ప్రతి ఒక్కరికి చరిత్రలో కొన్ని పేజీలుంటాయి. అలా చూసుకుంటే, ఎంతోమంది ప్రముఖులు చరిత్రలో చెరగని ముద్ర వేశారు. చరిత్రనే తిరగరాశారు. వాళ్లలో చెప్పుకోదగ్గ వారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటివారిలో ఇదిరాగాంధీ ఒకరూ. ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీ, దేశ రాజకీయాలపై చూపిన తీరు గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
నేపథ్యం…
1917 నవంబర్ 19న ‘ప్రయాగ’ అనే నగరంలో జన్మించారు ‘ఇందిరాగాంధీ’. పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. తండ్రి జవహార్ లాల్ నెహ్రూ, తల్లి కమలానెహ్రూ. ఇందిరాగాంధీతో పాటూ నెహ్రూగారికి ఒక కొడుకూ పుట్టాడు. కానీ బాల్యంలోనే చనిపోయాడు. ఇందిరాగాంధీ బాల్యం సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతోంది. బ్రిటీష్ సహాయంతో నడుస్తోన్న స్కూళ్లకు భారతీయ పిల్లలను పంపించకూడదని, కాంగ్రెస్ వాదులు నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అలాహాబాద్ లో ఉన్న జాతీయ పాఠశాలలో తన కూతురు ఇందిరాను చేర్పించారు నెహ్రూ. తను చదువులో ఎప్పుడు చురుకుగా ఉండేది. చదువుకునే రోజుల్లో ఇందిరాగాంధీ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమెను చికిత్స కోసం జెనీవాకు తీసుకువెళ్లారు. అక్కడే చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక చదువు ఆగిపోవడం ఇష్టం లేక ఇందిరాను జెనీవాలోని ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించారు తండ్రి. అక్కడే ఫ్రెంచ్ భాష నేర్చుకుంది.
చదువు పూర్తి చేసుకొని 1927లో తిరిగి ఇండియాకి వచ్చింది. ఆ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న తండ్రి నెహ్రూని, తల్లి కమలాదేవిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. దీంతో ఆనంద్ భవన్ లో ఇందిరా ఒంటరిగా ఉండేది. ఆమె ఒంటరితనాన్ని పోగొట్టేందుకు నెహ్రూ జైలు నుంచే అనేక ఉత్తరాలను రాస్తూ ఉండేవారు. అందులో ఎన్నో విషయాలను తెలుసుకున్న ఇందిరా తండ్రి చేయాలనుకున్న వాటిని తాను నిర్వర్తించాలని అనుకుంది.
1928నాటికి కుష్టు నివారణ కార్యక్రమం చేస్తూ, దుస్తులు, ఆర్థిక సాయం అందించడానికంటూ 6 మైళ్ల దూరం వెళ్లి వచ్చింది.
ఇదే సమయంలో గాంధీజి స్థాపించిన, చెరఖ సంఘంలో బాలవిభాగాన్ని ప్రారంభించింది. ఆమె ప్రోత్సాహంతో ఎంతోమంది పిల్లలను చేర్పించి, ‘వానర సేన’గా పేరొందింది. ఇది కాంగ్రెస్ సంస్థకు ఎంతో దోహదం చేసిందనే చెప్పుకోవాలి.
1931 మే 6న తాత మోతిలాల్ నెహ్రు కన్నుమూశారు. అదే సమయంలో గాంధీజిని ఎరవాడ జైలులో బంధించారని తెలుసుకొని, ఎక్కువసార్లు ఆయన్ను చూసేందుకు వెళ్ళింది.
1934లో మెట్రిక్ పరీక్ష పాసయ్యింది. కొన్ని రోజులకు నెహ్రూ జైలు నుంచి బయటకి వచ్చారు. కలకత్తాలో రవీంద్రనాధ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లో ఆర్ట్స్ కాలేజీలో చేరింది. ఇక్కడ ఇందిర లలితకళలపై ఎక్కువ శ్రద్ధ వహించారు. అలానే పెయింటిగ్, మణిపూర్ నృత్యం కూడా నేర్చుకుంది.
