Telugu Special Stories

రామోజీ రావు వ్యక్తి కాదు.. ఓ శక్తివంతమైన వ్యవస్థ

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు జూన్ 08న తెల్లవారుజామున 4:50కి మృతి చెందడంతో మీడియా రంగం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగింది.గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పలువురు నాయకులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి చెందారు. ప్రస్తుతం రామోజీరావు వయస్సు 87 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు.

ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా ఆవిర్భవించింది రామోజీ ఫిల్మ్ సిటీ. ఈయన జీవితం ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకం.

జీవిత చరిత్ర

1961 ఆగస్టు 19న సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు.. గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు. కాగా రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని పలు ఇంటర్య్వూలో ఆయన తెలిపారు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చారు. దీంతో అక్కడే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు.

ఇదే ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. 1967-1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారం ఇవ్వడం కోసం అన్నదాత ప్రారంభించారు. ఇక తర్వాత కాలంలో ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ప్రారంభించిన ఆయన.. అత్యంత అట్టహాసంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు.

ఆరు అవార్డులు వరించాయి..!

రామోజీరావు తెలుగు సినిమాలో రంగంలో ఆయన చేసిన రచనలకు గాను నాలుగు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఐదు నంది అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఆయన అందుకున్నారు. అంతేకాదు 2016లో, జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషన్, పద్మ విభూషణ్‌ ఆయన్ను వరించాయి. ముఖ్యంగా రామోజీరావు తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు.

ఆయన స్థాపించిన రామోజీ ఫిల్మ్ సీటీలో చాలా సినిమాలు చిత్రీకరిస్తుంటారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సహా అన్ని భాషలకు చెందిన సినిమా షూటింగులు అక్కడ తీస్తుంటారు. ప్రతి రోజు వేల మంది సందర్శించేందుకు వస్తుంటారు. రామోజీరావు మృతిపై పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

Show More
Back to top button