
తల్లి కన్నా ఉల్లి మేలు అంటారు. ఉల్లిలాగే.. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గించడం నుంచి రక్తహీనతను దూరం చేయడం వరకు వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు..
వెల్లుల్లిలోని యాంటీ క్లాటింగ్ గుణాల వల్ల గాయమైనప్పుడు శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ తో బాధపడేవారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తద్వారా గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు.
కానీ వివిధ రకాల శస్త్రచికిత్సలు, సర్జరీ లు చేయించుకునేవారు మాత్రం వెల్లుల్లి వినియోగం విషయంలో డాక్టర్ సజెషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
బరువు ఎక్కువగా ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారూ వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశముంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమే ఇందుకు కారణం. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటిలేదని చెప్పవచ్చు. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించి, శరీర బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.
వెల్లుల్లి తీసుకోనివారితో పోల్చితే.. తరచూ తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయని అధ్యయనాల్లో తేలింది. వీటితోపాటు వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడవు. అందుకే గొంతు నొప్పి, గొంతులో గరగర అనిపించినప్పుడు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
ప్రజెంట్ మనం లీడ్ చేసే లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల శరీరానికి సరైన పోషకాలు అందడం లేదు. ఫలితంగా రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో లాంగ్ టర్మ్ లో ఎనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు.