Telugu Special Stories

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సాయం చేసే.. ఈ హిందూ పండగ గురించి తెలుసా?

మతం పేరుతో హింసాకాండకు తెరలేపుతున్న ఈ రోజుల్లో నేటి యువతరానికి సనాతన హైందవ ధర్మం గురించి తెలియాల్సింది చాలా ఉంది. నిజానికి చెప్పాలంటే.. ఏ ఒక్క హిందువు తన ధర్మమేమిటో ఇప్పటికి తెలుసుకోలేకపోతున్నాడు. హిందూ అంటూ రెచ్చగొట్టే కొందరు రాజకీయ నాయకులకు సేవకులుగా ఉంటూ.. రాక్షస ఆనందం కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం నేటి సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. మన దేశంలో ఉండే పరమతస్తులపై ద్వేషం పెంచుకుంటున్నారు. ఎవరో ఒక్కరు చేసే తప్పులకు ఒక వర్గం, ఒక సమూహం, ఒక కమ్యూనిటీని బాధ్యులుగా మన మనసులో చిత్రీకరించి.. వారిని మన శత్రువులుగా భావించే పరిస్థితి ఉత్పన్నం చేసుకున్నాం. నిజానికి హిందుత్వాన్ని అర్ధం చేసుకున్నవారు ప్రతిమనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శిస్తారు. నిజమైన హిందూ ఇతర మతస్తులను మంచి సోదర భావంతో, స్నేహభావంతో మెలుగుతారు. కొందరు రాజకీయ స్వలబ్ధితో హింసకు తావు తీస్తే.. దానిని అర్ధం చేసుకోలేక.. నేటి యువతరం గొడవలకు తావిస్తోంది. ఎందుకు ఇంతటి యుద్ధ వాతావరణం మన మనస్సులో జన్మిస్తుంది. నేటి యువత తప్పటి అడుగులు వేయకుండా సన్మార్గంలో నడవడానికే ఈ కథనం ప్రచురిస్తున్నాం. మన పండుగల్లో ఉన్న గొప్పదనం, నైతికతను తెలియజేసేందుకు హిందూ పండుగలోని ఒక పండుగ గురించి ఇవాళ క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం.

హిందూ పండగలన్నింటిలో ముఖ్యంగా మూడు కోణాలు కనిపిస్తాయి. ప్రతి పండుగలో ఆరోగ్యం, మనశ్శాంతి, ఐకమత్యం.. ఈ మూడు పెనవేసుకున్నదే సనాతన హైందవ పండుగలు. అలాగే హిందూ ఆచారంలో పేదవాడి నుండి ధనికుడు చేసుకునేలా ప్రతి పండుగ ఉంటుంది. పండుగలన్నీ తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఆలాగే ఎక్కువ ఖర్చుతోనూ చేసుకోవచ్చు. మనకు చేయాలని మనస్సంకల్పం ఉండాలే కానీ.. భిక్షాటన చేసి కూడా పండుగలు నిర్వహించుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం, వినాయక వ్రతం, బతుకమ్మ, సంక్రాంతి ఇలా అనేకం ఉన్నాయి. ఇవాళ అన్ని పండుగల్లో కెల్లా సమాజానికి చేయూత అందించేది, రైతు క్షేమం కో

సం చేసుకోవాల్సింది ఒక పండుగ ఉంది. అనేక పండుగలు వారివారి సంతోషం కోసం, కుటుంబాలు ఐకమత్యం కోసం చేసుకుంటే.. ఈ పండుగ మాత్రం ఊరంతా బాగుండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని చేసుకుంటారు. ఈ పండుగే జంధ్యాల పూర్ణిమ. ఈ పండుగ మాకు ఎప్పుడో తెలుసు.. చెప్పిన పండుగనే చెప్తున్నారా? అనే ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం కావచ్చు. ఈ పండుగ పేరే మీరు విన్నారు. అసలు దీనిని ఎందుకు చేసుకోవాలి? ఖచ్చింతంగా చేసుకోవాలా? ఇది మన కర్తవ్యమా? చేసుకుంటే ఎంత? చేసుకోకపోతే ఎంత? ఇలా అనేక ప్రశ్నలు మీ మనసులో తట్టవచ్చు. వీటన్నింటికి ఈ కథనంలో మేము పూర్తిగా సమాచారం ఇస్తాము. సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నాక మీ కర్తవ్యం ఏమిటో మీరు నిర్ణయించుకోండి.   

