ఈ రోజుల్లో అధికంగా వినిపిస్తున్న పేరు ELON MUSK. చాలామందికి ఒక స్ఫూర్తిగా నిలిచారు మస్క్. ఇంతలా ప్రజలను ప్రభావితం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మీరు మీ జీవితంలో అనుకున్నవి సాధించాలనుకుంటే MUSK పాటించిన అంశాలను మీరు ఆచరించాలి. మొదటిది క్రిటిసిజం, మనలో చాలామంది ఎవరైనా ఏ చిన్నమాట అంటే తట్టుకోలేం. కానీ మస్క్ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు ఏమి అన్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, అనుకున్నది సాధించాలనే ఆలోచిస్తారు. రెండోది తన మీద తనకు ఉన్న నమ్మకం. TESLA ప్రారంభంలో ఆ కంపెనీ మార్కెట్‌లో నడుస్తుందని ఎవరు నమ్మలేదు. కానీ మస్క్ తనను తాను నమ్మి TESLAను లాంచ్ చేశారు. తన నమ్మకమే విజయానికి తొలి మెట్టయింది. అతి తక్కువ రోజుల్లోనే ఇతర బ్రాండ్ కార్ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది.
మూడవది తాను చేయాలనుకుంది చేస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అని పట్టించుకోరు. తన పని తాను చూసుకుంటారు. చివరిది ఆయన ఆలోచన విధానం డబ్బు సంపాదించాలనే తన ఆలోచనతో చిన్నతనంలోనే ఒక వీడియో గేమ్ తయారు చేసి, 500 డాలర్లకు అమ్మారు. అంతేకాదు తాను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించేవారు. భూమి మీద సహజ వనరులు తక్కువ అవుతుండటంతో ప్రజలకు హాని కలుగుతుందని.. దీని కోసం ప్రజలను మార్స్ మీదకు తీసుకెళ్లాలనేదే మస్క్ లక్ష్యం. దీని కోసం తన ఆస్తి మొత్తం పణంగా పెట్టి మరీ.. SpaceX అనే రాకెట్స్ తయారు చేసే కంపెనీని ప్రారంభించారు. అది ఎన్నోసార్లు విఫలం చెందినా పట్టు వీడలేదు. చివరగా తాను తయారు చేసిన రాకెట్స్‌కు సక్సెస్ వచ్చింది. తాను విజయం సాధించే తరుణంలో ఎంతోమంది ఎన్నో సూటిపోటి మాటలతో ఆపాలని చూశారు. కానీ అవన్నీ పక్కకు పెట్టి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు మస్క్.