రోల్స్ రాయిస్ పేరు వినగానే ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన, నంబర్ వన్ కార్ గా పేరుగాంచిన రోల్స్ రాయిస్ – ఆర్ ఆర్ కారే మనకు గుర్తొస్తుంది కదా… తన వినియోగదారుల కోసం మంచి రైడ్ అనుభవం ఇచ్చేందుకు, ఆల్ టైమ్ ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు నూటికి నూరుపాళ్లు కృషి చేస్తున్న ఈ సంస్థ ఘనత ముందు సాటి ఇంకేది రాదు.. శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి.. రాయల్ లుక్ తో రాజసం ఉట్టిపడే తీరు.. ఆకర్షణీయమైన రంగు, చక్కని పనితీరు.. ఆశించిన కంఫర్ట్.. మోస్ట్ ఎక్స్ పెన్సివ్.. ఇలా తన ఫీచర్స్ లో ఏది చూసినా.. ఎలా చూసినా.. టాప్ లో నిలిచిన బ్రాండ్ సెట్టర్.. రోల్స్ రాయిస్.. ప్రపంచంలో ధనవంతులు, సెలబ్రిటీలు, బిజినెస్ మెన్ లు, స్పోర్ట్స్ స్టార్స్.. లాంటి అతికొద్దిమంది వద్దే ఉన్న ఈ కారును తమ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అసలు రోల్స్ రాయిస్ కి ఎందుకింత క్రేజ్ ఉంది.. ఎందుకింతలా పాపులర్ అయ్యింది.. ఈ కారు ఖరీదు సైతం ఎందుకంత ఎక్కువగా ఉంటుంది.. వంటి ఇతర ప్రత్యేకతలను ఈరోజు చూద్దాం…
1904లో రోల్స్ రాయిస్ కంపెనీని ఇంజనీర్ అయిన చార్లెస్ రోల్స్, వ్యాపారవేత్త అయిన హెన్రీ రాయిస్ లు ఇద్దరు కలిసి మొదలుపెట్టిన ఈ సంస్థ.. దాదాపు 120ఏళ్ల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. అసలుకైతే ఇది ఒక బ్రిటిష్ కంపెనీ. తొలి నాళ్లలో సాధారణ సంప్రదాయ రీతిలో మ్యాన్ మేడ్ తో చేసే ఆటో మొబైల్ కంపెనీగా అవతరించింది..
1913ల్లో నాటి 7వ నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదటి రోల్స్ రాయిస్ ను తన వ్యక్తిగత కార్యకలాపాల కోసం కొనుగోలు చేశాడు. అప్పటికీ బ్రిటిషర్లు భారతదేశంలోనే ఉన్న రోజులవి.. అటువంటి సమయంలో మొట్టమొదటిసారి భారత్ కు దిగుమతి అయ్యింది ఈ కారు.
రోల్స్ రాయల్స్ ప్రత్యేకత ఏమిటంటే..
ఈ కంపెనీ తన కస్టమర్లకు ఇచ్చే కార్లను, మిషన్ తో కాకుండా ప్రతిదీ మ్యాన్ మేడ్ ద్వారా తయారు చేయడం దీని స్పెషాలిటీ. అది మొదలు నేడు రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదు అయిన కార్లను ఉత్పత్తి చేసే పెద్ద బ్రాండ్ గా ఎదిగింది. అంతేకాదు ఈ రోల్స్ రాయిస్ కార్లను కస్టమర్లు కోరిన విధంగా, నచ్చినట్లుగా లెక్కలేనన్ని సార్లు కస్టమైజేషన్ చేయించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ప్రతి కారు కస్టమర్లకు తగినట్లుగా ఏ ఆప్షన్ లేదా ఏ ఫీచర్ ను అయితే ఇష్టపడతారో ఆయా మోడల్, ఫీచర్స్ ని బట్టి కారు ధరను నిర్ణయిస్తారు. అందుకే ఈ కారు మోడల్ కి బేసిక్ ప్రైస్ అంటూ ఏమీ ఉండదు. అసలు ఈ అడిషనల్ గా చేసే కస్టమైజేషన్ వల్లే కారు ఖరీదు రెండింతలు అవుతుంది.. ఎవరైనా రోల్స్ రాయిస్ కారును కొనడానికి ఆ కంపెనీకి వెళ్లినప్పుడు వారు ఏ కలర్ ను అయితే ఇష్టపడతారో, ఆ రంగుని ఫలానా కారుకి ప్రత్యేకంగా అప్లై చేస్తారు.. ఇలా వీరి దగ్గర దాదాపు 44,000 రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయట.