జంధ్యాల పూర్ణిమ.. ఈ పేరులోనే పండుగ అంతరార్ధం కనబడుతుంది. జంధ్యాలను వేసుకునే పండుగ. జంధ్యం అంటే ఏంటి?. దీని అంతరార్ధం తెలియాలంటే కొన్ని విషయాలు తెలియాలి. ప్రస్తుత కాలంలో ప్రభుత్వం పరిపాలనను కొనసాగించడానికి IAS, IPS వ్యవస్థను కొనసాగిస్తోంది. ఐఏఎస్ అంటే.. ఇండియన్ అడ్మినిస్టేటివ్ సర్వీస్. IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. పరిపాలన విభాగం అంతా IASలు చూసుకుంటే.. శాంతి భద్రతలు చూసుకునే విభాగాన్ని IPS చూసుకుంటుంది. దేశం లేదా రాష్ట్రంలో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఐఏఎస్ లు వ్యూహం రచిస్తే.. ఆ వ్యూహాన్ని IPSలు అమలు పరుస్తారు. ఇలా పాలన చేస్తారు. ఈ విధంగా దేశానికి, రాష్ట్రానికి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం చక్కదిద్దుతుంది. ఇదే కోణాన్ని సనాతన ధర్మం ముందే గుర్తించి.. సమాజహితం కోసం దేశంలోని ప్రజలను కొన్ని వర్గాలుగా విభజన చేసింది. నాలుగు వర్ణాశ్రమాలు ఏర్పాటు చేసింది. దీనిని కాలక్రమేణా ప్రజల అవసరాలకు అనుగుణంగా కుల వ్యవస్థను తీసుకొచ్చుకున్నాం. బ్రాహ్మణ, కోమటి, పద్మశాలి, విశ్వకర్మలు, కంసాలి, వడ్రంగి, చాకలి, మంగలి, గొల్లకురుమ, ఒడ్డువారు, మాదిగ, రెడ్లు, కాపులు ఇలా అనేక కులాలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ కులాలను రెండుగా విభజన చేశారు. ఒకటి జంధ్యం వేసుకున్న వారు. మరికొందలు వేసుకొని వారు. 

జంధ్యానికి సనాతన ధర్మంలో పెద్దపీట వేశారు. ఇది లేనిదే యజ్ఞ యాగాదులు చేయలేరు. అసలు జంధ్యం అంటే ఏమిటి?  ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మగవారు ఒంటిపై ధరించే నూలు పోగు. దీనిని సంస్కృతంలో యజ్ఞోపవీతం అంటారు.  మనిషి జీవించే ఆశ్రమ విధానాలకు ఇది అత్యవసరం. మనిషి పుట్టుక మొదలు.. చావు వరకు నాలుగు ఆశ్రమాలు పాటించాలని వేదం చెబుతోంది. 1). బ్రహ్మచర్యం 2). గృహస్త్రాశ్రమం 3). వానప్రస్తం 4). సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యం అంటే.. బాల్యం నుండి విద్యను అభ్యసించేంతవరకు ఉండే ఆశ్రమం. ఈ సమయంలో పర స్త్రీని మోహించక విద్యను అభ్యసించారు. అనంతరం ఒక స్త్రీని వివాహం చేసుకొని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే పురుషార్ధాలు సాదించేందుకు వైవాహిక బంధంలోకి అడుగుపెడతాడు. ఇదే గృహస్త్రాశ్రమం. ఈ బంధాలు శాశ్వతం కావని పరమాత్మలో లీనం అవడమే మనిషి యోక్క చిట్టచివరి ఆశయమని గ్రహించి బంధాలను తెంచుకొని అడవుల్లో నివసిస్తాడు. ఈ ఆశ్రమామే వానప్రస్తం. అనగా వనాలలో నివసించడం. మొదటి మూడు ఆశ్రమాల సారాన్ని ముందే గ్రహించి తనకు మోక్షాన్ని పొందాలని భావించిన వారు బాల్యం తర్వాత సన్యాసం తీసుకుంటారు. ఇదే సన్యాసి ఆశ్రమం. 

