చాలామంది వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు. కానీ సరిపడా పెట్టుబడి లేక, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో అనే భయం వల్ల వెనకడుగు వేస్తుంటారు. కానీ కేవలం రూ.25 వేలతో కూడా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. అదేరండి బర్గర్ పాయింట్. దీనికోసం మీకు తప్పకుండా బర్గర్ తయారు చేయడం వచ్చి ఉండాలి. అప్పుడే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పని వారిని పెట్టుకుంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకవేళ మీకు బర్గర్ తయారీ రాకపోయిన సోషల్ మీడియాని ఉపయోగించుకుని నేర్చుకోవచ్చు. ఈ వ్యాపారానికి ఏం కావాలో తెలుసుకుందామా మరి.
వ్యాపారానికి అవసరమైనవి
దీనికి మీరు ఒక మంచి స్థలం చూసుకోవాలి. ఎక్కువ కాలేజీలు, స్కూల్లు, ఆఫీసులు ఉన్న స్థలం అయితే బెటర్. షాపు అయితే ఎక్కువ పెట్టుబడి కావాల్సి ఉంటుంది. అదే మీరు మీ సొంతంగా ఒక చిన్న స్టాల్ చేయించుకుంటే రూ.15 వేలలో అయిపోతుంది. క్రితం మ్యాగజైన్లో చెప్పుకున్నట్టు ఏ ఆహార వ్యాపారానికైన FSSAI చాలా అవసరం. దానితో పాటు స్థలానికి తగినట్టు లైసెన్స్లు కూడా అవసరం. ఈ లైసెన్స్ ఇవ్వడానికి రూ.16,500 వరకు ఖర్చు అవుతుంది. అలాగే వండటానికి ఇక చిన్న స్టవ్, గ్రిల్ చేయడానికి మిషన్, కావాల్సిన వస్తువులు అన్నిటికి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అవుతుంది. అలాగే ప్యాకింగ్కి కావాల్సిన వస్తువులు రూ.1500 అవుతుంది. మొత్తం కలిపి రూ.25 వేలతో వ్యాపారం ప్రారంభించవచ్చు.