తెలుగులో అగ్ర కథానాయకుల్లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ సినిమా అంటేనే ఒకరకమైన క్రేజ్, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. త్రిపుల్ ఆర్ తర్వాత అది ఒక్కింత ఎక్కువైందనే చెప్పాలి. పైగా ఇన్నేళ్ళ నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పాటలు, ట్రైలర్, డైలాగ్స్.. ఒక్కోటి ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతున్నాయి.
ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘దేవర’. 2022లో బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన తారక్.. అంతకుముందు 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో చేశారు.
మళ్లీ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’లో నటించగా..
ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయిక కాగా సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు ఉండనుంది. ఫస్ట్ పార్ట్ ఈ శుక్రవారం(సెప్టెంబరు 27న) పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది.
మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇందులోని ‘చుట్టమల్లే..’ పాట అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. తర్వాత విడుదలైన అనిరుధ్ స్వరాలు అందించిన టైటిల్ సాంగ్(దేవర), కొరమీన పాటలు ప్రజాదరణ పొందాయి.
ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ప్రీ సేల్ లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
*’దేవర’ను యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా 1960-00 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. కమర్షియల్ మూవీలకు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ ఇది. ‘ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తి’గా ఎన్టీఆర్ కనిపిస్తారు.
*నిజానికి దర్శకుడు కొరటాల శివ రాసుకున్న కథ మొత్తాన్ని సినిమాగా తీస్తే, దాదాపు 9 గంటలకు పైగా రన్ టైమ్ వస్తుందట. అందుకే రెండు భాగాలుగా ‘దేవర’ను తీసుకొస్తున్నారు.
*క్లైమాక్స్ లో వచ్చే చివరి 40 నిమిషాలు సినిమాకు చాలా కీలకం.. అండర్ వాటర్ సీక్వెన్స్ మూవీకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది.
*అండర్ వాటర్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఇందుకోసం 200 చదరపు గజాల్లో సముద్రాన్ని పోలిన సెట్ వేయగా, 35 రోజులపాటు అక్కడ షూట్ చేశారట.
పైగా వాటర్ సీక్వెన్స్ లో వాడే పడవలను కళా దర్శకుడు సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. 90ల నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా అవి ఉండనున్నాయి. నిజమైన సముద్రంలోనూ ఆ పడవలతో ప్రయాణం చేయొచ్చు అట.
• ‘దేవర’ మూవీలో కొన్ని సన్నివేశాలోని కలర్ టోన్ విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీశారట.
• ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ 4 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్) స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.
• మరాఠీ నటి శ్రుతి మరాఠే ఇందులో కీలక పాత్ర పోషించారట. ‘దేవర’ భార్య పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్. ఆమె పాత్రను పెద్దగా రివీల్ చేయకుండా చిత్రబృందం సస్పెన్స్ పెంచుతోంది.
ఇకపోతే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో చిత్రం ఇది. (గతంలో చేసినవి.. ‘ఆంధ్రావాలా’,’అదుర్స్’,’శక్తి’)..
ఇప్పుడు దేవర, వరద(వర) అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
* జాన్వీకపూర్ తొలి తెలుగు డెబ్యూ ఫిల్మ్.. మొదటిసారి తెలుగుతెరపై పరిచయం కాబోతున్నారు. ఇందులో ఆమె ‘తంగం’పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో కన్నా, రెండో పార్ట్ లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
• బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా నేరుగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కానుంది. ఇందులో ఆయన ‘టైల్’ పాత్ర పోషిస్తున్నారు. తొలి భాగంతో పోలిస్తే, పార్ట్-2 లో ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందట. ఎన్టీఆర్ పాత్రకు దీటుగా, ప్రతినాయకుడి పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారట.
*రన్ టైం: 2 గంటల 50 నిమిషాలు.