హైందవ జీవన విధానం ప్రకారం.. ఒక పిల్లవారు జన్మించిన తర్వాత తన బాల్యం అయ్యాక బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించేటప్పుడు అర్హతగా యజ్ఞోపవీతం వేస్తారు. మూడు పోగుల దారం అనే యజ్ఞోపవీతాన్ని తన తండ్రి.. గాయత్రి మంత్రోపదేశంతో కొడుకుకి వేస్తాడు. ఏ వ్యక్తి కూడా స్వంతంగా యజ్ఞోపవీతాన్ని వేసుకోకూడదు. ఇలా భ్రహ్మచర్యంలో విద్యనభ్యసించిన తరువాత గృహస్థాశ్రమ స్వీకారం చేస్తారు. ఒక స్త్రీని వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తారు. ఇందుకోసం కావాల్సిన అర్హత ద్వితీయ యజ్ఞోపవీధధారణ. అంటే.. మూడు పోగుల జంధ్యాన్ని వేసుకున్న యువకుడు మూడుకు మూడు రేట్లు అంటే 9 పోగుల దారాన్ని జంద్యంగా వైవాహిక తంతులో భాగంగా పెళ్ళిలో బ్రాహ్మణులు వరుడికి వేస్తారు. ఇలా కొన్ని కులాల్లో ఉంటుంది. 

మరి ఎందుకు ఇంతటి ఆచారంగా కొన్ని కులాల వారికే ఆపాదించారు. ఇది కేవలం అందం కోసమా? లేదా స్టైల్ కోసమా? ఇంకేదైనా పరమార్ధం ఉన్నదా? అసలు కొన్ని కులాల వారికే ఎందుకు వేయాలి? ఇందులో ఏమైనా వివక్ష ఉందా? సనాతన ధర్మం అందర్నీ ఒకలా చూడదా?  కొన్ని కులాలను హీనంగా చూస్తుందా? అనేది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం. 

ప్రకృతి ఒక చక్రీయ ప్రవాహం. సూర్యశక్తితో భూమిపై చైతన్యం కలుగుతుంది. మేఘాలు వర్షించి భూమిపై వర్షాలు పడుతాయి. ఈ సమయంలో రైతు పంటలను పండిస్తాడు. ఈ పంటనే ప్రజలంతా తింటారు. మరి రైతు ఒక్కడే ఈ పంటను పండించాలా? ఇదేమైనా అతని కర్తవ్యమా? బ్రహ్మానులు, వైశ్యులు, పద్మశాలీలు మరికొన్ని కులాల వారు ఎలాంటి కష్టం లేకుండా కూర్చొని తినాలా? ఈ విషయాన్నే అప్పటి ఋషులు పూర్తి అన్వేషణ చేశారు. ఇప్పుడు IAS, IPS వ్యవస్థలను మనం ఎలా పెట్టుకున్నామో.. అప్పుడు వారు కూడా జంధ్యం వేసిన వారు, వేయని వారుగా పరిగణించరు. యజ్ఞోపవీత ధారణ చేయని వారు.. కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించాలి. ఇప్పుడు జంధ్యం వేసుకున్న వారు వర్షాలు కురిసే విధంగా రైతుకు ప్రకృతి తోడు ఉండేటట్టుగా సహాయం, దీవెనలు ఇవ్వాలి.  విదేశీ సంప్రదాయంలో సహాయం చేస్తే.. థాంక్స్ చెబుతాం. కానీ మన ధర్మంలో సహాయానికి ప్రతిసహాయం చేయాల్సిందే. 

కొన్ని రకాల కులాల వారు.. వారి కుల వృత్తులతో పాటు వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడుతున్నారు. మరి వారి రక్షణగా మరికొన్ని కులాలు ఉండాల్సిందే. అందుకోసమే పంటలు సకాలంలో పండాలని బ్రాహ్మణ, వైశ్యులు, పద్మశాలి, కంసాలి, విశ్వకర్మలు తదితర కుల వృత్తుల వారు యజ్ఞయాగాదులు చేస్తుంటారు. యజ్ఞం చేస్తే.. ఖచ్చితంగా వర్షం కురుస్తుందని హిందువులు భావిస్తారు. యజ్ఞంలో కొన్ని రకాల సమిధలు (ఎండిపోయిన ఔషధీ చెట్టు కర్రలు)  నెయ్యితో కాల్చితే.. ఆ మంటల యొక్క పొగకు, అలాగే బ్రాహ్మణుల మంత్రశక్తికి  దేవతలు ప్రీతీ చెంది వర్షాలు కురిపిస్తారు. సైన్స్ ప్రకారం.. ఔషధీ కర్రలు మండినప్పుడు ఆ వాయువులు మేఘాలతో చర్యలు జరిపి వర్షిస్తాయి. వర్షాలు పడితేనే కదా రైతు పంట పండేది. దంపతులు యజ్ఞం చేయాలంటే.. భర్తకు యజ్ఞోపవీతం ఖచ్చితంగా ఉండాలి. అందుకే యజ్ఞోపవీతం పెళ్ళిలో వేస్తారు. యజ్ఞోపవీతం వేసుకున్న వారు ఖచ్చితంగా శుచితో శుభ్రతతో దైవారాధన చేస్తూ.. నోములు, వ్రతాలు, యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. ఇవాన్నీ కూడా కేవలం వారి స్వార్థం కోసమే కాదు. రైతన్నలు బాగుకోసం వర్షం పడాలని. 