ఈ కంపెనీ తమ కస్టమర్ ఇష్టపడే రంగు ఏ కోవకి చెందినదైనా అంటే.. రెగ్యులర్ గా యూజ్ చేసే లిప్ స్టిక్ అవ్వొచ్చు.. కస్టమర్ ఇష్టపడే తమ ప్రియమైన వస్తువుల రంగు అయి ఉండొచ్చు.. ఇలా ఏ రంగు అయినా సరే వాటికి ముందుగా రెప్లికాను తయారు చేసి, ఆ ప్రకారం కారుకి ఆ రంగుని వేస్తారు. ఒకవేళ అదే రంగుని వేరే కారుకి ఇతర కస్టమర్ అడిగినట్లైతే, మొదట ఏ కస్టమర్ అయితే ఆ రంగుని వేయించుకున్నారో.. వారి పర్మిషన్ తీసుకున్న తరువాతే ఆ రంగును ఇతర కస్టమర్ కి కేటాయిస్తారట. ఏదేని కార్లకు మినిమం 7 లేయర్ల దాకా పెయింటింగ్ వేస్తారట. అలాకాకుండా ఎక్కువ లేయర్స్ కావాలని కోరిన ఒక కారుకి అయితే దాదాపుగా 23 లేయర్ల కోటింగ్ వేశారట. అలా చూస్తే కారుకు వేసిన పెయింటింగ్ బరువే దాదాపు 50 కేజీల దాకా ఉంటుంది మరీ.. రోల్స్ రాయిస్ కారులో అనేక అద్భుతమైన డిజైన్లు ఉన్నాయి. కారు వీల్స్/ చక్రాల మీద ఆర్ ఆర్ అనే లోగో కూడా ఉంటుంది. ఇవి చాలా ప్రత్యేకం..
లోగో లెవల్ వేరు..
అంటే వీల్స్ తిరిగినప్పటికీ లోగో మాత్రం స్టేబుల్ అండ్ స్టడీగా ఉంటుంది. రోల్స్ రాయిస్ ను సింబల్ లేదా లోగోని స్పిరిట్ ఆఫ్ ఎక్స్ టసి అంటారు. రెండు రెక్కలు గల అమ్మాయి తన రెక్కలను వెనక్కి చాపి, ముందుకు చూస్తున్నట్లు ఉంటుంది. దీని విలువ ఒక్కో కస్టమర్ ని బేస్ చేసుకొని ఆ కస్టమర్ కస్టమైజేషన్ చేసుకొనే దానిని బట్టి రెండు వేల డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు ఉంటుందిట. అంతేకాదు ఈ కార్ల విలువ లోపల ఉన్న డిజైన్ ను బట్టి మారుతూ ఉంటుంది. రోల్స్ రాయిస్ కార్ల లోపలకి బయటి శబ్దం రాకుండా ఉండేందుకు 140 కేజీల కెపాసిటీతో ఉన్న ఇన్సులేషన్ ను అమర్చుతారు.
అంతేకాకుండా కారూ టైర్లలో స్పెషల్ కోర్ ను ఉపయోగిస్తారు. దీనివల్ల టైర్ల నుంచి కేవలం 9 డేసిబుల్ ల సౌండ్ మాత్రమే బయటకి వస్తుంది. అదే విధంగా ఈ కారు లోగోని కస్టమర్లకీ నచ్చినట్లుగా ఎంబ్రాయిడ్ డిజైన్ చేసేందుకు కారు లెదర్ సీట్ల పైన ప్రత్యేకంగా కుట్లు కుడతారు. ఇందులోనూ ఒక డిజైన్ కేవలం ఒక కస్టమర్ కి మాత్రమే ఉపయోగిస్తారట. రోల్స్ రాయిస్ ఫాంటమ్ అనే ఒక కారు మోడల్ కి ఆ కస్టమర్ ఇష్టపడేలా డిజైన్ ని ఆ కారులో వేయడానికి మొత్తం10 లక్షల చొప్పున కుట్లు వేయాల్సి వచ్చిందిట.
గత 15 సంవత్సరాల్లో ఈ కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రోల్స్ రాయిస్ లో అతి ఖరీదైన కారు మోడల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ – సుమారు రూ. 9 కోట్లు, రోల్స్ రాయిస్ ఘోస్ట్- సుమారు రూ. 7 కోట్లు, డ్రాప్ టైల్.. దీని మార్జిన్ ఖరీదు 30 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 3 కోట్లు అన్నమాట.