Telugu NewsTelugu Special Stories

అమెరికాకు జలుబు చేస్తే.. భారత్ తుమ్ముతుందా..?

భారతదేశానికి ఉన్నట్లే ప్రతి దేశానికీ ఆర్థిక సంవత్సరం ఉంటుంది. అలాగే, ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. అయితే, అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ చివరి తేదీ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే అక్కడి సెంట్రాల్ బ్యాంక్‌ని ఫెడరల్ రిజర్వ్ లేదా ఫెడ్ అని అంటారు. ఇది ఫెడ్ ‌రేటును నిర్ణయిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో దేశ పరిస్థితుల బట్టి ఫెడ్ రేట్లు పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. అయితే, మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఫెడ్ రేటు పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు దాని ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..?

అమెరికాలో ఫెడ్ రేటు పెంచినప్పుడు..

బ్యాంకులు వాటి వడ్డీ రెట్లు పెంచుతాయి. దీనివల్ల అప్పు తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అలాగే, ఎక్కువ వడ్డీ చెల్లించలేని వారు రుణాన్ని వెంటనే తీర్చాలనుకుంటారు. దీనికోసం వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ డబ్బు సరిపోకపోతే భారత్ స్టాక్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు తీసుకుని రుణం తీర్చేస్తారు. అలాగే, ఫెడ్ రేటు పెరిగినప్పుడు బాండ్లపై ఎక్కువ లాభం వస్తుంది. భారత్ స్టాక్ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభాలను వస్తుందనప్పుడు.. అక్కడి ఇన్వెస్టర్లు భారత్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు తీసుకొని.. వారి దేశంలో బాండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. దీనివల్ల భారత్ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది.

ఒకవేళ ఫెడ్ రేట్ తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..?

బ్యాంకులు వాటి వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. దీనివల్ల అప్పటికే అప్పులు చేసిన పెద్ద పెద్ద కంపెనీలు.. వారి పాత అప్పు తీర్చడానికి, ఇతర ఖర్చుల కోసం మరల రుణం తీసుకుంటుంది. అలాగే, గృహ రుణం పొందాలనుకునే వారు, ఇతర ఏ రుణం అయినా తీసుకోవాలనుకునే వారు ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న రుణాలతో అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. దీనివల్ల అక్కడి ప్రజలు భారత్‌ స్టాక్ మార్కెట్‌ను ఎంచుకునే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువగా భారత దేశంలోకి వస్తుంది. దీనివల్ల భారత్ స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగే అవకాశం లేకపోలేదు.

భారత్ మదుపరులు ఏం చేయాలి..?

అయితే, తాజాగా అమెరికాలో ఫెడరల్ రేటు 5.25% నుంచి 5.50% పెరిగింది. దీనివల్ల భారత్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో అని చాలామంది ఆలోచిస్తున్నారు. దీనికి ఆర్థిక నిపుణులు చెబుతున్న సూచనలేమిటి అంటే.. ఫెడ్ రేటులో ఎక్కువ మార్పు లేదు కాబట్టి ఎక్కువగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో కేంద్ర ఎలక్షన్ ఉన్నాయి. దీని ఫలితాలు జూన్ లేదా జులై వరకు తెలుస్తాయి. ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బట్టి దేశ ఆర్థిక స్థితి ఉంటుంది. జూన్‌, జులైలోగా అమెరికాలో కీలక రేట్లలో కోత జరగకపోతే మాత్రం స్వల్పకాలంలో మన మార్కెట్లు నిరుత్సాహానికి గురికావచ్చు అని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ప్రస్తుతం పెట్టుబడులు కొనసాగిస్తే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Show More
Back to top button