మరి రైతులు చాలా కష్టపడి.. నిద్రాహారాలు మని.. ఒక్కోసారి స్నానం చేయకుండా పంటలు కాపలాగా ఉంటాడు. అన్నం సరియైన వేలకు కూడా తినకుండా చెమటోడ్చి కష్టపడి పంటను పండించి దేశానికి అన్నం పెడుతాడు. ఇలాంటి కష్టమూర్తికి.. జంధ్యం వేసి ఒక రూల్ ప్రకారం రోజు పూజలు, వ్రతాలు చేస్తే… వ్యవసాయం చేసే సమయమెక్కడిది. అందుకే వారికి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. పొద్దున లేవగానే సుమంగళి అయిన స్తీ తన తాళిబొట్టుని కళ్ళకు అద్దుకొని.. ఆ క్షణమే శుచిని పొందుతుంది. భర్త కచ్చితంగా స్నానం చేస్తే కానీ శుచిని పొందలేదు. ఒక పుణ్య స్త్రీ లాగే.. ఒక రైతుకూడా వ్యవసాయ క్షేత్రంలో పంటలమ్మ ఒడికి చేరగానే అతనికి ఎలాంటి అశుచి ఉండదు. ఇక అలంటి గొప్ప రైతన్నకు మనం ఎలాంటి నిబంధనలు పెట్టగలము. అందుకే ఋషులు, మునులు ఈ విధానాన్ని తెచ్చినప్పుడు ఎలాంటి నిబంధనలు వారికి పెట్టలేదు. 

ఇప్పుడు అసలు విషయం జంద్యాల పూర్ణిమ గురించి తెలుసుకుందాం. ఈ పండుగ శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున వస్తుంది. ఇదే రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. సోదరి.. తన సోదరునికి రక్షను కట్టి.. నన్ను రక్షించమని వేడుకుంటుంది. నీకు ఎంతటి కష్టం వచ్చినా ఈ సోదరుడు ముందుంటారు అని మాట ఇచ్చి రక్షను సోదరిచే కట్టించుకుంటాడు. అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా తమ్ముల మధ్య సాగే అద్భుత  బంధానికి ప్రతీక అయిన ఈ పండుగ రోజున.. బ్రహ్మచారులు, గృహస్తు ఆశ్రమం స్వీకరించిన వారు దేవుని సన్నిధిలో లేదా దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జంధ్యాన్ని వేసుకుంటారు. మనకు ఆషాడ మాసంలో తొలకరి చినుకులు మొదలవుతాయి. ఆ మాసమంతా నేలను చదును చేసి.. పంటను వేస్తాడు రైతన్న. అతని కర్తవ్యాన్ని రైతన్న చేశారు. మరి సమాజ శ్రేయస్సు కోసం యజ్ఞోపవీతం వేసుకున్నారు చేయాలి కదా? అందుకోసమే శ్రవణ మాసంలో కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకున్న తర్వాత దంపతులు యజ్ఞం చేస్తారు. దీని ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు అద్భుతంగా పండుతాయి. రైతన్న కళ్ళలో ఆనందం వెళ్లి విరుస్తుంది. తద్వారా దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతున్నాం.

రైతన్న బాగుకోసం.. రైతన్న కళ్ళల్లో సంతోషం చూడటానికి.. పంటలు సమృద్ధిగా పండటానికి.. దేశానికి అన్నం పెట్టె స్థాయికి చేరడానికి సనాతన ధర్మం ఏర్పరచిన అద్భుతమైన మార్గమే ఈ  జంధ్యాల పూర్ణిమ అనే పండగ. ఇప్పడు చెప్పండి? ఏ వర్గాల వారినైనా హిందుత్వం వేరు చేస్తుందా? అందరిని అన్నా తమ్ముల్లా.. అక్కా చెల్లెల్లా కలుపుగోలుతో మెలగట్లేదా? మన దేశానికి వచ్చిన పరాయి దేశస్తులను మనం సంతోషంగా చూసుకుంటున్నం కదా? ఇలాంటి ఉదార స్వభావమైన సనాతన ధర్మానికి ఏమిచ్చి ఋణం తీర్చుకుంటాం. మీరే ఆలోచించండి.. పదే పదే ఆలోచించండి.. జై హింద్.. జై భారత్..!!

Show More
Back to top button