Telugu CinemaTelugu Special Stories

ఈ వారం వన్ అండ్ ఓన్లీ షోగా..ప్రభాస్ కల్కి 2898 ఏడీ

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల 27(గురువారం)న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ వైబ్ అంతటా సంచలనాలను సృష్టిస్తోంది. మరీ ఈ సినిమా చూసేముందు మూవీకి సంబంధించిన విశేషాలేంటో చూసేద్దామా…

ఒక్క లైన్ లో ‘కల్కి’ కథ..
మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే చెప్పారు.. భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణం, ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా కాంప్లెక్స్ డిజైన్ చేశారు. సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతం శంబల వంటి ప్రదేశాలన్నీ చూపించారు. వీటి అవుట్ లుక్ మొత్తం కళ్లకు కట్టేలా వీఎఫ్ఎక్స్ లో చూపించనున్నారు.

*’కల్కి 2898 ఏడీ’ అని టైటిల్ గమనిస్తే.. ఆ పేరులో ఓ లాజిక్ ఉంది. మూవీ ట్రైలర్ లో ఓ హింట్ కూడా ఉంది. ‘6వేల సంవత్సరాల క్రితం కనిపించింది.. ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే’ అని ఒకతను అంటాడు. 6000 సంవత్సరాలలో కల్కి 2898ను తీసేస్తే, మిగిలేది 3102.. అంటే, కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం. అంటే 2898 ఏడీలో మళ్లీ శ్రీ మహావిష్ణువు ‘కల్కి’గా అవతరించబోతున్నాడని అర్థం. ఈ ఆరువేల సంవత్సరాల్లో జరిగిన పరిణామాలన్నిటిని టైమ్ ట్రావెల్ రూపంలో చూపించే అవకాశం ఉంది.

*ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ. 600 కోట్లకు పైమాటే.

*ఆసలుకైతే ప్రాజెక్ట్-కె పేరుతో 2020న వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ మూవీ పూర్తవడానికి నాలుగేళ్లకన్నా ఎక్కువ సమయం పట్టింది.

*ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ లు కనిపించనున్నారు. దాదాపు 40 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం.

*కమల్ హాసన్ ఇందులో సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్నారు. లుక్ కోసం లాస్ఏంజిల్స్ వెళ్లి, హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా పనిచేశారట.

*అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ వయసు 81 సంవత్సరాలు.. అశ్వత్థామ పాత్ర కోసం మేకప్ వేయడానికి 3గంటల సమయం పడితే, తీయడానికి 2గంటలు పట్టేదిట. అంతేకాదు ఈ వయసులోనూ యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడ్డారట.

*’కల్కి’లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బుజ్జి..
ప్రభాస్ రైడ్ చేసే వెహికల్ కోసం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్స్ ప్రత్యేకంగా పనిచేశారట. ఈ ఒక్క కారు కోసమే రూ.4 కోట్లు ఖర్చు పెట్టారట మరీ.

*యారి అలెక్స్ 65, యారి డీఎన్ఏలెన్స్ ను ఉపయోగించి 6.5K రిజల్యూషన్ లో మూవీని తీయడం వల్ల పిక్చర్ క్వాలిటీ చాలా క్లియర్ గా ఉండనుంది. ఈ టెక్నాలజీ వాడి తీసిన తొలి భారతీయ చిత్రం ఇదే కాబోలు.

*బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో అదరగొట్టిన దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం.

*ఇకపోతే నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ లోనే అత్యంత వేగంగా 3 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

*ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీ కోసం కొన్నాళ్లు పనిచేశారట.

*ఈ ఏఐ బుజ్జి పాత్రకు అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు.

*భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. కొందరు ముఖ్య నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ తాకూర్ ఉన్నారని టాక్.

*పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘కల్కి’… 2D, 3D, IMAX, 4DX వివిధ ఫార్మాట్లలో విడుదల విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘కల్కి’ కావడం గమనార్హం.

Show More
Back to top button