1935లో ఇందిరాగాంధీ వాళ్ల అమ్మగారిని ఆరోగ్యరీత్యా బువేరియాలో బెడన్ వేలర్ కు తీసుకువెళ్లింది. ఆ సంవత్సరం ఫిబ్రవరి 28న కమలాదేవీగారు మరణించారు. ఆమె తల్లి మరణించిన దుఃఖంలో ఉండగా, ఫెరోజ్ గాంధీ ఓదార్చారు. అప్పుడూ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి, వివాహం చేసుకోవాలనుకున్నారు.
రాజకీయాల్లోకి…
1937లో లండన్ నుంచి ఇండియాకి వచ్చి తండ్రి దగ్గర రాజకీయ పరిస్థితులను అవగతం చేసుకొంది ఇందిరా. 1938లో నెహ్రూ ఇందిరకు కాంగ్రెస్ లో సభ్యత్వం ఇప్పించారు. 1939లో ఆమె స్విట్జర్లాండ్ వెళ్లింది. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. 1940లో భారత్ కి రావాలనుకుంది.
1941లో లండన్ నుంచి ఇండియా కు ఫెరోజ్ గాంధీతో వచ్చారు. 1942 సెప్టెంబర్ లో ఇందిరా గాంధీ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను ఏర్పాటు చేసిన కారణంగా ఆమెను 9 నెలలు పోలీసులు జైల్లో ఉంచారు.
జైలు నుంచి తిరిగి వచ్చాక, 1943 మార్చి 26న ఫిరోజ్ గాండే తో వివాహం ఆనంద్ భవన్ లో నిడారంబరంగా జరిగింది. పెళ్లయ్యాక ఫిరోజ్ గాండే గాంధీ మీదున్న అభిమానంతో ‘గాండే’గా ఉన్న ఇంటి పేరును ‘గాంధీ’గా మార్చుకున్నారు.
1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించగా,
1946 డిసెంబర్ లో సంజయ్ గాంధీ జన్మించారు.
1964 మే 27న ఫిరోజ్ గాంధీ కన్నుమూశారు.
పీఎంగా…
నెహ్రూ చనిపోయాక లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధానమంత్రి పదవినిచ్చారు.
1966లో లాల్ బహుదూర్ శాస్త్రి చనిపోయారు. అనంతరం ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేశారు. ఈమె ప్రధానమంత్రి కావడంలో, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది. అలా 1966 జనవరి 24న అధికారికంగా ఇదిరాగాంధీ మొదటిసారి ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు.
1970 జూన్ 26 వరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా,
1970 జూన్ నుంచి కేంద్ర హోంశాఖమంత్రిగా,
1971 మార్చి నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.
1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను స్వీకరించింది.
1980లో జనవరి నుంచి కేంద్ర రక్షణశాఖ మంత్రిగా,
1983-84లో రష్యా దేశపు లెనిన్ బహుమతి సైతం లభించింది.
14 బ్యాంకుల జాతీయీకరణ…
1969లో దేశవ్యాప్తంగా ఉన్న 14 బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరాగాంధీ ప్రకటించారు. ‘బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్డినెన్స్’ పేరుతో చట్టం తీసుకొచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేసింది. ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె క్యాబినెట్‌లోనే ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకించడం మరో విశేషం.
దీని వెనుక కారణాలు లేకపోలేదు.. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్‌లో బ్యాంకులు తీవ్ర నష్టాలను చవిచూశాయి. చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను తిరిగి చక్కబరిచేందుకు పలు యురోపియన్ దేశాలు తమ దేశాల్లోని బ్యాంకులను జాతీయీకరణ చేశాయి. దీన్నే మన భారతదేశం ప్రభుత్వం కూడా అనుసరించి భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)ను మొదట 1949లో జాతీయం చేశారు. అనంతరం 1969 జులై 7న బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బ్యాంకుల జాతీయీకరణ తీర్మానాన్ని ఆమె ప్రవేశపెట్టారు. దాంతో 1969లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సామాజిక అభివృద్ధిలో బ్యాంకులు తమ పాత్రను పోషించడం లేనందువల్ల ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయాల్సి వచ్చిందని ఇందిర వెల్లడించారు. వ్యవసాయం, చిన్నపరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేందుకు, బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకు ఆ చర్య తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు.
