్టుకొని నడవాలి అని హెచ్చరించేవారు. వీరి స్త్రీలను అనుక్షణం అత్యాచారానికి గురిచేశేవారు. సమాజం మొత్తం మీద పెద్ద దెబ్బ తగిలింది వీరికే. ఇంతతి దారుణమైన అన్యాయాలు మనం చేశాం. ఇది న్యాయమా ? ఒక మనిషిని ఇంత నీచంగా చూస్తారా? వీటన్నింటికి ఒక్కటే కారణం. మనం కులం విలువను తెలుసుకోకపోవడం, ఒకరికి ఒకరం గౌరవించుకోవాలని స్పృహ లేకపోవడం. ఇదే సమాజాన్ని కుదిపేస్తున్న పెద్ద తప్పు. 

ఇక నేటి సమాజాన్ని పరిశీలిద్దాం. అద్భుతమైన కులవృత్తులను చేసుకుంటూ జీవన విధానాన్ని గడిపే సమాజంలో అధర్మం దారుణంగా పెరిగిపోయింది. ఎవరి స్వార్థానికి వారు అన్నింటిని వాడేసుకుంటున్నారు. అలా కులాన్ని కూడా ముళ్లకంపలో పడిన వస్త్రానికి ఒక్కొక్కటిగా దారాలు విడిపోయినట్లుగా సమాజంలోని అన్ని కులాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. డబ్బు విపరీతంగా పెరిగిపోయి, రాక్షస ఆనందం కోసం మానవత్వాన్ని మంటగలుపుతున్నాం. ఆనాటి కాలంలో జీవనం సాగించేందుకు కేవలం కులవృత్తులు మాత్రమే ఉండేవి. ఏ కులం అమ్మాయిలను ఆ కులం అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేస్తే.. ఇద్దరు ఒకే ఆలోచనలతో ఒకే వృత్తిని చేసుకుంటూ జీవనం గడుపుతారని వివాహం చేశారు. ఇక్కడ ఒక్క ఉదాహరణతో విపులంగా పరిశీలిధ్దం. మీరు  దీనిని అర్ధం చేసుకోవాలాంటి ఆ కాలంనాటి వాడిలా ఆలోచించాలి. 

పద్మశాలి కులానికి చెందిన అమ్మాయి, అదే కులానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేస్తే.. ఇధ్దరు ఒకే పని చేసుకుంటారు. ఏవరింట్లో వారు చిన్నప్పటినుంచి అదే పని చేస్తారు కనుక.. కొత్తగా పని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సున్నితమైన పని కావున మనసులు కూడా సున్నితంగా ఉంటాయి. ఇద్దరు శాఖాహారులే అవుతారు. అదే పద్మశాలి అమ్మాయిని ఒక ముదిరాజ్ అబ్బాయికి ఇచ్చి చేస్తే.. అమ్మాయి కాస్త సెన్సిటివ్ గా ఉంటుంది.. ఆ అబ్బాయి కాస్త మొరటుగా ఉంటాడు.

ఇది వారి తప్పుకాదు వృత్తి రీత్యా ఆలా ఉండాల్సి వస్తుంది. అబ్బాయి మాంసం తింటాడు. అది అమ్మాయికి నచ్చదు. ఆ అబ్బాయి వాళ్ళ కులంలో ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారో అదే పద్మశాలి అమ్మాయిలో కూడా ఉండాలి అనుకుంటారు. ఆమె సున్నితంగా ఉండటంతో స్పర్ధలు రావచ్చు. దాంపత్యం సరిగా ఉండకపోవచ్చు. అన్నింటికంటే పెద్ద సమస్య. కులవృత్తులు చేసుకోవడం.. పద్మశాలి అమ్మాయికి ముదిరాజ్ కులవృత్తి ఏవిధంగా వస్తుంది. చిన్నప్పటినుంచి చేనేత పనే వస్తుంది కదా. ఇలా దాంపత్యం మీద ప్రభావం చూపుతుంది. బంధం విడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక కులం వారిని అదే కులం వారు చేసుకోవాలని నిబంధన పెట్టారు. 

అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించాల్సి ఉంటుంది. మన హిందూ దర్మం ప్రతిఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రం అని హక్కులు ఇచ్చింది. వారు కోరుకున్న విధంగానే వారు బ్రతకచ్చు. కానీ నేటి సమాజం చూస్తే..ఇప్పుడు కులవృత్తులు అట్టడుగున పడ్డాయి. అడ, మగా ఇద్దరు విద్యావంతలు అయ్యారు. ఎవరి జీవితాన్ని వారు చక్కదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ మనసుకి నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిలను వేరు వేరు కులాలకు చెందిన వాడిని ఇష్టపడుతున్నారు. పెళ్లికూడా వారినే చేసుకోవాలని అనుకుంటున్నారు. దీనికి పెద్దలు అస్సలు ఒప్పుకోవట్లేదు. బెదిరించి మరి వేరే పెళ్లి చేస్తున్నారు. లేదంటే ఆస్తి ఇవ్వమని బెదిరిస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే దారుణంగా చంపేస్తున్నారు. నిజంగా చంపేటంతటి ఘోరమైన పని వీరు చేశారా?  ఒక్కసారి ఆలోచన చేద్దాం. 

నేటి తల్లిదండ్రులు ఒక్క ఆలోచన చేయండి. మీరు జీవించిన కులవృత్తులలో నేటి సమాజం బ్రతుకట్లేదు. అలాగే మీరు మీ కర్తవ్యాన్ని గాలికి వదిలేశారు. కులం గొప్పతనం ఏనాడైనా మీ పిల్లలకు చెప్పారా? మీ కులదేవత గొప్పతనం చెప్పారా? ఒక కులం వాడిని పెళ్ళిచేసుకుంటే జీవనం ఎలా ఉంటుందో చెప్పారా? మీరు ఏమి చెప్పట్లేదు. మీరు స్వార్థానికి మీరు మీ పరువు కోసం మీ బిడ్దల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నేటి కులవృత్తులకు విలువనిచ్చి కాపాడుకోవడం గొప్ప విశేషమే. కానీ, సమాజ పరిస్థితులకు అనుగుణంగా వేరు వేరు కులాల వారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అడ్డు చెప్పడం ఏ విధంగా కరెక్టు.

నీ కూతురిని చూసుకోవాల్సిన స్తోమత అతని దగ్గర ఉందా చూడండి. ఆ కాలంలో కులవృత్తి కచ్చితంగా చేసుకోవాలి కాబట్టి.. ఒకే కులం వారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పడు కులవృత్తులను మనం ముంచేసుకున్నాం. మరి పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం. కులవృత్తులను కాపాడలేని మీరు.. కులం పేరుతో ఒక జంటను విడదీయడం ఎంతవరకు కరెక్ట్. ఆలోచించండి. మహా భారతంలోని ఒక చిన్న ఘట్టాన్ని మనం పరిశీలిధ్దం. 

పాండవులు తన తల్లి కుంతీ దేవితో అరణ్యంలో తిరుగుతున్నప్పుడు.. హిడింబి అనే రాక్షస స్త్రీ భీముడిని ప్రేమిస్తుంది. హిడింబి అన్నయ్య హిడింబాసురుడి వధ తర్వాత.. తన ప్రేమను భీముడిని చెప్తుంది. భీముడు కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఇది గమనించిన కుంతీ మాత.. వారిని విడదీయకూదని భావించి వారికి వివాహం జరిపిస్తుంది. వారికి పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడు తన పరాక్రమం చూపించి కర్ణుడి చేతిలో చనిపోతాడు. సాక్షాత్తు దేవానదేవతులే ప్రేమకు అంత గౌరవం ఇచ్చారు. ఇక మనం ఎందుకు మన పిల్లల భవిష్యత్తును మనం చిదిమేస్తున్నాం.

పెద్దవారైనా మీకు ఒకటి అడ్డువస్తుంది. మేము నిత్యం సమాజంలో ఉంటాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు వేరే కులం అబ్బాయితే పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే.. వారు పరువు తీస్తారు. నానా మాటలు అంటారు. అనేదే మీ భయం. అందుకే మీరు కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. నిజంగా ఒక్క క్షణం ఆలోచించండి. మీరు మన సనాతన ధర్మంలో కొన్ని కథలను చదివినా.. ఎవరు ఏ ప్రశ్న వేసినా వారికి సరిగ్గా సమాధానం చెప్పే తెలివి మీకు ఉంటుంది.

అంతే కాకుండా మీరు సమాజాన్ని చైతన్యవంతం చేశారు. ఇంతటి ఔదార్యంలో సమాజంలో శాంతి నెలకొంటే ఇక సమస్యలెక్కడివి. అలాగే మన సమాజంలో కుల గజ్జి పెరిగింది. తమ నాయకుడు ఏ కులమైనా వారికి ఓటు వేస్తున్నారు. నిజంగా నాయకుడిలో చూడవలసినవి నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి చేసే గుణం. ఇదంతా చూడకుండా వానికి కులం పేరుతో జేజేలు కొడుతున్నాం. కులం విలువ తెలియని ప్రతిఒక్కరు కుల గజ్జితో జీవిస్తున్నారు. నేటి సమాజం నుంచి కుల గజ్జిని పాలద్రోలుదాం.. కులంపై ప్రేమను చాటుదాం. అన్నిటికి మించి మానవత్వంతో జీవిద్దాం. ప్రపంచమంతా శాంతిగా జీవించాలని కోరుకుందాం. జై భారత్.. జై హింద్..!!

Show More
Back to top button