జాతీయం చేసిన ప్రైవేట్ బ్యాంకుల్లో .. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. 1980 తర్వాత ఆంధ్రాబ్యాంకు తోపాటు మరో 13 బ్యాంకులను కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది.
మరణం…
ఈమె1984 అక్టోబరు 31న మరణించారు. ఆరోజున న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో సమయం 9:20 అవుతుంది. ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరా గాంధీని ఇంటర్వూ చేయడానికి గార్డెన్ లో వేచి ఉన్నాడు. అక్కడే ఇద్దరూ బాడీగార్డ్స్ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరా గాంధీ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. పెరట్లోకి రాగానే అక్కడున్న ఇద్దరిలో ఒక బాడీగార్డ్ తన దగ్గరున్న గన్ తో షూట్ చేశాడు. ఆ బుల్లెట్లు తగలగానే హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇందిరాగాంధీ చనిపోయారని వైద్యులు తెలిపారు.
ఎమర్జెన్సీ కాలం…
ప్రజాస్వామ్యంలో ప్రజలు, న్యాయస్థానాలు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు.. ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రయోగించిన చివరి అస్త్రంమే ఎమర్జెన్సీ.
1966-77ల మధ్యకాలంలో రెండు కీలక పరిణామాలు జరిగాయి.
అందులో మొదటిది, పాకిస్థాన్ పై భారత్ యుద్ధంలో గెలవడం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ ఏర్పడటంలో ఇందిరాగాంధీ ప్రముఖ పాత్ర పోషించింది.
1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా గాంధీ గెలిచింది. కానీ ఓటర్లకు డబ్బులిచ్చి ఓటు వేయించుకున్నారనే ఆరోపణతో రాజనారాయణ్, ఇందిరాగాంధీ పైన హైకోర్టులో కేసు వేశాడు.
1975లో దీనిపై తీర్పు వచ్చింది. 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ తీర్పు సారాంశం. అప్పుడు ఇందిరాగాంధీ తీర్పును సుప్రీంకోర్టులో ఆప్పియల్ వేసింది.
అనంతరం ఇందిరాగాంధీని పీఎంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.1975లో ఎమర్జెన్సీని స్పష్టం చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అపోజిషన్ పార్టీ తరఫువాళ్లు బంద్ లు పాటించారు. ఇలా చేయడంవల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు. అందుకనీ ఎమర్జెన్సీని ప్రకటించింది. అంటే దేశమంతా పీఎం చేతిలోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, పంజాబ్ లో సిక్కు మతానికి చెందిన బృందన్వలె అనే వ్యక్తి హిందూవులను చంపుతూ పోతున్నాడు. కారణం సిక్కులకు కాళిస్తాన్ అనే పేరుతో ప్రత్యేక దేశం కావాలని ప్రభుత్వాన్ని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో 1984లో సిక్కులు చాలామంది హిందూవులను చంపారు. అరెస్టు చేయడానికి వీలు లేకుండా వెళ్లి గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్నాడు. ఆ టెంపుల్ లో ఉంటూ, పాకిస్థాన్ నుంచి ఆయుధాలను తెప్పించుకునేవాళ్లు.
అప్పుడు ఇందిరాగాంధీ ఇండియన్ మిలటరీని గోల్డెన్ టెంపుల్ కి పంపించింది. అప్పుడు మిలటరీ వాళ్లతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాని పేరే ఆపరేషన్ బ్లూస్టార్. జూన్ 5న గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టి బాంబులు, హెవీ గన్ లతో దాడి చేశారు. ఈ ఆపరేషన్ 1984 జూన్10న ముగిసింది.
ఇందులో 83మంది సైనికులు, 493 మంది మిలిటెన్స్ చనిపోయారు. అందుకనీ దానికి ప్రతిగా కక్ష గట్టి, ఇందిరాగాంధీని ఆ ఇద్దరూ సిక్కు బాడీగార్డులే కాల్చి చంపేశారని అవగతం అవుతుంది.